3, అక్టోబర్ 2011, సోమవారం

ఆర్యులు- ద్రవిడులు...



నాకు తెలిసున్నవీ, చదివున్నవీ నాల్గు ముక్కలు ఇక్కడ రాసేస్తే, ఓ పనైపోతుందని మొదలెడుతున్న పోస్టిది..! ఇక్కడ రాయబోయే విషయాలమీద నాకేమీ డీప్‌ నాలెడ్జి లేదు...! సో.. చదివేయండంతే..! బ్లాగ్లోకంలో ఇప్పటికే, దీనిమీద ఎన్నో వాదోపవాదాలు జరిగిపోయి ఉన్నాయి. అర్యులు, ఎక్కణ్నుంచో వచ్చారని కొందరూ, ఇక్కడివారేనని ఇంకొందరూ, ..ఈ డిస్కషన్‌ అంతా ఎందుకు..? అందరూ ఆఫ్రికా నుండే, వచ్చారని ఇంకొందరూ.. వాదించేసుకున్నారు/నిరూపించుకున్నారు...ఇలా చాలా చాలా చేసారు

కమ్యూనిస్టులు, హేతువాదులు చెప్పే పనికిమాలిన సుత్తిలో ఒకటైపు సుత్తేంటంటే "పుక్కిటి పురాణాలు..".."రామాయణం రంకూ..భారతం బొంకూ.."..ఇలా..! మన సంస్కృతి (అందులో హిందూ సంస్కృతి) అంటే, విపరీతమైన వెటకారం వాళ్లకి..! పుక్కిటి పురాణాలని కొట్టి పడెయ్యకుండా ఒక్కసారి తిన్నగా చదివితే, "ఆర్య- ద్రవిడ" సిద్ధాంతానికి కూడా ఆధారాలు దొరుకుతాయి మన పురాణాలలో.! ఈరోడ్‌ రామస్వామి పెరియార్‌, రామస్వామి చౌదరి అలాగే కదా..రామయణాన్ని, అర్యులు, ద్రవిడుల యుద్ధాలుగా వర్ణించారు.

ఇంక అసలు విషయానికి వద్దాం..! అందరికీ తెలిసిన విషయాలు..మనకి పద్దెనిమిది పురాణాలూ, పద్దెనిమిది ఉపపురాణాలూ, లెక్కకందని స్థలపురాణాలూ, కులపురాణాలు ఉన్నాయి కదా..! అందులో ఒకటి .."భవిష్య మహా పురాణం.."..ఎవరైనా చదవడానికి ఆసక్తిగా ఉంటే, గ్రేటర్‌ తెలుగు డాట్‌ కామ్‌లోని ఈ  లింక్‌ చూసుకోండి..

ఇంకో లింక్‌ కందుల సత్య శారద (బహుశా తెలుగావిడే అనుకుంటా..!)..అనే ఆవిడ... పురాణాలను పరిశోధించి, ఎవరెవరు ఎక్కడి వారో, ఎప్పుడు వచ్చారో, రాయడానికి ప్రయత్నం చేస్తోంది..! ఆవిడ అర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని బలపరిచే ఒక కథని "భవిష్య పురాణం"లో చూపించింది.. ఈ కథ అంతకుముందే చదివాను కానీ., ఆవిడ రాసిన వ్యాసం చదివిన  తరవాతే, నాకూ తెలిసింది. ఈ కథ.. "అర్య-ద్రవిడ" సిద్ధాంతాన్ని బలపరిచేలా ఉందని..!

