21, అక్టోబర్ 2011, శుక్రవారం

జనాభాపరంగా పెద్ద నగరాలు ఇవట..!



           భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌లోని నగరాల 2011 జనాభా లెక్కల వివరాలు చూసి రాస్తున్న పోస్టిది..! చిన్నప్పట్నుంచీ, ఆ ఊరు పెద్దదా..? ఈ ఊరు పెద్దదా..? అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ ఉన్న ఆ వెర్రి కారణంగా ఈ పోస్ట్‌ రాస్తున్నాను..   భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌ లింకిదిగో.. ఇంకేమన్నా వివరాలు కావాలంటే వెళ్లి చూస్కోండి..!

                                                                                              
నగరం
జనాభా
ముంబయి (Mumbai)
18,414,288
దిల్లీ (Delhi)
16,314,838
కోల్‌కత (Kolkata)
14,112,536
చెన్నై (Chennai)
8,696,010
బెంగుళూరు (Bengaluru)
8,499,399
హైదరాబాద్‌ (Hyderabad)
7,749,334
అహ్మదాబాద్‌ (Ahmadabad)
6,352,254
పూణే (Pune)
5,049,968
సూరత్‌ (Surat)
4,585,367
జయపూర్‌ (Jaipur)
3,073,350
కాన్పూర్‌ (Kanpur)
2,920,067

రాష్ట్రంలో..

నగరం
జనాభా
హైదరాబాద్‌
7,749,334
విశాఖపట్టణం
1,730,320
విజయవాడ
1,491,202
వరంగల్లు
759,594
గుంటూరు
673,952
నెల్లూరు
564,148
రాజమండ్రి
478,199
కర్నూలు
478,124
తిరుపతి
459,985
కాకినాడ
442,936

                ఇవన్నీ కాకిలెక్కలేనని నాకనిపిస్తోంది...! లేకపోతే మా కాకినాడ జనాభా 4 లక్షలా..? అన్నీ తప్పుడు లెక్కలే..! 8 లక్షలకి ఒక్కటికూడా తక్కువుండని ఊరది..! ముంబయి కన్నా ఎంతో పెద్ద నగరమైన దిల్లీనేమో రెండో స్థానంలోకి తోసేసారు.. గాజియాబాద్‌, గురుగావ్‌, ఫరీదాబాద్‌ లాంటి పక్క ఊళ్లకి వేరు లెక్కలెయ్యడం వల్ల వచ్చినదది..! "జాతీయ రాజధాని ప్రాంతం  (National Capital Region)" అన్నీ లెక్కలేసుకుంటే మూడు కోట్ల అంకెని ఇంచుమించు తాకుతుంది. దిల్లీ జనాభా, అందులో సగం..? ఈ "జాతీయ రాజధాని ప్రాంతం",  దిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌, నొయిడా (ఇక్కడే భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్‌ రేస్‌ కోర్స్‌ నిర్మితమౌతోంది.), మీరట్‌, హరియాణలోని గురుగావ్‌, ఫరీదాబాద్‌, సోనీపట్‌.. ఇలా పక్క రాష్ట్రాల్లోకి విస్తరించిపోయి ఉంది. ఇవేమీ దిల్లీ నగరపరిధిలోకి తీసుకోలేదు..
                రాష్ట్రంలో నాలుగో స్థానంలో (కనీసం ఐదో స్థానం) ఉన్న మా కాకినాడని పదో స్థానానికి తోసెయ్యడం కూడా, ఇంతే..! ఎంత అన్యాయం..? (సరదాగా అంటున్నాను.. సీరియస్‌ అవ్వకండి..!)


( కింది వివరాలు అసందర్భమైనా, వేరే పోస్ట్‌ రాయడం ఇష్టం లేక రాస్తున్నాను..!

  కొన్ని ఉపయుక్తమైన ధార్మిక వెబ్‌సైట్లు

15, అక్టోబర్ 2011, శనివారం

ఆంధ్రప్రదేశంలోనుండి ఎన్ని రాష్ట్రాలొస్తే బావుంటుందీ..?



