30, అక్టోబర్ 2013, బుధవారం

కళింగ & ఆంధ్ర (పాత పేరు: ఉత్తర సర్కారులు) - 2

చిత్రపటాలు:


మద్రాసు ప్రెసిడెన్సీలో కళింగ ఆంధ్ర (ఉత్తర సర్కారులు)


ఇప్పటికిప్పుడు ఏర్పడబోయే కళింగఆంధ్ర (పెను రాయలసీమ వీడిన తరువాత)


సరిగ్గా పోరాడగలిగి, రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని(SRC) తీసుకురాగలిగితే ఏర్పడబోయే రాష్ట్రం 

(గమనిక: ఒంగోలు తాలూకా మరియు కృష్ణా-గుంటూరు , ఖమ్మం-నల్గొండ మధ్య జరిగిన ఇచ్చిపుచ్చుకోడాల మీద స్పష్టమైన సమాచారం నా వద్ద లేదు)


పైని రెండు పటాలు నెట్ వెతుకులాట లో దొరికినవి, క్రిందినున్న రెండు పటాలు  వెబ్ సైట్ లో దొరికిన పటాలకి నేను చేసిన దిద్దుబాట్లు. 
          
జిల్లాలు:

ప్రస్తుతం: శ్రీకాకుళంవిజయనగరంవిశాఖపట్నం,తూర్పు గోదావరిపశ్చిమ గోదావరికృష్ణాగుంటూరుప్రకాశం (ఒంగోలు తాలూకా ). 

భవిష్యత్తులో కలువవలసిన/కలిసే అవకాశం ఉన్న జిల్లాలు : గంజాం ()గజపతి()రాయగడ ()కోరాపుట్టి ()మల్కానగిరి ()నవరంగపూర్ ()సుకుమా (.)దంతేవాడ (.),జగదల్ పూర్/బస్తర్ (.) పూల్ బని ()లు

కొత్తగా ఏర్పాటు చేయవలసినవి
మన్నెం (భద్రాచలం + రంపచోడవరం ), రాజమండ్రి, కోనసీమ(అమలాపురం), పలనాడు(మాచర్ల), బాపట్ల, ఒంగోలు, విజయవాడ, నరసాపురం/భీమవరం, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, అరకు, బొబ్బిలి/పార్వతీపురం, పలాస-కాశీబుగ్గ (పాలబుగ్గ), అనకాపల్లి.

రావలసిన అభివృద్ధి ప్రాజెక్టులు:

