21, అక్టోబర్ 2011, శుక్రవారం

జనాభాపరంగా పెద్ద నగరాలు ఇవట..!



           భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌లోని నగరాల 2011 జనాభా లెక్కల వివరాలు చూసి రాస్తున్న పోస్టిది..! చిన్నప్పట్నుంచీ, ఆ ఊరు పెద్దదా..? ఈ ఊరు పెద్దదా..? అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ ఉన్న ఆ వెర్రి కారణంగా ఈ పోస్ట్‌ రాస్తున్నాను..   భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌ లింకిదిగో.. ఇంకేమన్నా వివరాలు కావాలంటే వెళ్లి చూస్కోండి..!

                                                                                              
నగరం
జనాభా
ముంబయి (Mumbai)
18,414,288
దిల్లీ (Delhi)
16,314,838
కోల్‌కత (Kolkata)
14,112,536
చెన్నై (Chennai)
8,696,010
బెంగుళూరు (Bengaluru)
8,499,399
హైదరాబాద్‌ (Hyderabad)
7,749,334
అహ్మదాబాద్‌ (Ahmadabad)
6,352,254
పూణే (Pune)
5,049,968
సూరత్‌ (Surat)
4,585,367
జయపూర్‌ (Jaipur)
3,073,350
కాన్పూర్‌ (Kanpur)
2,920,067

రాష్ట్రంలో..

నగరం
జనాభా
హైదరాబాద్‌
7,749,334
విశాఖపట్టణం
1,730,320
విజయవాడ
1,491,202
వరంగల్లు
759,594
గుంటూరు
673,952
నెల్లూరు
564,148
రాజమండ్రి
478,199
కర్నూలు
478,124
తిరుపతి
459,985
కాకినాడ
442,936

                ఇవన్నీ కాకిలెక్కలేనని నాకనిపిస్తోంది...! లేకపోతే మా కాకినాడ జనాభా 4 లక్షలా..? అన్నీ తప్పుడు లెక్కలే..! 8 లక్షలకి ఒక్కటికూడా తక్కువుండని ఊరది..! ముంబయి కన్నా ఎంతో పెద్ద నగరమైన దిల్లీనేమో రెండో స్థానంలోకి తోసేసారు.. గాజియాబాద్‌, గురుగావ్‌, ఫరీదాబాద్‌ లాంటి పక్క ఊళ్లకి వేరు లెక్కలెయ్యడం వల్ల వచ్చినదది..! "జాతీయ రాజధాని ప్రాంతం  (National Capital Region)" అన్నీ లెక్కలేసుకుంటే మూడు కోట్ల అంకెని ఇంచుమించు తాకుతుంది. దిల్లీ జనాభా, అందులో సగం..? ఈ "జాతీయ రాజధాని ప్రాంతం",  దిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌, నొయిడా (ఇక్కడే భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్‌ రేస్‌ కోర్స్‌ నిర్మితమౌతోంది.), మీరట్‌, హరియాణలోని గురుగావ్‌, ఫరీదాబాద్‌, సోనీపట్‌.. ఇలా పక్క రాష్ట్రాల్లోకి విస్తరించిపోయి ఉంది. ఇవేమీ దిల్లీ నగరపరిధిలోకి తీసుకోలేదు..
                రాష్ట్రంలో నాలుగో స్థానంలో (కనీసం ఐదో స్థానం) ఉన్న మా కాకినాడని పదో స్థానానికి తోసెయ్యడం కూడా, ఇంతే..! ఎంత అన్యాయం..? (సరదాగా అంటున్నాను.. సీరియస్‌ అవ్వకండి..!)


( కింది వివరాలు అసందర్భమైనా, వేరే పోస్ట్‌ రాయడం ఇష్టం లేక రాస్తున్నాను..!

  కొన్ని ఉపయుక్తమైన ధార్మిక వెబ్‌సైట్లు

6 కామెంట్‌లు:

  1. నాకైతే కాకినాడ జనాభా అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. ఒకటి మాత్రం నిజం, కాకినాడలో రోడ్లని గుర్తు పెట్టుకోవడం కష్టం. రాజోలులో ఉండే రోజుల్లో యానాం మీదుగా కాకినాడ ఎన్నో సార్లు వెళ్ళిన నేనే ఆ రోడ్ల మెలికలని గుర్తుంచుకోలేను.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణగారూ...!

    మీ వ్యాఖ్య ఉద్దేశ్యం నాకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. కొన్ని ఊళ్లు మనం తేడాగా రాస్తూ ఉంటాం.. "జయపూర్‌"..ని "జైపూర్‌".., "దిల్లీ"..ని "ఢిల్లీ"..అని.! నాకు ఈ అసలు పేర్లు రూర్కీకి రాకముందు తెలీదు. ఎవడైనా నాలాంటివాడు ఉంటే, వాడ్ని కన్ఫ్యూజన్‌ నుండి తప్పించడానికి, పక్కన ఇంగ్లీషులో రాసాను. అంతే..!

    ఏదేమైనా నా పోస్ట్‌ సందర్శించినందుకు ధన్యవాదాలు.!

    రిప్లయితొలగించండి
  3. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48,000. మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో అతి పెద్ద పట్టణం అదే. కాకినాడ తరువాత విశాఖపట్నం (40,000) రెండో అతి పెద్ద పట్టణం, ఆ తరువాత మచిలీపట్నం (39,000) మూడో అతి పెద్ద పట్టణం, ఆ తరువాత విజయనగరం (37,000) నాలుగో అతి పెద్ద పట్టణం, రాజమండ్రి (36,000) అయిదో అతి పెద్ద పట్టణం, ఏలూరు (33,000) ఆరో అతి పెద్ద పట్టణం, నెల్లూరు (32,000) ఏడో అతి పెద్ద పట్టణం, గుంటూరు (30,000) ఎనిమిదో అతి పెద్ద పట్టణం, కర్నూలు (25,000) తొమ్మిదో అతి పెద్ద పట్టణం, విజయవాడ (24,000) పదో అతి పెద్ద పట్టణం.

    రిప్లయితొలగించండి
  4. ప్రవీణ్‌ గారూ..!

    మీరు చెప్పింది, ఈ కింది లింక్‌ నుండేననుకుంటా..!
    http://www.1911encyclopedia.org/Main_Page

    BY the way, హైదరాబాద్‌, మద్రాసు, అప్పట్లో దిల్లీ కన్నా పెద్దవి

    రిప్లయితొలగించండి
  5. ఆ లింక్ నుంచి కాదు, సౌత్ ఇండియా గజెటీర్ నుంచి సేకరించిన వివరాలు అవి. 1901లో ఢిల్లీ ఇంకా మన దేశ రాజధాని కాదు. అప్పట్లో కలకత్తా మన దేశ రాజధాని, సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది.

    రిప్లయితొలగించండి