15, అక్టోబర్ 2011, శనివారం

ఆంధ్రప్రదేశంలోనుండి ఎన్ని రాష్ట్రాలొస్తే బావుంటుందీ..?



"ఏమీ రాకపోతేనే బావుంటుంది" అనేవాళ్ళూ..! దయచేసి క్షమించేయండి..! రాష్ట్రం విడిపోతే మంచిదా, విడిపోకపోతే మంచిదా., అనేదాని మీద స్పష్టత వచ్చినా, ఒక స్టాండ్‌ మీదకి రానివాణ్ణి..! (చంద్రబాబులాగే..!) అందువల్ల ఒక్కోసారి ఇటువైపూ, ఒక్కోసారి అటువైపూ తిరిగిపోతూ ఉంటాను. ప్రస్తుత పోస్ట్‌లో "రాష్ట్రాన్ని విడగొట్టేయమని"..నాకు అధికారం ఇస్తే., (ఎవరిస్తారో..?) ఏయే రాష్ట్రాలు ఇచ్చేస్తానో రాస్తున్నాను. చూస్కోండి..! విడగొట్టేయడం అంత ఈజీయా అని అడగేవారికి నేను చెప్పే సమాధానమేంటంటే, "చాకలిపద్దు"..అంత ఈజీ అన్నదే..!
(గమనిక: 1. ఇది నిజంగానే సీరియస్‌..!..
               2. కొన్ని జిల్లాలు పక్కరాష్ట్రాలనుండి లాక్కోవడం జరుగుతుంది)

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపించిన డిమాండ్లు..తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర), రాయలసీమ, మన్యసీమ..
సాధారణంగా పేర్కొనే ప్రాంతాలు..............  తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ..

సరే.., "రాయలవారి" కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొంటే, మనకి ఈ ప్రాంతంలో మూడు రాజ్యాలున్నట్టుగా తెలుస్తుంది.. అవి
"విజయనగర సామ్రాజ్యం"........ "బహమనీ సుల్తానుల రాజ్యం".......... "కళింగ రాజ్యం"..!
                ఇప్పటికీ తన్నుకుంటున్నది పరోక్షంగానైనా ఈ పేర్లతోనే కదా..! అందువల్ల, నేను ఇచ్చేసే రాష్ట్రాలు ఈ మూడు మాత్రమే..!
రాయలసీమ
తెలంగాణ
కళింగ

ఇప్పుడు చెప్పిన మూడు రాష్ట్రాల పరిధి ఎట్టిదనిన...

రాయలసీమ - (ఇప్పటి రాయలసీమలోని నాలుగు జిల్లాలు + నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి + బళ్ళారి, కృష్ణగిరి, కోలారు + హోసూరు, వేలూరు.. దీనికి రాజధాని "మద్రాసు" (తమిళులతో కలిపి..!). తమిళనాడుని కూడా విడగొట్టేస్తాం కాబట్టి, అక్కడి తొండ మండలం వారు, కొంగు మండలంవారు కూడా కలుస్తానంటే కలవచ్చు.., లేదంటే మానొచ్చు..! "తొండ మండలం" కలిస్తే ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే "మద్రాసు"..ఒక్క రాష్ట్రానికే రాజధాని అవుతుంది. అదీ రాయలసీమే..!)

తెలంగాణ - ఇప్పుడున్నట్టే...! నాందేడ్‌, బీదరు కూడా కావాలంటే, కలిపేద్దాం..! (మిగిలిన తెలుగు జిల్లాలు పెద్దగా తెలీదు..! తెలిస్తే వాటిని కూడా కలిపేద్దాం..! రాజధాని- హైదరాబాద్‌..!)

కళింగ - తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం + గంజాం, రాయగడ, కోరాపుట్‌, మల్కాన్‌గిరి + ఒరిస్సాలోని ఇతర తెలుగు ప్రాంతాలు + వీలుంటే దంతెవాడ, బస్తర్‌ ప్రాంతాలు.. దీనికి రాజధాని - విశాఖపట్నం..!)