కొత్త రాష్ట్రాలకిచ్చే సాధారణ రాయితీలుమినహాయింపులతో బాటు కిందివి కూడా ఇవ్వాలి.
  1. జలయజ్ఞంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. వాటిల్లోకొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి. నెల్లూరుప్రకాశం (ఒంగోలు తాలూకా మినహా)తో కలిపిన పెను రాయలసీమ (Greater Rayalaseema) ప్రాజెక్టులనుఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను వదిలివేయడం జరిగింది.
    • ఇందిరా సాగర్ (పాత పేరు: రామపాద సాగర్) పోలవరందుమ్ముగూడెంభూపతిపాలెం జలాశయంకొవ్వాడ కాలువచాగలనాడు ఎత్తిపోతల పథకంముసురుమిల్లిపుష్కరం ఎత్తిపోతల పథకంసూరంపాలెం జలాశయంతాడిపూడి ఎత్తిపోతల పథకంతొఱ్ఱిగెడ్డ ఎత్తిపోతల పథకంవేంకటనగరం జలాశయంఎఱ్ఱకాలువ జలాశయం. 
    • కె.ఎల్ రావు బహుళార్థక నీటిపారుదల పథకం (పులిచింతల)తారకరామ కృష్ణవేణి ఎత్తిపోతల పథకం
    • గుండ్లకమ్మ జలాశయం
    • వంశధార ప్రాజెక్టు 1వంశధార ప్రాజెక్టు - 2
    • ఝంఝావతి జలాశయంతోటపల్లి ఆనకట్టపెద్దగెడ్డ జలాశయంతారకరామ తీర్థ సాగరం,
    • హదువా ప్రాజెక్టు (ఒరిస్సా)
    • తెలుగు గంగ (రాయలసీమకై)
  2.  సాగర మాల :  గతంలోఎన్డీయే గవర్నమెంటు "సాగర మాల" ప్రాజెక్టు కింద ఓడరేవులన్నిటినీ అనుసంధానం చేద్దామనుకుంది. కానీ మరుసటి ఎలక్షన్లలో ఓడిపోడంతోఅది పక్కకు పోయిందిఇప్పుడైనాదేశం అంతా కాకపోయినాఆంధ్రా ప్రాంతం వఱకైనా "సాగరమాల"ని మొదలుపెట్టాలి. ముక్కలు ముక్కలుగా కాకుండాఒకే బృహత్ ప్రాజెక్టుగా చేపట్టాలి.
    • కళింగపట్నం - భీమునిపట్నం - విశాఖపట్నం - గంగవరం - కాకినాడ - యానాం - అమలాపురం - నరసాపురం - మచిలీపట్నం - రేపల్లె - నిజాం పట్నం - బాపట్ల వఱకూ రైలు లైన్లు. 
    • చిలుక సరస్సు నుండి పులికాటు సరస్సు వఱకూ సముద్ర తీరం వెంబడి 6 వరుసల రాదార్ల(6-Lane Highways)ను నిర్మించాలి.  
  3.  దండకారణ్యాన్ని మిగతా భారతంతో అనుసంధానం చేయడానికో ప్రత్యేక ప్రాజెక్టు ప్రకటించాలి. వీలుని బట్టి, ‘కొంకణ రైలు నిగమ్’ (Konkan Railway Corporation) ఏర్పరచిన రీతిలో దండక రైలు నిగమా” (Dandaka Railway Corporation)న్ని విశాఖపట్నం/భద్రాచలం లో ఏర్పాటు చేయాలి లేదా K. R. C.కి  బాధ్యతలు అప్పగించాలి ప్రాజెక్టులో భాగంగా భద్రాచలందంతెవాడ పట్నాల కి అన్ని దిక్కుల నుండి రైలు లైన్లు రావాలి.  రావలసినవాటిల్లో కొన్ని లైన్లు ఇవి
    • వరంగల్లు (తె.) భద్రాచలం  - చింటూరు - గుర్తేడు - నర్సీపట్నం విశాఖపట్నం.
    • భద్రాచలం - చింటూరు - రంపచోడవరం - జగ్గంపేట సామర్లకోట
    • అరకు/నర్సీపట్నం - మల్కనగిరి (ఒ) - కిరండుల్(ఛ.గ) -భోపాలపట్నం - రామగుండం(తె) 
    • భద్రాచలం – (కొత్తగూడెం (తె.) - ఖమ్మం) - సూర్యాపేట - నల్లగొండ
    • కైకలూరు - ఏలూరు - జంగారెడ్డిగూడెం - కొత్తగూడెం(తె)
    • అమలాపురం - రాజమండ్రి - కొయ్యలగూడెం - భద్రాచలం 
    • మణుగూరు - భూపాలపల్లి రామగుండం
    • కొయ్యలగూడెం - పోలవరం - రంపచోడవరం - అడ్డతీగల - నర్సీపట్నం - పాడేరు అరకు - పార్వతీపురం
  4. కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోరచంద్ర సూర్యనారాయణ దేవ్ ప్రతిపాదించిన విధంగాభారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ)జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్..టీ)భారతీయ నిర్వహణ సంస్థ (ఐఐఎం), అఖిల భారత వైద్యవిజ్ఞానసంస్థ (ఎయిమ్స్)గిరిజన విశ్వవిద్యాలయంకేంద్రీయ తెలుగు & దక్షిణమధ్య ద్రావిడ భాషా విశ్వవిద్యాలయంతదితర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడంతో బాటుహైదరాబాదులోని జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థజాతీయ వాతావరణ పరిశోధనల సంస్థ వంటి పరిశోధనాసంస్థలను కళింగ & ఆంధ్ర ప్రాంతానికి మార్చాలి. ఇప్పటికే ప్రతిపాదించిన సంస్థలు ఐఐఐటీ(కాకినాడ)కేంద్రీయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం) వంటివాటిని వెంటనే ఆమోదించి 1-2 యేళ్లలో పూర్తిస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లూకృషీ చేయాలి. రావలసిన విద్యాసంస్థలలో కొన్ని ముఖ్యమైనవి. 
    • భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ), (ప్రతిపాదిత స్థలం - మచిలీపట్నం) - Indian Institute of Technology
    • భారతీయ నిర్వ్హహణ సంస్థ (ఐఐఎం), (ప్ర. స్థ - విజయవాడ/కాకినాడ/గుంటూరు) - Indian Institute of Management 
    • అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), (ప్ర. స్థ - విశాఖపట్నం) - All India Institute of Medical Sciences
    • గిరిజన విశ్వవిద్యాలయం (ప్ర.స్థ - అరకు/భద్రాచలం/నర్సీపట్నం) - Tribal University
    • కేంద్రీయ తెలుగు & దక్షిణ మధ్య ద్రావిడ భాషా విశ్వవిద్యాలయం (బొబ్బిలి/ రాజాం/ రాజమండ్రి) - Central Telugu & South Central Dravidian Languages University
    • జాతీయ మత్స్య, సముద్ర అధ్యయన విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం జిల్లా/ కాకినాడ/ విశాఖపట్నం) - National University of Fisheries & Ocean Studies
    • భారతీయ సమాచార వ్యవస్థల సంస్థ (ప్ర స్థ - విజయవాడ) - Indian Institute of Mass Communication
    • జాతీయ విదుచ్ఛక్తి శిక్షణా సంస్థ (ప్ర స్థ - సామర్లకోట/విజయవాడ) - National Power Training Institute
    • జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం (అమలాపురం/భీమవరం) - National Agricultural University 
    • భారతీయ వ్యవసాయ పరిశోధనల సంస్థ (భీమవరం/అమలాపురం) - Indian Agricultural Research Institute
    • జాతీయ ఫార్మా విద్య మరియు పరిశోధనల సంస్థ (విశాఖపట్నం/విజయనగరం జిల్లా) - National Institute of Pharmaceutical Education and Research
    • జాతీయ కూచిపూడి నాట్య విద్యాలయం (కూచిపూడి) - National Institute of Kuchipudi Classical dance.
  5. విశాఖపట్నం కేంద్రంగా రైలు మండలాన్ని ఏర్పాటుచేయాలి. దక్షిణ మధ్య, తూర్పు కోస్తా రైలు మండలాల్ని చీలుస్తూ వాల్తేరు, విజయవాడ, గుంటూరు రైలు విభాగాలతో కొత్త మండలాన్ని ఏర్పరచాలి, లేదా కేంద్రమంత్రి కిశోర చంద్ర దేవ్ ప్రతిపాదించిన విధంగా తూర్పు కోస్తా రైలు మండల కేంద్రాన్ని విశాఖకి మార్చి, అందులోని ఖుర్దా రోడ్ విభాగాన్ని దక్షిణతూర్పు రైలు మండలానికిచ్చేసి, దక్షిణ మధ్యరైలు మండలంలోని గుంటూరు, విజయవాడ విభాగాలని తూర్పుకోస్తా రైలు మండలంలో కలిపివెయ్యాలి. పూర్తి చేయవలసిన రైలు మార్గాలు (పైన పేర్కొన్నవి కాకుండా
    • ఒంగోలు అద్దంకి నరసారావుపేట సత్తెనపల్లి అచ్చంపేట 
    • ఒంగోలు పొదిలి కనిగిరి బద్వేలు కడప రాయచోటి మదనపల్లి బెంగుళూరు
    • పొదిలి దొనకొండ మాచర్ల దేవరకొండ హైదరాబాదు. 
  6. వైజాగ్ లో మూడు దశాబ్దాలక్రితం స్థాపించిన ఉక్కు కర్మాగారం తప్ప, ఆంధ్ర ప్రాంతంలో మఱో భారీ పరిశ్రమ ఏదీ లేదు. అందువలన, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం స్థానికులు, హైదరాబాదు, ముంబయి, చెన్నై, బెంగుళూరు, గుజరాత్, గల్ఫ్ అమెరికా తదితర ప్రాంతాలకి వలసపోతున్నారు. అందువలన, స్థానికంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు. 
    • కాకినాడ / రాజమండ్రిలో ఆంధ్ర చమురు సంస్థ (Andhra Petroleum Corporation Limited)”
      • కృష్ణ-గోదావరి హరివాణం (Krishna - Godavari Basin)లోని అన్వేషణలలో ఈ సంస్థకి, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 
    • నర్సీపట్నం/విజయనగరం లో కళింగ ఖనిజాభివృద్ధి సంస్థ (Kalinga Mineral Development Corporation  Limited)”