"ఏమీ రాకపోతేనే బావుంటుంది" అనేవాళ్ళూ..! దయచేసి క్షమించేయండి..! రాష్ట్రం విడిపోతే మంచిదా, విడిపోకపోతే మంచిదా., అనేదాని మీద స్పష్టత వచ్చినా, ఒక స్టాండ్‌ మీదకి రానివాణ్ణి..! (చంద్రబాబులాగే..!) అందువల్ల ఒక్కోసారి ఇటువైపూ, ఒక్కోసారి అటువైపూ తిరిగిపోతూ ఉంటాను. ప్రస్తుత పోస్ట్‌లో "రాష్ట్రాన్ని విడగొట్టేయమని"..నాకు అధికారం ఇస్తే., (ఎవరిస్తారో..?) ఏయే రాష్ట్రాలు ఇచ్చేస్తానో రాస్తున్నాను. చూస్కోండి..! విడగొట్టేయడం అంత ఈజీయా అని అడగేవారికి నేను చెప్పే సమాధానమేంటంటే, "చాకలిపద్దు"..అంత ఈజీ అన్నదే..!
(గమనిక: 1. ఇది నిజంగానే సీరియస్‌..!..
               2. కొన్ని జిల్లాలు పక్కరాష్ట్రాలనుండి లాక్కోవడం జరుగుతుంది)

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపించిన డిమాండ్లు..తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర), రాయలసీమ, మన్యసీమ..
సాధారణంగా పేర్కొనే ప్రాంతాలు..............  తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ..

సరే.., "రాయలవారి" కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొంటే, మనకి ఈ ప్రాంతంలో మూడు రాజ్యాలున్నట్టుగా తెలుస్తుంది.. అవి
"విజయనగర సామ్రాజ్యం"........ "బహమనీ సుల్తానుల రాజ్యం".......... "కళింగ రాజ్యం"..!
                ఇప్పటికీ తన్నుకుంటున్నది పరోక్షంగానైనా ఈ పేర్లతోనే కదా..! అందువల్ల, నేను ఇచ్చేసే రాష్ట్రాలు ఈ మూడు మాత్రమే..!
రాయలసీమ
తెలంగాణ
కళింగ

ఇప్పుడు చెప్పిన మూడు రాష్ట్రాల పరిధి ఎట్టిదనిన...

రాయలసీమ - (ఇప్పటి రాయలసీమలోని నాలుగు జిల్లాలు + నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి + బళ్ళారి, కృష్ణగిరి, కోలారు + హోసూరు, వేలూరు.. దీనికి రాజధాని "మద్రాసు" (తమిళులతో కలిపి..!). తమిళనాడుని కూడా విడగొట్టేస్తాం కాబట్టి, అక్కడి తొండ మండలం వారు, కొంగు మండలంవారు కూడా కలుస్తానంటే కలవచ్చు.., లేదంటే మానొచ్చు..! "తొండ మండలం" కలిస్తే ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే "మద్రాసు"..ఒక్క రాష్ట్రానికే రాజధాని అవుతుంది. అదీ రాయలసీమే..!)

తెలంగాణ - ఇప్పుడున్నట్టే...! నాందేడ్‌, బీదరు కూడా కావాలంటే, కలిపేద్దాం..! (మిగిలిన తెలుగు జిల్లాలు పెద్దగా తెలీదు..! తెలిస్తే వాటిని కూడా కలిపేద్దాం..! రాజధాని- హైదరాబాద్‌..!)

కళింగ - తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం + గంజాం, రాయగడ, కోరాపుట్‌, మల్కాన్‌గిరి + ఒరిస్సాలోని ఇతర తెలుగు ప్రాంతాలు + వీలుంటే దంతెవాడ, బస్తర్‌ ప్రాంతాలు.. దీనికి రాజధాని - విశాఖపట్నం..!)

రాయలసీమ లో - గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి ఎందుకు కలిపేసానని డౌట్‌ వచ్చిందా..? నేను ముందే చెప్పానుగా "రాయలవారి కాలాన్ని" పరిగణలోకి తీసుకున్నానని..! అప్పట్లో,  "గోదావరి" నదే... "విజయనగర రాజ్యా"నికీ "కళింగ"కీ సరిహద్దు..! (రాయలవారి దండయాత్రలని పక్కనబెట్టండి..!) అందువల్ల రాయలసీమ రాష్ట్రానికీ, కళింగ రాష్ట్రానికీ మధ్య సరిహద్దు మళ్ళీ గోదావరే..!

ఈ ప్రాంతాలన్ని అప్పటి (రాయల కాలంనాటి) విస్తీర్ణంతో పోలిస్తే చిన్నవైనా తప్పదు ఎడ్జస్ట్‌ అయిపోవాలి..! అంతే...! ఇహపోతే.., ఇంకో విషయం..! అప్పట్లో కళింగకీ, విజయనగరానికీ ఉన్న కామన్‌ శత్రువు "బహమనీ సుల్తానులు.."..! ఇప్పుడు కూడా ఆ పోలిక సరిపోతుందనుకుంటాను..