ఆ కథ ఉన్నదున్నట్టు..
//కలిలో వేయి సంవత్సరములు గడువగా స్వర్గమునుండి కాశ్యపుడను ద్విజుడు దేవాజ్ఞచే భూమికి బ్రహ్మావర్తమునకు వచ్చెను. అతని భార్య "ఆర్యావతి". వానికి పదిమంది కుమారులు గలిగిరి. ఉపాధ్యాయుడు, దీక్షితుడు, పాఠకుడు, శుక్లుడు, మిశ్రకుడు, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, పాండ్యుడు, చతుర్వేది అనువారు పేరులకు దగిన గుణము గలవారు. అందు కాశ్యపుడు కాశ్మీరమునకేగి సరస్వతిని ఎర్రని పుష్పాక్షతలచే బూజించి ధూపదీపాదులచే నైవేద్యములచే దృప్తిపరచి స్తుతించి మ్రొక్కుకొనెను. "అమ్మా! శంకరార్థాంగీ! నాయెడనీకేల దయరాదు? నీవు జగదంబవుకదా! ఏల్‌ జగమ్ముల కరుదేరవు. నీవు సుర కార్య నిమిత్తముగా ద్రోహియగు మ్లేచ్ఛునేల సంహరింపవు? ఉత్తమ సంస్కృతమును బాలింపుము. మ్లేచ్ఛులను వేగమే మోహింపజేయుము. నీవు బహురూపవు. ఒక్కహుంకారముచే ధూ మ్రలోచనుం గడతేర్చితివి. భయమకరుడైన యూ దైత్యుని దుర్గవయి యేల సంహరించి జగమ్ములకు సుఖంబు సేయవు? దంభము, మోహము, ఘోరమైన గర్వమును హరించి సుఖమునెల్ల యెడల చేయుదానవు. జగద్రోహులను వెంటనే కూల్పుము. అమ్మా! లెమ్ము! అని యిట్టులనిన నయ్యంబ వాని మనమున వసించి యుత్తమ జ్ఞానము ననుగ్రహించెను. అంతట నమ్ముని మిశ్రదేశమున (ఈజిప్టు) కేగి మ్లేచ్ఛులందరిని విద్యాబలముచే మోహపెట్టి అందు బదివేలమందిని దన శిష్యులను గావించుకొనెను. రెండు వేలమంది వైశ్యులను, మిగిలినవారిని శూద్రులను గావించుకొనెను. వారిం దీసికొని యార్యదేశమునకు సరస్వతీ ప్రసాదమువలన నేతెంచెను. ఆర్యసమూహములు దేవీప్రసాదమున గ్రమముగా నాలుగు కోట్లమంది స్త్రీపురుషులుగా వృద్ధిగాంచిరి. కాశ్యపుడే వారికి రాజయ్యెను. అతడు నూట యిరువది యేండ్లు పాలకుడయ్యెను//
చదివారు కదా..! దీన్ని ప్రత్యేకంగా విశ్లేషించవల్సిన అవసరం లేకపోయినా, శారదగారి వ్యాసం లోని కొంతభాగాన్ని తెనిగించుతున్నాను.

కలియుగం ప్రారభమైన వెయ్యేళ్ల తర్వాత..(కలియుగం క్రీ. పూ. 3102 ప్రాంతంలో ప్రారంభమైందని నిర్ధారించారు కదా..! అప్పటికి వెయ్యేళ్ల తర్వాత)..అంటే సుమారు క్రీ. పూ. 2000లో. కశ్యపముని, అర్యావతి బ్రహ్మావర్తానికి వచ్చారు. (బ్రహ్మావర్తం అంటే అఫ్ఘనిస్థాన్‌ ప్రాంతం అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా..!). కాశ్మీరంలోని సరస్వతిని (ఈ శక్తిపీఠం పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కి 150 కి.మీ దూరంలో ఉందని అంతర్జాలంలోనే ఎక్కడో చదివాను.!) ఆరాధించి, ఆశీస్సులు పొందారు.

వారి కొడుకులు ఉపాధ్యాయ్‌, దీక్షిత్‌, పాఠక్‌, శుక్లా, మిశ్రా, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, చతుర్వేది, పాండేయ్‌ (పాండే).. ఇవి ఉత్తరభారతంలోని బ్రాహ్మణుల గోత్రనామాలు (ఇంటి పేర్లు, surname) అని చాలామందికి తెలుసు.
ఆయన మిశ్రదేశానికి వెళ్లి అక్కడి మ్లేచ్ఛులను వశపరుచుకున్నాడు. పైన ఇచ్చిన "భవిష్య పురాణం" పుస్తకంలో మిశ్రదేశం అంటే ఈజిప్టు అని రాసారు గ్రంధకర్త. వారి దేశం గురించి ఈవిడేమీ ప్రస్తావించలేదు. కేవలం "మిశ్ర"..అంటే "mixed" అని వదిలేసింది. మరి ఆయన మిశ్రదేశాన్ని ఈజిప్టు అని ఎలా చెప్పారో తెలీదు.

వారిలో 10,000 మందిని ద్విజులుగా (బ్రాహ్మణులుగా), 2,000 మందిని వైశ్యులుగా, తక్కినవారిని శూద్రులుగా మార్చి, ఆర్యావర్తానికి వచ్చాడు. వారే.. "ఆర్యులు..". నెమ్మదిగా వారి సంఖ్య నలభై లక్షలుగా వృద్ధి చెందింది. కాశ్యపుడే వారికి రాజై 120 సంవత్సరాలు పరిపాలించాడు.
                ఆవిడ నిర్ధారణలు ఇంకా చాలా ఉన్నాయి. "అర్య".."ఆర్య"..రెండు వేర్వేరు శబ్దాలనీ, ఒకటి జాతినీ, ఇంకొకటి గుణాన్ని సూచిస్తుందనీ, ఏదో అలా సాగిపోయింది ఆ పరిశోధన. ఇంతకీ నేను చెప్పొచ్చేమిటంటే.. "నిజానిజాలు పెరుమాళ్లుకెరుక"...

ఈ వాదనలని ఖండిచేవీ, సమర్థించేవీ అనేక కథలూ, వాదాలూ "భవిష్య పురాణం"లో ఉన్నాయి. అవి తర్వాత పోస్టులో రాస్తాను.


