16, అక్టోబర్ 2013, బుధవారం

కళింగ & ఆంధ్ర (పాత పేరు: ఉత్తర సర్కారులు) - 1

బ్రిటీషువారి కాలంలో ఉత్తరసర్కారులుగా పిలువబడిన ప్రాంతానికిమరో పేరు అవసరమని కళింగ & ఆంధ్ర అనే పేరుని సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యం వచ్చి 60 యేళ్ళ పైబడినప్పటికీఇంకా సామ్రాజ్యాల కాలంనాటి (బ్రిటీషు,నిజాం) భౌగోళిక సరిహద్దులేరాజకీయాల్లో తీవ్ర అంతరాలను సృష్టిస్తూ ఉండటంమన దురదృష్టం.


పురాణాలుచరిత్రప్రస్తుత ఉద్యమాలు :
  • తెలుగువారు పూరీ క్షేత్రం నుండీకాంచీ క్షేత్రం వరకూ విస్తరించి ఉన్నారనిచెబుతుందో గ్రంథం (పూర్తి వివరాలు అందుబాటులో లేవు).
  • ప్రాచీన కళింగ రాజ్యంప్రస్తుత ఒరిస్సాలోని చిలుక సరస్సు (Chilka Lake) నుండిగోదావరి నది ఒడ్డు వఱకు విస్తరించి ఉండేది. దీని రాజధానిశ్రీముఖ లింగం ( నగరంకళింగనగరంకళింగదేశనగరంకళింగవాని నగరంనగరపువాడత్రికళింగనగరం మొదలైన పేర్లతో పిలువబడిన ఊరు ప్రస్తుతంశ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పుణ్యక్షేత్రంగా మిగిలిపోయింది).
  • ప్రస్తుత తెలంగాణ వేర్పాటు ఉద్యమం లో  ఆంధ్రోళ్ళు అంటూ దుమ్మెత్తిపోసిందిగుంటూరుకృష్ణా,ఉభయ గోదావరి జిల్లాల వారినని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. మూడు నాలుగు జిల్లాలూ ఆంధ్ర పేరుతోనే పిలువబడతాయి. (బహుశాభవిష్యత్తులో ఆంధ్ర పేరుతో పిలువబడబోయేది. కృష్ణా గోదావరి డెల్టా మాత్రమే). ప్రాచీన కాలంలో రాజధానులు అమరావతిరాజమహేంద్రివేంగికొండవీడు మొదలైనవి
  • కళింగాంధ్ర అనేది కళింగ ఆంధ్రలకు ఉమ్మడిగా ఉన్న ప్రాంతం. అది తూర్పుగోదావరి మాత్రమే అవుతుంది. అందుకేఉత్తర సర్కారులకి కళింగ & ఆంధ్ర అనే పేరుని సూచిస్తున్నాను
  • ఫ్రెంచివారి వద్దనుండి బ్రిటీషువారు స్వాధీనం చేసికొన్న భూభాగం సర్కార్”(Circars)అర్కాటు నవాబు అప్పగించిన భూమి పాత నెల్లూరు జిల్లా(Nellore), నిజాం నవాబు అప్పగించిన భూమి "సీడెడ్(Ceded) .
  • నెల్లూరుకర్నూలుగుంటూరులోని భాగాలను కలుపుతూ ప్రకాశంజిల్లాని ఏర్పాటుచేసారువీటిల్లో గుంటూరు నుండి కలిసిన భాగమే కళింగ & ఆంధ్రలోకి వస్తుంది.
పరిస్థితులు
  • వేర్పాటు ఉద్యమం పేరుతో నాయకులు విషం కక్కిన దృష్ట్యారాష్ట్రం సమైక్యంగా ఉండటం అస్సలు మంచిది కాదు.
  • ఒకే భాష ఒకే రాష్ట్రం అనే నినాదంతో స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తొలి రాష్ట్రం అయినప్పటికీఒకే సంస్కృతి ఒకే జాతిగా ఎదగకపోవడం వలనప్రస్తుతం మనకు కూడికలుతీసివేతలు తప్ప ఏమీ మిగలలేదు. మూడు (నాలుగు) ముఖ్య ప్రాంతాల మధ్య గాఢమైన అనుబంధాలుసంబంధ బాంధవ్యాలూ పెద్దగా పెనవేసుకొనకపోడం కూడావిభజనకు ఒక ముఖ్య కారణం.
  • తెలంగాణ విభజన అనంతరం1200 కి.మీ మించి పొడవైన రాష్ట్రంగా "సీమాంధ్ర" స్థిరంగా ఉండటానికి అవకాశాలు చాలా తక్కువ.ఇప్పటికేరాయలసీమలో గణనీయమైన సంఖ్యలోని వ్యక్తులు ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు
  • పెన్నేరుఇతర నదులువాగులు రాయలసీమ జిల్లాలతో బాటు నెల్లూరుప్రకాశం(ఒంగోలు మినహా) ప్రాంతాలతో ముడిపడి ఉండటంతోనూసీమతో ఉన్న భౌగోళిక దగ్గరితనం వలనా ప్రాంతాలు పెను రాయలసీమ (Greater Rayalaseema)”లో చేరడానికే ఇష్టపడతాయని అనుకుంటున్నాను. అంతేగాకుండాకొత్తగా ప్రతిపాదించబడిన దుగ్గరాజపట్నం పెను ఓడరేవు (Major Port), నౌకానిర్మాణకేంద్రం(Shipyard), రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. (వీలుంటేపెనురాయలసీమ గుఱించి ఇటువంటి పోస్టుని వేస్తాను)
రాజధాని 
1) విశాఖ పట్నం 
అనుకూలతలు
  • పూర్తిగా అభివృద్ధిచెందినత్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న రవాణా వ్యవస్థలు.
  • జాతీయంగాఅంతర్జాతీయంగా ఇప్పటికే ఉన్న పేరు.
  • శివారు మండలాలు (అనకాపల్లిపెందుర్తి వంటి)లలో  భూ లభ్యత.
  • ఛత్తీస్ గఢ్ఒఢిశాలలోని తెలుగు ప్రాంతాలకి నగరంతో ఉన్న అనుబంధం. తద్వారారాష్ట్రం భౌగోళికంగా పెద్దదయ్యే అవకాశం ఉండటం.
ప్రతికూలతలు
  • పారిశ్రామిక కాలుష్యంఇప్పటికే టాప్ గేర్ లో కలుషితాలని వెదజల్లుతున్న పరిశ్రమలు.
  • కోస్తా ఆంధ్ర ప్రాంతంలోభౌగోళికంగా చివరికి ఉండటం.
  • చాలా ప్రాజెక్టులకి అడ్డుపుల్లలు వేస్తున్న భారత నావికా దళం.