ఆ విధంగా మనం కోల్పోయిన ఊళ్లన్నీ వెనక్కి వచ్చేస్తాయి..! తన్నులాటలూ తప్పుతాయి..! దీనికి ఒప్పుకునే రాజకీయ పార్టీ ఏదైనా ఉంటుందా..?

14, అక్టోబర్ 2011, శుక్రవారం

బిజేపీవారి చాకలిపద్దు



 
కొంతకాలం క్రితం.., రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకోసం ఉద్యమాలు జరిగాయి కదా..! అప్పట్లో కర్నూల్‌, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేసారు.
 
సరిగ్గా, అప్పుడు దిగారు మాన్యశ్రీ ఎం. వెంకయ్యనాయుడుగారు...! ఈయనగారి గురించి చెప్పడానికేముందిలే అనుకోకండి..! నా దృష్టిలో అతిపెద్ద రాజకీయ కమెడియన్‌ ఆయనే..! అయితే, కొద్దికాలం క్రితం ఆ స్థానాన్ని మెగాస్టారుడు ఆక్రమించాడు. అదలా పక్కనబెట్టండి..! ఈ వెంకయ్యనాయుడుగారు ఏ మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో తెలీకుండా ఉంటారు. (మనలో మన మాట..! , ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పరువు తీసేస్తున్నాడు..!)
ఆ ఆందోళనలు జరుగుతున్న  సమయంలో, ఈయనగారు రాష్ట్రమంతా ( ఆందోళనలు జరుగుతున్న చోట అని గమనిక..) పర్యటించి, అందరితోనూ మాట్లాడి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ సారాంశం ఏంటంటే..
 
"రాష్ట్రంలో తక్షణమే, నాలుగు హైకోర్టు బెంచీలూ, ఒక సుప్రీం కోర్టు బెంచీ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం..!"
 
ఈ స్టేట్‌మెంట్‌ వినగానే నాకైతే నవ్వాగలేదు..! చాకలతను బట్టల పద్దు చెప్తున్నట్టు.." నాలుగు ఫేంట్లూ...!, ఐదు చొక్కాలూ...!, ఒక దుప్పటీ...!"...అనిపించింది. అప్పుడే అర్థమైంది.. బిజేపీ వారికి హైకోర్టూ, సుప్రీం కోర్టు బెంచీలు ఏర్పాటు చేయడం దగ్గర్నుంచీ, "చిన్న రాష్ట్రాలు "  ఏర్పాటు చేయడం వరకూ, ఏదైనా సరే "చాకలి పద్దు"..అంత ఈజీ..!
 
బిజేపీవారు అధికారంలోకి వచ్చినపుడు "చాకలి పద్దు"..చట్టం/ కమిటీ తెచ్చి, అడిగివాడికి అడిగినట్టుగా, ప్రత్యేక రాష్ట్రాలనీ, బెంచీలనీ, కుర్చీలనీ, సోఫాలనీ ఏర్పాటు చేస్తారు..!
 
ఇందుమూలంగా యావన్మంది బ్లాగ్ప్రజానీకానికీ  తెలియజేయునది ఏమనగా..
"మీకు పత్యేక రాష్ట్రం గానీ, బెంచీ గానీ కావల్సి వచ్చినయెడల, తక్షణమే ఆస్థాన కమెడియన్‌ వెంకయ్యనాయుడు గార్కిగానీ, ఆస్థాన "లేఖ"కుడు దత్తాత్రేయగారికి గానీ వినతి పత్రాలు సమర్పించుకోవలసింది"గా తెలియజేయడమైనది..
ఇప్పటికే, ఒక పద్దువేయడం జరిగింది..! ఆ పద్దులో ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్‌ అనే రాష్ట్రాలనివ్వడం జరిగింది.. ఇంకో పద్దు కూడా రెడీగా ఉంది.. అది ఈ పోస్ట్‌ లో ఒకసారి రాయడం జరిగింది. మీక్కూడా ఇంకేమైనా "ప్రత్యేక" డిమాండ్లు ఉంటే, బిజేపీవారిని సంప్రదించండి...!
 
నాకైతే, ప్రత్యేక కాకినాడ రాష్ట్రం కావాలని కోరిక ఉంది. అది ముందొక పోస్ట్‌లో వెలిబుచ్చడం జరిగింది. ఇంకా వీలైతే, ప్రత్యేక కాకినాడ దేశం కూడా ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇదిగో..! అందరికీ, ఇప్పుడే చెప్పేస్తున్నాను, కాకినాడ దేశం వచ్చేస్తే, "రాజ్యాంగ కమిటీ"కి నేనే అధ్యక్షుణ్ణి..! వీలైతే మొదటి రాష్ట్రపతి కూడా..! ఇప్పుడే కర్చీఫ్‌ వేసేసాను.. ఆ సీటు నాదీ..!
 
