2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు


           మనం మర్చిపోయిన తెలుగుని అంటే వాడుక పదాలనీ, జాతులవారినీ, కులాలూ,కుటుంబాలవారినీ మళ్లీ మనకి గుర్తుచేసేందుకే "నుడి"..ని మొదలుపెట్టిన ఆంధ్రభూమివారు నిజంగా అభినందనీయులు...! ఆంధ్రభూమి "నుడి"లో వచ్చిన వ్యాసం ఆధారంగా తెలుగు నెలల గురించి ఈ పోస్ట్‌ రాద్దామనుకుని.., అందరికీ తెలిసినవైనా తెలుగు సంవత్సరాలనీ, అంకెలనీకూడా జతపరచేస్తున్నాను...! అయితే, ఈ పోస్ట్‌ ప్రధాన ఉద్దేశ్యం నా మిత్రులకి తెలుగు నెలలు పరిచయడమేనని ఇంకోసారి మనవి చేస్తున్నాను.
అందుకు సంబంధించిన లింకు ఇదిగో..
తెలుగు నెలలు
చైత్రము ----------ముంగాపి, ముందాపి
వైశాఖము--------కొంగాపి, కందాపి
జ్యేష్ఠం------------ఒల్లాపి
ఆషాఢము-------కట్లాపి
శ్రావణము--------సెవ్వాపి
భాద్రపదము------ముంగనాపి
ఆశ్వయుజము----కుదునాపి, కుందాపి
కార్తీకము----------జీరాపి
మార్గశిరము------ ఈరాపి
పుష్యము----------తైందాపి
మాఘము---------ఏరిమాపి
ఫాల్గుణము--------ఏగాపి, కడాపి
ఒకప్పుడు అంటే సుమారు వందేళ్ల క్రితం వరకూ, మన తెలుగునాట పేర్లు వాడుకలో ఉండేవట.. ప్రస్తుతం, తమిళనాడులో పాత ఉత్తర,దక్షిణ ఆర్కాట్జిల్లాలూ, తిరువణ్ణామలై జిల్లాలోనూ పెద్దసంఖ్యలో ఉన్న తెలుగు కుటుంబాల్లో ఇంకా వాడుకలో ఉన్నాయి..! (ఆంధ్రభూమి "నుడి" సౌజన్యంతో)

తెలుగు సంవత్సరాలు
1. ప్రభవ,
2.
విభవ,
3.
శుక్ల,
4.
ప్రమోదూత,
5.
ప్రజోత్పత్తి,
6.
అంగీరస,
7.
శ్రీముఖ,
8.
భావ,
9.
యువ,
10.
ధాత,
11.
ఈశ్వర,
12.
బహుధాన్య,
13.
ప్రమాధి,
14.
విక్రమ,
15.
వృష,
16.
చిత్రభాను,
17.
స్వభాను,
18.
తారణ,
19.
పార్థివ,
20.
వ్యయ,
21.
సర్వజిత్తు,
22.
సర్వధారి,
23.
విరోథి,
24.
వికృతి,
25.
ఖర,
26.
నందన,
27.
విజయ,
28.
జయ,
29.
మన్మథ,
30.
దుర్ముఖి,
31.
హేవళంబి,
32.
విళంబి,
33.
వికారి,
34.
శార్వరి,
35.
ప్లవ
36.
శుభకృత్తు,
37.
శోభకృత్తు,
38.
క్రోథి,
39.
విశ్వావసు,
40.
పరాభవ,
41.
ప్లవంగ,
42.
కీలక,
43.
సౌమ్య,
44.
సాధారణ,
45.
విరోధికృత్తు,
46.
పరీధావి,
47.
ప్రమాదిచ,
48.
ఆనంద,
49.
రాక్షస,
50.
నల,
51.
పింగళ,
52.
కాళయుక్తి,
53.
సిద్ధార్థి,
54.
రౌద్రి,
55.
దుర్ముఖి,
56.
దుందుభి,
57.
రుధిరోద్గారి,
58.
రక్తాక్షి,
59.
క్రోధన,
60.
అక్షయ.
తెలుగు అంకెలు
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯
0 1 2 3 4 5 6 7 8 9
తెలుగు సంవత్సరాలు ఇప్పటికే వాడుతున్నా, తెలుగు అంకెలు మళ్లీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టా, తెలుగు నెలలని వాడడం కూడా మొదలుపెడదామనుకుంటున్నా..! మీరూ మొదలుపెట్టండి..!