పెద్ద జనావాసాలు విశాఖపట్నంవిజయనగరంఅనకాపల్లి
రైలు స్టేషన్లు విశాఖపట్నందువ్వాడవిజయనగరంఅనకాపల్లి
ఓడరేవులు విశాఖపట్నంగంగవరంభీమునిపట్నం (భవిష్యత్తు)నక్కపల్లి (భవిష్యత్తు)
విమానాశ్రయాలు విశాఖపట్నంవిశాఖపట్నం - కాకినాడ చమురుసీమ(Visakhapatnam - Kakinada Petroleum Chemical Petrochemicals Investment Region) అంతర్జాతీయ విమానాశ్రయం (భవిష్యత్తు)

2) విజయవాడ గుంటూరు తెనాలి - మంగళగిరి
అనుకూలతలు
  • పేరొందిన రోడ్డురైలు కూడలి. (రాష్ట్రం విడిపోయిన పక్షంలో అది అనుకూలత అయ్యే అవకాశాలు తక్కువ)
  • చాలామంది తెలుగు పారిశ్రామిక వేత్తలకి పుట్టుగడ్డ కావడం.
  • మధ్యయుగాలనాటి మహా ఓడరేవు మచిలీపట్నం అభివృద్ధి చేస్తేతూర్పు ముంబయి అయ్యే సంభావ్యత ఉండటం.
  • కోస్తా ఆంధ్ర ప్రాంత మధ్యలో ఉండటం.
ప్రతికూలతలు
  • కళింగ & ఆంధ్ర ప్రాంతంలో చివరికి ఉండటం.
  • రాజధాని నిర్మాణానికి సేకరించే భూమి వ్యవసాయ భూమి కావడం.



పెద్ద జనావాసాలు విజయవాడగుంటూరుతెనాలిమంగళగిరి
రైలు స్టేషన్లు విజయవాడగుంటూరుతెనాలి.
ఓడరేవులు మచిలీపట్నం
విమానాశ్రయాలు గన్నవరం (విజయవాడ)

3) కాకినాడ - రాజమండ్రి (రాజానగరం పెద్దాపురం సామర్లకోట ప్రాంతం) 
అనుకూలతలు
  •  పూర్తిగా అభివృద్ధి చెందినత్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న రవాణా వ్యవస్థలు
  • వ్యవసాయం జరగని భూమి విస్తారంగా లభ్యమయ్యే అవకాశం.
  • కళింగ & ఆంధ్ర ప్రాంత మధ్యంలో ఉండటం (+ వివాద రహిత ప్రాంతం అవ్వడంఇప్పటివరకూ)
  • ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఉపాధి అవకాశాలు.
  • పోలవరంతో నీటి కొరతకి అవకాశాలు లేకపోవడం.
ప్రతికూలతలు
  • అంతగా పేరు లేకపోవడం.
  • కొత్తగా నగర నిర్మాణం కావించాల్సిన అవసరం ఉండటం.