జై కాకినాడ
 
జై బీజేపీ
 
జై చాకలిపద్దు చట్టం/ కమిటీ

13, అక్టోబర్ 2011, గురువారం

ఏమిటయ్యా మీ తెలుగు గొప్ప..?



చిన్నప్పుడు మా స్కూల్లో "తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం"..గురించి చెప్తున్నపుడు, మా టీచరుగారు ఈ కథ కూడా చెప్పారు. (కథ కాబట్టి, జరిగిందో, జరగలేదో నాకు తెలియదని మనవి..!). పొట్టి శ్రీరాములు గారికి ముందు ఒకాయన అదే నినాదంతో నిరాహారదీక్షకి కూరున్నాడట..!

అప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం నెహ్రూనో, పటేల్నో పంపిందట (ఇప్పట్లాగే..!). ఆయనగారు, మన తెలుగాయన దగ్గరకొచ్చినపుడు అన్నాడట..

"ఏమయ్యా..! తెలుగో..! తెలుగో...! అంటున్నావ్‌..! అసలు మీ తెలుగువాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకివ్వాలీ..? అసలు మీ తెలుగు గోప్పేంటీ..?"..అని

దానికీయన ఏమీ మాట్లాడకుండా, జేబులో ఉన్న "అణా"కాసుని తీసి చూపించాడట...! దాని మీద "one anna".."एक अना".."ఒక అణా"..అని మాత్రమే ఉన్నాయట..

అది చూపించి..ఈయన అన్నదిది. "తెలుగు గొప్పేమిటన్నావ్‌గా..! ఇదీ తెలుగు గొప్ప..! నువ్వు గుర్తించడం ఎవడిక్కావాలీ.. బ్రిటీషువాడే గుర్తించాకా..?"..అని..

అదీ కథ... సరే..! నిజంలోకి వస్తే, ఈ కథ నిజమో కాదోనన్న విషయం పక్కనబెట్టి, "అణా" కాసుల చిత్రాలను మొన్న అంతర్జాలంలో వెతకి, పట్టుకున్నాను. మీరూ చూడండి..!
వీటిలో దేవనాగరి, ఉర్దూ (అనుకుంటా..!), బెంగాలీ, తెలుగు లిపుల్లో ముద్రింపబడి ఉన్నాయి..!

ఒక అణా 


రెండు అణాలు



నాలుగు అణాలు


యెనిమిది అణాలు

అవిభక్త భారతంలోనే మూడవ అతి పెద్ద భాషగా ఉండేది మన తెలుగు..! 

ఇదికూడా మన తెలుగు గొప్పదనమే..!

10, అక్టోబర్ 2011, సోమవారం

ఆర్య -ద్రవిడ -4 ( ఎందుకొచ్చిన గొడవదింతా..? వదిలేస్తే పోలా..? )



వారం క్రితం మొదలుపెట్టిన సుత్తిని ఇవాళ్టితో పూర్తి చేసేద్దామనుకుంటున్నాను. కాస్త చదివేసి కోపరేట్‌ చేసెయ్యండి.. లేదూ..! మొదట్నించీ చెప్పాల్సిందేనంటారా..? అయితే వెళ్లిండి.. ఫస్టు పార్టు, సెకండు పార్టు, థర్డు పార్టు..

సంస్కృతానికీ, లాటిన్‌ కీ ఉన్న సంబంధం దగ్గర ఆగాం కద..! అక్కణ్నుంచే కంటిన్యూ చేసేద్దాం మరి..! చేసెద్దాం అనెయ్యండం బానే ఉందిగానీ, మన దగ్గర మేటర్‌ ఉండొద్దూ..! మహ మహ భాషాశాస్త్రవేత్తలే తన్నుకుంటున్న సంబంధం గురించి చెప్పడానికి నేనెవర్ని.. అందుకే, నాకు తెలిసిన నాలుగు ముక్కలూ రాసేస్తున్నాను.. చూస్కోండి..!