8 కామెంట్‌లు:

  1. వామనగీత గారు, మీరు పొందుపరచిన తెలుగు నెలల సమాచారం చాల వింతగా వుంది. నా ఎరికన పొరపాటున కూడ వినలేదు. ప్రతి పదంలోను ..ఆపి", అని వుంది. సుమారు అయిదువందల నుండి ఆరువందల సంవత్సరాల క్రితం వ్రాసిన అన్నమయ్య కీర్తనలలో కూడ, నేను విన్న వాటిలో ఇందులోని ఏ పదం వినలేదు. "కడలుడిపి" అన్నది తప్ప. తెలుగు సంవత్సరాల పేర్లు వింటే కొంత సంవత్సర లక్షణాలను తెలియజేస్తాయి. అందువలన వాటిని విరివిగా వాడుతున్నాము. చైత్రము, వైశాఖము..మొదలయినవి ఆయా నక్షత్రాలు చంద్రునితో కలసి ఉన్న లక్షణాన్ని సూచిస్తాయి. కాని ఎన్నడు వినని ఈ తెలుగు నెలల పేర్లు వాడడంలో నాకు ఆసక్తి, ఆనందము, ప్రయోజనము కనిపించదు. అయినా ఒక చక్కని అంశం చర్చకు ప్రవేశ పెట్టినందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. సూర్య నారాయణగారూ..! నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదములు. చక్కని అంశం చర్చలోకి ప్రవేశపెట్టారన్నారు. అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు.! ఈ తెలుగు నెలల పేర్లు నాకసలే తెలీదు..! ఎక్కడా వినని తెలుగు నెలలు వాడడం మీద ఆసక్తి, ఆనందం, ప్రయోజనం కనబడడంలేదన్నారు. .. కావచ్చు..! బహుశా, మీరు ఆంధ్రభూమి "నుడి" చూస్తూనే ఉండుంటారని భావిస్తున్నాను. అందులోని, వ్యాసాలను చదివిన తర్వాత తెల్సినదేంటంటే, నాకు తెల్సిన ప్రతీ పదానికీ (సంస్కృత మూలమైనా, ఆంగ్లమూలమైనా..ఏ మూలమైనా) ఒక అచ్చ తెలుగు పదం ఉందని..! "ప్రశ్న"ని "అడక"...అంటారు... "అడక"ని నేను మొదటిసారే వినడం.."పరిశోధన" కి "ఆరయిక"..అనే తెలుగు పదం ఉన్నట్టు తెల్సింది.. నిజంగా "నుడి".... చాలా బాగుంది. కుల పురాణాలూ, సంచార కుటుంబాలవాళ్లూ, శ్రీలంకలో పాములోళ్లూ, కోతిలోళ్లూ, ఇలా చాలా విషయాలు తెలుస్తున్నాయి...!

    రిప్లయితొలగించండి
  3. వామన గీత గారు, మీ ప్రతిస్పందనకు సంతోషం. నా వ్యాఖ్య వ్రాసాక అనవసరంగా నా వ్యాఖ్యతో బాధించానా అని అనుకున్నాను. కాని మీ సమాధానం వలన కొంత ఊరట కలిగింది. నాకు కూడ భాష అంటే మక్కువ ఎక్కువ. నేను నుడి చూడటం ఇదే ప్రథమం. ఇది కొంత పరిశోధించవలసిన విషయం. కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చును. మీ సూచనలకు, వివరణలకు ధన్యవాదాలు. మీకు వీలయితే నా బ్లాగు(లు) దర్శించండి. www.vulimiri.blogspot.com

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగు సందర్శించమని మీరిచ్చిన ఆహ్వానానికి చాలా సంతోషించాను..ఇంక, మీ ముందు వ్యాఖ్యకి నేను పెద్దగా బాధపడిందేమీ లేదు..! ఎందుకంటే, మీరు చెప్పిన చాలా విషయాలు నాకు తెలీదు.. అన్నమాచార్య కీర్తనల్లో వీటి వాడకం లేదని మీరు చేసిన పరిశీలన, నేనెప్పుడూ చేయలేదు, ఆ అవకాశం కల్పించుకోలేదు కూడా..! ఇకపై చూడాలి..! పైన రాసిన, తెలుగు నెలల్లో "ముందాపి.", "కడాపి..".. మాత్రమే కొద్దిగా అర్థమయ్యాయి..
    ముందాపి = ముందు + ఆపి
    కడాపి = కడ + ఆపి..
    ఈ లెక్క ప్రకారం, అన్ని పదాల్లోనూ రిపీట్‌ అవుతున్న "ఆపి"..అంటే నెల కావచ్చు...! మరి మిగిలిన పదాల సంగతేంటో మరి...! బహుశా, ఆయా నెలల్లో చేయాల్సిన పనుల గురించి చెప్పే అవకాశం ఉంది..!