రాయలసీమ లో - గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి ఎందుకు కలిపేసానని డౌట్‌ వచ్చిందా..? నేను ముందే చెప్పానుగా "రాయలవారి కాలాన్ని" పరిగణలోకి తీసుకున్నానని..! అప్పట్లో,  "గోదావరి" నదే... "విజయనగర రాజ్యా"నికీ "కళింగ"కీ సరిహద్దు..! (రాయలవారి దండయాత్రలని పక్కనబెట్టండి..!) అందువల్ల రాయలసీమ రాష్ట్రానికీ, కళింగ రాష్ట్రానికీ మధ్య సరిహద్దు మళ్ళీ గోదావరే..!

ఈ ప్రాంతాలన్ని అప్పటి (రాయల కాలంనాటి) విస్తీర్ణంతో పోలిస్తే చిన్నవైనా తప్పదు ఎడ్జస్ట్‌ అయిపోవాలి..! అంతే...! ఇహపోతే.., ఇంకో విషయం..! అప్పట్లో కళింగకీ, విజయనగరానికీ ఉన్న కామన్‌ శత్రువు "బహమనీ సుల్తానులు.."..! ఇప్పుడు కూడా ఆ పోలిక సరిపోతుందనుకుంటాను..

ఆ విధంగా మనం కోల్పోయిన ఊళ్లన్నీ వెనక్కి వచ్చేస్తాయి..! తన్నులాటలూ తప్పుతాయి..! దీనికి ఒప్పుకునే రాజకీయ పార్టీ ఏదైనా ఉంటుందా..?

6 కామెంట్‌లు:

  1. 24.

    Even within Districts, there are differences. For excample.Palnadu in Guntur district and the other side are diffrerent.

    West Krishna and other part of Krishna District are different.

    So even if the state is bifurcated into as many Districts in the State, there shall be still somebody grumbling and trying to foment separate state agitation.

    రిప్లయితొలగించండి
  2. @Vamanagita,

    I am against linguistic states. The root cause for all separatist agitations is that only. Country should have been divided into various provinces based on the administrative convenience. Had we done that, in each province, there would have been people speaking different languages and by dint of necessity, all would have learnt the other languages and there would have been comradeship among the people. Country would have been more united.

    రిప్లయితొలగించండి
  3. @కప్పగంతు శివరామప్రసాదు గారు

    బాగా చెప్పారండి..!

    "భాషా ప్రయుక్త రాష్ట్రం"..అనే సహేతుకమైన సిద్ధాంతం. అది తప్ప వేరే ఏది తలకెత్తుకున్నా, ఈ తన్నులాటలు వస్తూనే ఉంటాయి.. ఈ విషయం వేర్పాటువాదులు, రాష్ట్ర ప్రజలూ అర్థం చేసుకోవాలి..!

    రిప్లయితొలగించండి
  4. @కప్పగంతు శివరామప్రసాదు గారు
    ముందు వ్యాఖ్యని, మీ పేరు సరిచేసి మళ్లీ పోస్ట్‌ చేసాను..!

    "భాషా ప్రయుక్త రాష్ట్రాలు"పట్ల కొంత వ్యతిరేకత నాక్కూడా ఉంది..! కానీ, అది సహేతుకమేనని మాత్రమే నా ఉద్దేశ్యం. ఏదియేమైనా "భాషాప్రయుక్త రాష్ట్రాల"వల్ల నష్టపోయింది తెలుగే..! కానీ "ఆంధ్ర ప్రదేశ్‌"లోని తెలుగువాళ్ళు బాగా డెవలప్‌ అయ్యారు.. అందువల్ల కొంత సానుకూలత కూడా ఉంది..

    మీరేమంటారు..?

    రిప్లయితొలగించండి
  5. @కప్పగంతు శివరామప్రసాదు గారు
    //The root cause for all separatist agitations is that only.//

    I also agree..!

    రిప్లయితొలగించండి
  6. Bodoland demand is also a linguistic demand. But that demand was rejected by central government because Bodoland is not economically backward compared to other regions of Assam.

    రిప్లయితొలగించండి