శనకైస్తు క్రియాలోపాదిమా: క్షత్రియ జాతయ:
వృషలత్వం గతాలోకే బ్రాహ్మణాదర్శనే న చ
పౌండ్రకా శ్చౌఢ్ర ద్రవిడా: కాంభోజా యవనా శ్శకా:
పారదా పహ్లవా శ్చీనా: కిరాతా దరదా: ఖశా: (10-43,44)
దీనర్థం "పౌండ్రక, ఓఢ్ర, ద్రవిడ, కాంభోజ, యవన, శక, పారద, పహ్లవ, చీన, కిరాత, దరద, ఖశదేశములందు జన్మించిన క్షత్రియులు బ్రాహ్మణ దర్శనము లేనివారై ఉపనయనాది సంస్కారహీనులై క్రమముగా వృషలత్వము చెందిరి."
ఇది జటావల్లభుల పురుషోత్తం గారు సంకలనం చేసిన "ధర్మమంజరి"లోనిది. ఇది మనుస్మృతి నుండి సంగ్రహించబడింది. దాని తర్వాతి శ్లోకం కూడా రాస్తున్నాను. సంస్కృతం బాగా వచ్చిన వారు దాని అర్థం చెప్పగలరు..!
ముఖబాహురూపద్జానాం యా లోకే జాతయో బహి:
మ్లేచ్ఛవాచశ్చార్యవాచ: సర్వే తే దస్యవ: స్మృతా: (10-45)
దీనర్థం నాకు తెలీదు..! మీకు తెలిస్తే తెలుసుకొనగోరుచున్నాను.!

ఇంకో విషయం...! మ్లేచ్ఛుల జననం గురించి భారతంలో ఉన్నదట..! విశ్వామిత్ర, వసిష్ఠుల సంఘర్షణలో కామధేనువు నుండి ఉద్భవించినవారే మ్లేచ్ఛులట..!

భారతదేశపు క్షత్రియ వంశజుల సంతతివారే యవనులని, మన పురాణవేత్తల ప్రగాఢ విశ్వాసం..! (ఈ విశ్వాసాన్ని మాక్స్‌ ముల్లర్‌ పరిగణనలోకి తీసుకోలేదు.. కారణాలు కొంతమందికి కోపం తెప్పించేవిధంగానూ, కొంతమందికి నవ్వు తెప్పించేవిధంగానూ ఉంటాయి..). అందుకు యయాతి..అతని ఐదుగురు పుత్రుల కథని చెప్పుతారు. అందులో నాకు జ్ఞాపకం ఉన్నది ఇద్దరు "పురువు."..."యదువు".. యదు సంతతి వారే యాదవులు..! పురు వంశస్థులే కౌరవులూ, పాండవులూనూ.. (ఈ విషయంలో చాలా భేదాభిప్రాయాలున్నాయి..! పురు వంశం, కురువంశం ఒకటి కాదని కొందరూ, ఒకటేనని కొందరూ అంటూంటారు..!) మిగిలిన ముగ్గురు కొడుకులూ భారతదేశాన్ని వదిలి ఉండవచ్చని, వారి సంతతే యవనులూ, పఠాన్లూ, తదితరులనీ కొంతమంది భావన..!

ఇక్కడి వరకూ కొంతమందివరకైనా తెలిసిన విషయాలే..! పైగా చరిత్రకందగల కాలానికి చెందినవే..! చరిత్రకందని రామాయణం కాలం సంగతేమిటి..? రామాయణకాలానికీ, భారతకాలానికీ 1000 సంవత్సరాల నుండి 15 లక్ష సంవత్సరాల వరకూ (ఎవరి లెక్కలు వాళ్లవి..!) తేడా ఉంది కదా..! అప్పడేమి జరిగాయో మరి ఎక్కడ రాసుందీ..?

ఎక్కువమంది విశ్వసించే విధంగా రాముడు అయోధ్యలోనే పుట్టాడని, భారతదేశానికే పరిమితమయ్యాడనీ అనుకుందాం..! కానీ రాముని వారసులూ, సోదరులూ అయోధ్యకే పరిమితం కాకపోయి ఉండవచ్చనిపిస్తోంది..! ఎందుకంటే, భరతుడు గాంధారదేశాన్ని జయించాడట..!  భరతుని పుత్రులైన తక్షకుడు, పుష్కళుడు గాంధార దేశాన్ని పరిపాలించారట..! తక్షకుడు నిర్మించిన నగరాలు తక్షశిల., తక్షఖండం (ఉజ్బెక్‌స్థాన్‌ రాజధాని తాష్కెంట్‌..!)..! పుష్కళుని నిర్మితం పుష్కళావతీ నగరం.. అదే నేటి పెషావర్‌..! అలాగే, లవుడుకుశుడు నిర్మించిన నగరాలు నేటి పాకిస్థాన్‌ లో ఉన్నాయి. లవుడు నిర్మించిన నగరమే నేటి లాహోర్‌ (లవపురి)..! కుశుడు నిర్మించిన నగరం కాసూర్‌..!