    రిప్లయితొలగించండి
  5. Namasthe!

    I see that your surname is "Salagrama". I'm trying to find one of my childhood friends. Her name is Salagrama Kameswari. Her house was near MSN Charities, Jaganniaka Puram. We both studied 6th class in MSN Charities. Please let me know if you know her.

    ~Lalitha Thripura Sundari

    రిప్లయితొలగించండి
  6. త్రిపుర సుందరిగారికి నమస్కారం..!

    "కామేశ్వరి" అని పేరున్నవాళ్లు, మా దగ్గరి బంధువుల్లో లేరుగానీ, దూరపు బంధువుల్లో చాలామంది ఉన్నారు. "సాలగ్రామ" ఇంటిపేరున్నవాళ్లు కాకినాడలో ముగ్గురుదాకా ఉన్నారు. ఒకరు "ఇంజరం సాలగ్రామ", రెండు "నడకుదురు సాలగ్రామ", మూడు "రాయవరం సాలగ్రామ " మేము "ఇంజరం సాలగ్రామ.."వాళ్ళం..! మా తాతగారు జగన్నాధపురంలోనే ఉంటున్నారు. మీకు జగన్నాధపురం గురించి బాగా తెలిసి ఉంటే, "మూడు డాబాలు"..అనే పేరు బహుశా వినే ఉంటారు. ఇప్పడు మా తాతగారు అక్కడే ఉంటున్నారు. మీ ఫ్రెండ్‌, "మూడు డాబాలు"కే చెందినవారైతే, దొరకడం ఈజీ..! కాకపోతే, చెప్పలేను.! ఏదైనా సరే, ఇంట్లో వాళ్లకే బాగా తెలుస్తుంది.. ప్రయత్నం చేయొచ్చు..!
    ఇంతకీ, మీరు ఏ సంవత్సరంలో చదివారు MSN ఛార్టీస్‌ లో..? వారి ఇంట్లోవాళ్ళ పేర్లేమైనా తెలుసా..?

    రిప్లయితొలగించండి
  7. సుబ్రహ్మణ్య శర్మ గారు,
    నమస్తే!

    నేను MSN చారిటీస్ లో ఆరవ తరగతి చదివిన సంవత్సరం 1979-80. కామేశ్వరికి ఒక తమ్ముడు వున్నట్టు గుర్తు. వాళ్ళ ఇల్లు స్కూల్ కి దగ్గరగా జగన్నాధ (జగన్నాయక పురం) రోడ్డు మీదకే వుండేది - ఎత్తైన చెక్క గేటు, దానిమ్మ చెట్లు వుండే ఒక డాబా ఇంట్లో. అప్పుడు మా క్లాస్ కి భ్రమరాంబ గారు ఇంగ్లీష్, తాతబ్బాయి గారు తెలుగు చెప్పేవారు. నేను ఆ స్కూల్ లో ఆరునెలలు మాత్రమే చదివాను. తర్వాత మా నాన్నగారి transfer కారణంగా కాకినాడ వదిలి వెళ్ళవలసి వచ్చింది. మేము కాకినాడ లి వున్నప్పుడు గారపాటి సుబ్బారావు గారని MSN చారిటీస్ కాలేజీ లో తెలుగు లెక్చరర్ గారింట్లో అద్దెకి వుండేవాళ్ళం.

    ఇప్పుడు తన ఇంటి పేరు మారి ఉండొచ్చు - వివాహానంతరం. కానీ ఆ రోజుల్లో స్కూల్లో అందరూ ఇంటి పేర్లతో పిలుచుకునే వారు. అలా తను సాలగ్రామ కామేశ్వరి లాగే గుర్తు వుంది.

    ఈ వివరాలతో తనని నేను కలుసుకో గలిగితే (కనీసం ఫోన్ లో అయినా) చాలా సంతోషం.
    ఏది ఏమైనా మీ సహాయానికి కృతజ్ఞతలు.

    ~లలితా త్రిపుర సుందరి

    రిప్లయితొలగించండి
  8. హే ఇవన్నీ పెద్దబాల శిక్షలో ఉండేవి! మంచి సేకరణ!

    రిప్లయితొలగించండి