(కొనసాగింపు)

6 కామెంట్‌లు:

  1. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆర్యులకీ, ద్రవిడులకీ మధ్య ముఖ పోలికలలో స్పష్టమైన తేడా ఉందనేది నిజం. నా ముఖం చూసి నన్ను ఉత్తర భారతీయుడు అనుకునేవాళ్ళు ఉన్నారు. మొన్న జగ్‌దల్‌పుర్ దగ్గర లోహండిగూడ గ్రామంలో నన్ను పట్టుకుని ప్రశ్నించిన పోలీస్ అధికారి నేను ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చానని చెపితే నమ్మలేదు. ఆంధ్రా లోగ్ ఇత్‌నా గోరా నహీ దిఖ్‌తే హై (ఆంధ్రావాళ్ళు ఇంత తెల్లగా కనిపించరు) అని అన్నాడు. జాత్యాంతర వివాహాలని ఎంత నిషేధించినా జాత్యాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కొందరైనా ఉంటారనీ, ఆర్య రక్తం కొంత వరకైనా ద్రవిడ రక్తంలో కలుస్తుందనీ, కొందరు ద్రవిడులైనా ఆర్య పోలికలతో జన్మిస్తారనీ అతనికి తెలియదు.

    రిప్లయితొలగించండి
  2. సత్య శారద గారు తెలుగువారే వారి నివాసం బెంగుళూరు. వారితో పరిచమున్నవారితో నాకు పరిచయం వుంది.

    yūnān-o-miṣr-o-romā sab miṭ gaʾe jahāñ se
    ab tak magar hai bāqī nām-o-nishāñ hamārā

    "గ్రీకులూ, ఈజిప్షియనులూ (మిస్రీలూ) రోమనులూ పోయారుగానీ
    నేతికీ మా సాంస్కృతిక ఆనవాళ్ళలాగే వున్నాయి"

    అనే ఈ షేరు "సారే జహా సె అచ్చా" లోనిది. సంస్కృతం సంగతి తెలీదుగానీ మిస్ర్ అంటే ఈజిప్టే ఉరుదూలో. ఒక ప్రముఖ ఈజిప్షియన్ ఆల్ కాయిదా కమాండరు పేరులోకూడా "మిస్రీ" అనే suffix విన్నట్లు గుర్తు.

    ఈ పురాణ approach గురించి తెలీదుగానీ. ఆర్యులు ద్రావిడులపై "దండెత్తి రావడానికి" కొన్ని వేల సంవత్సరాల ముందుకాలానికి చెందిన ఆర్యుల నాగరికతా చిణాలు తవ్వకాల్లో బయల్పడ్డాయట. ఇక Theory of Aryan Invasion ని జనాలమీదకి వదిల్లిన మక్స్ ముల్లర్ మహాశయుడే దాన్ని ఖండించినట్లు చెబుతారు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా,

    మీరు ఆ బ్లాగు ఈ బ్లాగు నుండి ముక్కలు ముక్కలుగా ఏరి ఇక్కడ పెట్టక్కర్లేదు గాని genuine గా కొన్ని పుస్తకాలు చదివి పరిశొధన చేసి మీ సొంత అభిప్రాయాలు, అనుకోలు పంచుకుంటే సంతోషిస్తాము.

    రిప్లయితొలగించండి
  4. AIT/AMT is not a single point arguments to which one can draw conclusions. Please go through AIT and comeup with points either that supports them or negates them. I know you are just posting a brief of what you have gone through but it instigates many things as these always lie around the controversial theories.

    రిప్లయితొలగించండి
  5. @ ఇండియన్‌ మినర్వాగారూ..!
    నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు...! మీరిచ్చిన సమాచారం కూడా చాలా బాగుంది.
    @ కృష్ణగారూ..!
    నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు..! "genuine" రీసెర్చ్‌ చేసి రాయమన్నారు. మనదేశంలో రీసెర్చ్‌ ఇలాగే ఏడిసింది. అక్కణ్నుంచి, ఇక్కణ్నుంచి కాపీ కొట్టేసి, థీసిస్‌ సమర్పించేస్తూ ఉంటాం. ముఖ్యంగా మాలాంటి ఇంజనీరింగ్‌ విద్యార్ధులు..! దీనికి ఐ ఐ టీ అనిగానీ, అప్పలమ్మ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అనికానీ తేడా ఏమీ లేదు.
    మీరన్నట్టుగా, ఒకటీ, రెండూ చదివేసి నిర్ధారణకి వచ్చెయ్యకూడదు. కానీ, AIM గురించి మళ్లీ మొదలుపెడితే "రెడ్డొచ్చె మళ్లీ మొదలుపెట్టండ"న్నట్టు ఉంటుందని రాయలేదు. AIM నేను పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా చదివాను. నేను రాద్దామనుకున్న నాలుగు ముక్కలూ ఇంకా పూర్తికాలేదు. మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు చేసిన దరిద్రాన్ని ఎత్తి చూపడం గురించి రాయడమే దీని తరువాయి. వీలుంటే, చూడండి..!

    రిప్లయితొలగించండి