ఎక్కడి అయోధ్య..? ఎక్కడి తాష్కెంట్‌..? ఒక్క తరంలో అంత స్థానచలనం ఉన్నప్పుడు, ఎన్నో తరాలు మారిపోయాయి, ఇప్పటికి..ఇంకెన్ని చలనాలు ఉండుంటాయి..? అందువల్ల భారతదేశం లోపలికీ, బయటికీ వలసలు జరిగాయన్నది కొట్టిపాడెయ్యలేని వాదం..! మరి, మన పురాణవేత్తల (భారతీయ చరిత్రకారులు) విశ్వాసాన్ని మాక్స్‌ముల్లర్‌ పరిగణలోకి తీసుకోక తప్పుచేసాడని అనుకోవచ్చుగా..!

సంస్కృతానికీ, లాటిన్‌ మధ్యలో సంబంధం వెతకాలంటే, మన పురాణాలనీ, ప్రాచీన రోమనుల సాహిత్యాన్నీ, గ్రీకుల పురాణాలనీ, పారశీకుల మతగ్రంథాలనీ తీవ్రంగా అధ్యయనం చేసి, వారి మూలస్థానం ఎక్కడని పేర్కొన్నారో తెలుసుకోవాలి..! ఇదంత ఈజీ ప్రాసెస్‌ కాదు..! ఎప్పట్నుంచో తన్నుకుంటున్నది ఇక్కడే..! మనదేశంలోనైతే, గురుశిష్యపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగి మన ప్రాచీన గ్రంధాలలో కొంతైనా మనకి లభించింది. అయితే, వాళ్ల పరిస్థితి అది కాకపోవచ్చుగా..! గ్రీకు సంస్కృతిని పారశీకులు కూలగొట్ట ప్రయత్నిస్తే, పారశీక సంస్కృతిని ఇస్లాం కూలగొట్టింది. అదే విధంగా రోమనుల సంస్కృతినీ క్రైస్తవం కూలగొట్టింది. అంతకు ముందు అరేబియా, పారశీకం, రోమ్‌, గ్రీసు లాంటి చోట్ల విగ్రహారాధక సంస్కృతే ఉండేది..! ఇదంతా, చరిత్రకందిన కాలంలో జరిగిన సంఘటనలు, మరి అంతకు ముందేమి జరిగిందో..? ఎన్ని దాడులు జరిగాయో..? ఇలాంటివన్నీ అనంత ప్రశ్నలూ, భేతాళ ప్రశ్నలూనూ..! వెరసి, ఇక్కడ తేలిన విషయం ఏంటంటే, అంతా అయోమయం.....అగమ్యగోచరం..!




ఇంక ముగించేద్దాం.. ఈ సుత్తిని...!

ఏ వాదం చేసినా సరే, అది మానవశ్రేయస్సుకి ఉపయోగపడేదై ఉండాలి..! అందులోనో మనది "సర్వే జనా: సుఖినోభవంతు", "వసుధైవ కుటుంబకమ్‌"..సంస్కృతి కదా..! అందువల్ల మన భారతదేశంలో అది ముందే అవసరం..! ఆర్యులు, ద్రవిడులూ అని తన్నుకుంటూ ఉండడం అస్సలు మంచిది కాదు..! ఋగ్వేదంలో చెప్పినట్టు "భారతదేశం నానాజాతి సంగమం".. అనేదాన్ని అంగీకరించేసి, అందర్నీ గౌరవిస్తే బాగుంటుంది..!

చరిత్ర..విషయానికొస్తే, భారతీయుల సంస్కృతికీ, మిగిలిన నాగరికతలకీ ఉన్న తేడా ఏమిటంటే, వాళ్ళు ఉన్నదున్నట్టు రాసేవాళ్ళు... మనవాళ్ళేమో భక్తిభావంతో రాసేవాళ్లు. అందువల్ల మనవాళ్లు ఏం రాసారో తిన్నగా అర్థం కావాలంటే, భక్తిభావంలో "రాసినవారి స్థాయి"కెళ్లిపోవాలి.. అప్పటివరకూ పూర్తిగా అర్థం కాదు..! అర్థం చేసుకునే సమయం ఎవ్వరికీ దొరకదు...!

