30, జులై 2017, ఆదివారం

లోకసభ స్థానాలు - జనాభా పెరుగుదల


లోకసభ అంటే "కేంద్రం"లో మన ప్రాతినిధ్యం. కేంద్రప్రభుత్వంలో మన ప్రాతినిధ్యం, మన పార్టీలు చేసే లాబీయింగ్ బట్టి ఉంటుంది. అది వేరే విషయం.

లోకసభ స్థానాల కేటాయింపు ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి ఉంటుంది. ఆ లెక్క ఉజ్జాయింపుగా చూద్దాం.
మన లోకసభలో ఉన్న స్థానాలు 545. వీరిలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. అది కాకుండా కేంద్రపాలిత ప్రాంతాలు ఆరింటికీ ఆరు స్థానాలను మినహాయిస్తే మిగిలిన లోకసభస్థానాలు 537 అవుతాయి. వీటినే తక్కిన రాష్ట్రాలన్నిటి మధ్య పంచాలి.

ఈ కింది పట్టికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బంగ, తమిళనాడు, కేరళల జనాభా, (వివిధ జనాభా లెక్కలననుసరించి) బట్టి లోకసభ స్థానాలు ఎలా మారబోతున్నాయో చూడవచ్చు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1973 నియోజకవర్గ విభజనలో భాగంగా 42 స్థానాలను కేటాయించారు. 2002 పునర్విభజన సమయంలో జనాభా పెరుగుదల బట్టి దక్షిణాది రాష్ట్రాలనుండి 15 స్థానాలు ఉత్తరభారతానికి చేరిపోతాయని, దక్షిణాదినుండి వచ్చిన వ్యతిరేకతవల్ల ముందున్న స్థానాల్నే మళ్లీ ఉంచవలసి వచ్చింది . కానీ పక్షంలో, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  38/39 స్థానాలు మాత్రమే దక్కి ఉండేవి. అలాగే, 2031 జనాభా లెక్కల తర్వాత మాత్రమే మరోసారి పునర్విభజన జరగబోతుంది.

దేశం యొక్క సగటు జనాభా పెరుగుదలను, రాష్ట్రాల జనాభా పెరుగుదలను బట్టి 2021,2031,2041 లలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎలా ఉండబోతుందో చూడవచ్చు

రాష్ట్రం (లోక సభ స్థానాలు, జనాభా పెరుగుదల శాతం)
1961
1971
1981
1991
2001
2011
2021
2031
2041
భారతదేశం (543/17.64)
439235720
548160050
683329900
846421830
10287,37,690
1210193422
1423671542
1674807202
1970243192
లోకసభ స్థానాలు
537
537
537
537
537
537
537
537
537
ఆంధ్రప్రదేశ్ (25/11.1)
35983480
43502710
53551030
66508170
757,28,400
49665533
55178407.2
61303210.4
68107866.71
లోకసభ స్థానాలు
43.9926169
42.617034
42.083484
42.19514
39.53014573
22.0381228
20.81295
19.6558887
18.56315229
తెలంగాణ (17/17.87)
NA
NA
NA
NA
NA
35193978
41483141.9
48896179.3
57633926.57
లోకసభ స్థానాలు
15.6166492
15.6471816
15.6777737
15.70842559
పశ్చిమ బంగ (42/13.9)  
34926000
44312017
54580650
68077970
80221300
91347736
104045071
118507336
134979855.9
లోకసభ స్థానాలు
42.69976495
43.409864
42.892619
43.191076
41.87543484
40.5337968
39.2451501
37.9974719
36.78945977
ఉత్తర ప్రదేశ్ (80//20.1)
70144160
83849775
105113300
132062800
166053600
199581477
239697354
287876522
345739702.9
లోకసభ స్థానాలు
85.75671833
82.142668
82.604086
83.78532
86.67980581
88.5604327
90.4123425
92.302978
94.2331491
బీహార్ (40/25.1)
34849490
42126800
52303000
64531200
82879910
103804630
129859592
162454350
203230391.5
లోకసభ స్థానాలు
42.60622549
41.269136
41.10271
40.94088
43.26322648
46.0613033
48.9822258
52.0883751
55.3914972
తమిళనాడు (39/15.6)
33687110
41199170
48408080
55859300
62111390
72138958
83392635.4
96401886.6
111440580.9
లోకసభ స్థానాలు
41.18512508
40.360392
38.041858
35.439119
32.42208072
32.0102719
31.4551804
30.9097149
30.37370827
కేరళ (20/4.9)
16904560
21347300
25453680
29098523
31839000
33387677
35023673.2
36739833.2
38540084.98
లోకసభ స్థానాలు
20.66714592
20.912688
20.002968
18.461134
16.61992475
14.815138
13.2107104
11.7800368
10.50430004
గమనిక: 1) 2001-11జనాభాా పెరుగుదల రేటునే 2021,31,41ల జనాభాా అంచనాలోవాడడ జరిగింది.
2) కేంద్రపాలిత ప్రాంతాల జనాభాని మినహాయించలేదు.

పై పట్టికబట్టి మనకు దక్షిణాది రాష్ట్రాల లోకసభ స్థానాలు ఎలా తగ్గుతున్నాయో, ఉత్తరాది రాష్ట్రాల లోకసభ స్థానాలు ఎలా పెరుగుతున్నాయో తెలుస్తుంది.