    • మచిలీపట్నం / కాకినాడ/ విశాఖపట్నంలో సర్కార్ నౌకాయాన సంస్థ (Circar Shipping Corporation Limited)” వంటివాటిని ఏర్పరచాలి
      • భారతదేశపు తూర్పు చూపు (Look East)విధానంలో, ఈ సంస్థకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 
    • హిందుస్తాన్ చమురు సంస్థ (HPCL), రిలయన్స్ పరిశ్రమల సంస్థ (RIL) వంటి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు భారీ రిఫైనరీలను నిర్మించాలి. 
    • కాకినాడ వద్ద నౌకానిర్మాణ కేంద్ర సముదాయాన్ని(Shipbuilding Complex), విశాఖపట్నానికి ఉత్తరంగా (అనువైన ప్రదేశంలో) నౌకా నిర్మాణకేంద్రాన్ని స్థాపించాలి. 
    • మచిలీపట్నం వద్ద, భారీ ఓడరేవు(Major)ని ఏర్పాటు చేయాలి. 
    • 1956 అనంతరంహైదరాబాదులో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వసంస్థల్లో 25%న్ని కళింగ & ఆంధ్రకి పూర్తిగా తరలించాలిలేదా వాటిల్లో 40% సంస్థలు తమ కార్యకలాపాలని కళింగ & ఆంధ్రలో పెద్దయెత్తున విస్తరించాలి. 
    • మధురవాడ/తగరపువలస (విశాఖపట్నం), సర్పవరం/పిఠాపురం(కాకినాడ),  విజయవాడ లలో సైబర్ టవర్లను ఏర్పాటుచేసి సైబర్ పేట లను ఏర్పాటుచేయాలి. హైదరాబాదులో ప్రతిపాదించిన "సమాచార సాంకేతికతల పెట్టుబడుల సీమ (Information Technology Investment Region)లో తగినంత వాటాని ఈ మూడు ప్రాంతాలలో వికేంద్రీకరించాలి.  
  7.  నదులువాగులుయేర్ల మీద రాదార్లువంతెనలు కట్టడానికినిర్వహించడానికి ఆంధ్రా రాదార్లు మరియు వంతెనల సంస్థ (Andhra Roads & Bridges Corporation Limited)”ని  విజయవాడ లో, ఏర్పరచాలి. అందులో తుఫానులువరదలుసునామీలు తదితర వైపరీత్యాలకు అనుగుణంగా వేగవంతంగా పునరుద్ధరణలు చేయగలిగే పటిష్ట యంత్రాంగం, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలి. 
    • వరద ప్రభావానికి లోనయ్యే ప్రాంతాలు, కృష్ణ - గోదావరి డెల్టాలలో కరకట్టలు నిర్మించడం, గట్లని ఆధునికీకరించడం, వంతెనలు నిర్మించడం వంటివి వేగంగా పూర్తిచేయాలి. 
    • వాగులు, దొంగేర్లు, వచ్చే ప్రాంతాలలో వాటిపై సర్వేలను, పరిశోధనలను చేసి, శాశ్వత పరిష్కారాలుగా వంతెనల, గట్ల నిర్మాణాలు పూర్తిచెయ్యాలి. 
  8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదుకి తరలిన కేంద్రరాష్ట్ర ప్రభుత్వసంస్థలన్నీ స్వస్థలాలకి మళ్ళాలి (ఉదా: ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని మచిలీపట్నానికి మార్చాలి). కళింగ & ఆంధ్ర ప్రాంతంలో కార్యకలాపాలు కేంద్రీకృతమై తెలంగాణతో సంబంధం లేని సంస్థలన్నీ (ప్రభుత్వమైనా ప్రైవేటువైనా)హైదరాబాదుని వదిలేసి కళింగ &ఆంధ్ర రాజధానికి గానీఆయా సంస్థల కార్యకలాపాల కేంద్రం లేదా జిల్లా కేంద్రాలకి గానీ మళ్ళాలి. (ఉదా: .ఎన్.జి.సీ ప్రాంతీయ కార్యాలయంకాకినాడ డీప్ వాటర్ పోర్టునాగార్జున ఎరువుల కర్మాగారంకోరమాండల్ ఎరువుల కర్మాగారం).
  9. ఇంటిని ముందు చక్కబెట్టుకో” అనే ఆదర్శాన్ని ప్రచారం చేస్తూదేశవిదేశాలలో స్థిరపడిన కళింగ & ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలుసంస్థలు తమ కార్యకలాపాలని కళింగ & ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించాలి. ప్రభుత్వాలకి చెల్లించే పన్నులని కళింగ & ఆంధ్ర రాష్ట్రం నుండి చెల్లించే ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడి ఆదాయాన్ని పెంచాలి.
  10.  అరవైయేళ్లకాలంలో రాజధాని (హైదరాబాదు)లో సేవలందించి విశ్రాంతులై స్థిరపడ్డవారినిఇచ్ఛానుసారం ఉండనివ్వాలి(హైదరాబాదులోగానీస్వస్థలంలోగానీ). వారు స్థిరపడిన ప్రాంత ప్రభుత్వమే, వారి జీతభత్యాలను చెల్లించాలి. 
  11. లోకసభరాజ్యసభఅసెంబ్లీస్థానాలు: 1971 జనాభా లెక్కల ప్రకారంస్థానాల సంఖ్యని కేటాయించిపునర్విభజన చేపట్టాలి.  
    

     (ఇప్పటికి అయిపోయింది - రాయలసీమపై తర్వాతి పోస్టు )

Links for Irrigation Projects (OnGoing)