"పురాణం" అనే పదం యొక్క అర్థం "చరిత్ర",..అని(ట..!). అందువల్ల, ఒకప్పుడు పురాణం చదువుకున్నవారు హిస్టరీ స్టూడెంట్స్‌ కింద, రీసెర్చర్స్‌ కింద లెక్కలోకొచ్చేవారు..! వాళ్లిచ్చే లెక్చర్లే హరికథలూ, బుర్రకథలూ, జానపదకథలూ ఇలాగన్నమాట..! మనకి తెలిసిన 18 పురాణాలు, 18 ఉపపురాణాలు కాకుండా వేలకొద్దీ కులపురాణాలూ, లక్షలకొద్దీ స్థలపురాణాలు కూడా ఉన్నాయి (ఉండేవి). దురదృష్టం ఏంటంటే, వీటిలో చాలాభాగం లిపిబద్ధం కాక, ఖిలం అయిపోయాయి (అయిపోతున్నాయి..!). వీటినన్నింటినీ, సేకరించి, క్రోడీకరిస్తే, కులం ఎందుకు పుట్టిందో, "అందరూ ఒక్కటే" ఎలా అవుతారో, తదితర విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చేసేవాళ్లెవరు..?

విషయం పక్కదారి పట్టేసింది. అసలు విషయానికొద్దాం..! ఎవరు అవునన్నా, కాదన్నా మనచరిత్ర విదేశీయులు రాసిందేనన్నది నిజం..! మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు ఒక్కోచోట మన పురాణాలకీ, కథలకీ అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడదు. అందువల్లనే మన చరిత్రనిండా కంతలే..! అది "ఆర్య -ద్రవిడ" రాద్ధాంతమే కావచ్చు.. ఇంకోటే కావచ్చు..!

(ఇంతకన్నా ఎక్కువ సుత్తి కొట్టేస్తే కష్టం.. అందుకే ఆపేస్తున్నాను..!)

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆర్య -ద్రవిడ -3 (లేమురియా, కుమారి ఖండం)



ఇంతకు ముందు రాసిన సుత్తిలోని మొదటి భాగంరెండవ భాగం..తర్వాత ఇది మూడవ భాగం

ద్రవిడులు అసలు స్థానికులేనా అనే కదా.. ప్రశ్న వచ్చిందీ..!

కాదని నేనక్కర్లేదు...! కొంతమంది  "ద్రవిడ జాతి" వాదులే అన్నారు..!

ఆ మధ్యనెప్పుడో "తమిళ-తెలుగు" తన్నులాటలని చూసాను. అందులో ఒక్క తెలుగువాడు మిగిలిన తమిళంవాళ్ళనందరినీ చీల్చిచెండాడేస్తున్నాడు. "తమిళనాడు" పేరు హాస్యాస్పదమనీఅసలు "తెలుగు నాడు"అనేదే ఉండవలసిన పేరనీ సాగిపోతూండగామధ్యలో ఎవడో తెలుగువాళ్లని "ఉత్తరదిశ" నుండి వచ్చితమ భూభాగాలని ఆక్రమిచారన్నట్టుగా అన్నాడు. దానికీ తెలుగతను తమిళం వాళ్లసలు భారతీయులే కాదనీ, "లేమురియా"..అనే ఖండం నుండి వచ్చారని అన్నాడు.. ఆ తర్వాత డిస్కషన్‌ జ్ఞాపకం లేదు.. అసలీ "లేమురియా"..అంటే ఏంటో చూద్దాం ముందు..!

లేమురియా కూడా "అట్లాంటిస్‌"లాగే సముద్రంలోకి వెళ్ళిపోయిన భూఖండం (కొంతసేపు నిజం అనుకుందాం..!) 1864లో ఫిలిప్‌ స్క్లాటర్‌ అనే అసామి, "mammals of Madagascar" ...అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించాడు. అతనికి మడగాస్కర్‌భారతదేశంలో లభించిన కొన్ని శిలాజాలుఆఫ్రికా ఖండంలో దొరకలేదట.! అందువల్ల భారతదేశంమడగాస్కర్‌ ఒకప్పుడు ఒకే పెద్ద ఖండంలో ఉండి ఉండవచ్చని భావించాడు. (అవి క్షీరదాలు..! క్షీరదాలు భూమ్మీద పుట్టే సమయానికిమన భూమి సుమారు ఇప్పుడున్నట్టుగానే ఉంది..! ఇదీ ఎక్కడో చదివాను)


దీనికి సంబంధించిన వర్ణనలు తమిళ "సంగమ" సాహిత్యంలో ఉన్నాయట..! దీన్ని అందులో "కుమారి ఖండం"..అని పిలిచేవారట..! "కలిత్తోకై", "శిలప్పధికారం"లలో కొన్ని చోట్ల వాటి గురించి ప్రస్తావనవర్ణనలూ వచ్చాయట..! కన్యాకుమారికి దక్షిణంగా కొన్ని వందల మైళ్ళ మేర వ్యాపించి ఉండేదట..! "క్రూరమైన సముద్రం"..కన్యాకుమారిపహరౌలి నదికి మధ్యగా ఉన్న పాండ్యుల భూమిని లాక్కొనగాఆ పాండ్యులు చేరచోళ రాజుల భూభాగాలను ఆక్రమించాడట..! "పహరౌలీ", "కుమారి"..అనే నదులుఆ మునిగిపోయిన భూఖండంలో ప్రవహించేవట..!

ఇంతవరకూ బానే ఉంది..! అయితే, 1992లో ఆర్‌. మతినవన్‌ అనే ఆసామి ద్రవిడుల కాలరేఖ ఈ క్రింది విధంగా రాసాడు.. పూర్తి వివరాలు ఈ వికీపీడియావ్యాసంలో
//            ca. 200,000 to 50,000 BC: evolution of "the Tamilian or Homo Dravida",
ca. 200,000 to 100,000 BC: beginnings of the Tamil language
50,000 BC: Kumari Kandam civilisation
20,000 BC: A lost Tamil culture of the Easter Island which had an advanced civilisation
16,000 BC: Lemuria submerged
6087 BC: Second Tamil Sangam established by a Pandya king
3031 BC: A Chera prince in his wanderings in the Solomon Island saw wild sugarcane and started cultivation in Kumari Kandam.
1780 BC: The Third Tamil Sangam established by a Pandya king
7th century BC: Tolkappiyam (the earliest known extant Tamil grammar)//

            అయితేదీన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు..! మరీ క్రీ.పూ. 50 వేల సంవత్సరం దగ్గర నాగరికత అంటేనమ్మబుద్ధికావడం లేదుగానీఏదో 3,4 వేల సంవత్సరాల కిందనైతే నమ్మవచ్చేమో..! (అది కూడా పూర్తి ఆధారాలతో)..కొంతసేపు ఇది నిజమని అనుకుంటే, "ద్రవిడులు"..స్థానికులు ఎలా అయ్యారన్నదే నా అనుమానం..! "కుమారి ఖండం".. తప్పయితే.. సంగం సాహిత్యం..మీద కూడా గురిపెట్టాల్సొస్తుందేమో..! ఆర్యులు వచ్చి ద్రవిడులను తరిమేసినట్టుగా లేదుకదా..! కేవలం ద్రవిడులే భారతదేశానికొచ్చి చేరచోళ భూభాగాలను ఆక్రమించుకున్నట్టుగా ఉందిగా..! దీని మీద పరిశోధనలు చేయాలి.. (ముఖ్యంగా తమిళుల పరిశోధనను ఇక్కడ అస్సలు నమ్మకూడదు..!)

            మళ్లీ మనం "భవిష్య పురాణం" దగ్గరకి వద్దాం..! ముందు దాని ప్రామాణికత మీదే అనుమానపడ్డాను కదా..! దాని ప్రామాణికతను సమర్థించేది నిజంగా జరిగినజరుగుతున్న చరిత్రే..! పృథ్వీరాజుజయచంద్రుల గురించీతైమూర్‌ లంగ్‌ భారతదేశ దండయాత్ర గురించీబాబరూఅక్బరూఔరంగజేబుతదితర మొగలాయిల గురించీశివాజీ గురించీబ్రిటీషువారి పరిపాలన గురించీ రాసి ఉంది..సంవత్సరాలతో సహా..! (పోనీ దీన్ని కూడా ఎవడో ఎక్కించాడనుకుందాం..!) బ్రిటీషువాళ్ల తర్వాత మౌనులు భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా ఉంది..(స్వాతంత్ర్యం గురించి లేదు మరి..!) ఈ మౌనులెవర్రా అంటేబౌద్ధధర్మపరాయణులటహిమాలయవాసులటభభ్రువర్ణులట..ఇలా వర్ణనలున్నాయి. వీళ్లు టిబెట్‌ వాళ్లైనా కావచ్చుచైనా వాళ్లైనా కావచ్చు. "మౌన"..శబ్దం.. "మావో"..లతో కలుస్తోందని నా ఉద్దేశ్యం. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. భవిష్య పురాణం కరెక్టోకాదో..!
            సరే..! మరి సంస్కృతానికీలాటిన్‌కీ ఉన్న సంబంధం మాటేమిటి..?
(ఇంకా ఉంది నా చేటభారతం)