పెద్ద జనావాసాలు కాకినాడరాజమండ్రిపెద్దాపురం సామర్లకోట జంటపట్నాలు
రైలు స్టేషన్లు రాజమండ్రిసామర్లకోటకాకినాడ.
ఓడరేవులు కాకినాడ డీప్ వాటర్ పోర్టుకాకినాడ లంగరు రేవు, విశాఖపట్నం - కాకినాడ చమురుసీమఓడరేవు (భవిష్యత్తు)

విమానాశ్రయాలు మధురపూడి (రాజమండ్రి)విశాఖపట్నంకాకినాడ చమురుసీమ అంతర్జాతీయ విమానాశ్రయం (భవిష్యత్తు)

ఇవి కాకుండాతూ.గో.జి విశాఖ .జిల్లాల సరిహద్దులోని తుని పాయకరావుపేట సమీపంలోని అటవీ ప్రాంతంపశ్చిమ గోదావరిజిల్లాలో తాడేపల్లిగూడెం జంగారెడ్డిగూడెం మధ్యనున్న ప్రాంతాలు కూడా పరిగణించదగ్గవేనని నా ఉద్దేశ్యం. (పోలవరం ప్రాజెక్టు ఎడమ,కుడి కాలువలు అందుబాటులో ఉండటంవలన నీటి ఎద్దడికి అవకాశాలు తక్కువ)

5 కామెంట్‌లు:

  1. For capital sea shore areas in andhra are not suitable. It should be far fron seashore like VJA Guntur ongole.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Except Visakhapatnam, No other option above are on Sea shore, every one are at least 30 - 40 Km away. whereas Ongole is just 10 Km away..!!

      తొలగించండి
  2. As once we left from karnool, now karnool should be prefered as capital of new Andhra state. That means we need not to quarrel about the capital now as we did earlier. Because we should not give more maniacal importance to the capital as we did to hyderabad. In fact that was the major cause(centralization of resources) for the problems we are facing now.
    ibetter way to maintain is only administrative offices like secretariat and high court etc will be in the capital city. all the important industries and business houses must be decentralized into all the important cities like , vzag, kakinada, rajamundri guntur and others.

    రిప్లయితొలగించండి
  3. డియర్ సాలగ్రామ సుభ్రహ్మణ్యం గారు,
    మిత్రమా !
    నన్ను ఎంచుకొని మీ అభిప్రాయాలను , తెలుగులా భౌగోళిక ఉనికిని, ప్రస్తుత రాజకీయ అస్తవ్యస్తతలను ,గతకాలపు తెలుగుల విభిన్నరాజ్యాల స్థితిగతులను ,రాజధాని నగరాలనూ ఉటంకిస్తూ మీరందించిన చరిత్ర సంక్షిప్తతలు ముచ్చట గొలిపాయి. వనరుల సమతుల్యత ,పంపకంలోనిర్లక్యం వల్ల జరిగిన ముఖ్య ఉపాధి కారక మూలాలైన కేంద్ర భారీ పరిశ్రమల కేంద్రీకరణ వలల ఉత్పన్న మైన నేటి. ఈ దౌర్భాగ్య స్థితి కి కారణం. ప్రస్తుత కోస్తాంధ్ర , రాయల సీమ ఎంపీలు, కేంద్ర మంత్రులు ...ప్రజల ఆకాంక్షలు, ఉపాధి,పరిశ్రమలు ,రాజధాని జలవనరుల పంపకం ,విద్యుత్, చమురు ఇంధనం ,మానవ వనరుల వినియోగానికి కావలసిన ఎర్పాట్లు జరపకుండానే అహంకార పూరితంగాచేసిన రాజకీయ విభజన నిర్ణయం ఈ అస్తవ్యస్త స్థితికి కారణం .అరవై సంవత్సరాల వుమ్మడి రాష్ట్రం లో పారిశ్రామిక, విద్యా వైద్య విజ్ఞాన పారిశ్రామిక అభివృద్ధి ఒకే ప్రాంతం లో కేంద్రీకృతమవడం, జలవనరుల పై పై రాష్ట్రాల చర్యలవల్ల భవిష్య త్తులో వుత్పన్నమయ్యే కారు పరిస్తితులు సీమాంధ్రుల భావితరాల భవిష్యత్తు భయానకంగా కనబడి సీమాన్ధ్రులు భయభ్రాంతులకు లోనవడం లోనూ ఆందోళన చెందడం లో ఆశ్చర్యం లేదు. కేంద్రం లోని ప్రభుత్వ రాజకీయ వర్గాలు దశాబ్దాలుగా తమకు అడ్డుగా వున్నా ఓ ప్రాంతీయ పార్టీని కూకటి వ్రేళ్ళతో తుడిచి వేయాలనుకొనే రాజకీయ కోణాన్నీ తప్పు బట్టనవసరం లేదు. కాని ప్రజలచే ఎన్నికయి ప్రజల ఆకాంక్షలు పట్టని ప్రజా ప్రతినిధులు ప్రజాకాంక్షను నిర్లక్షయించిన తీరులు, తమకు పట్టం కట్టి అధికారమిచ్చిన ప్రాంత ప్రజలను చులకన చేసిన తీరులు గర్హనీయం . , ,ప్రజాకాన్క్షలను నిర్లక్ష్యించి ముందుకు కొనసాగాలన్న కేంద్రం చేసే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా నియంతృత్వ రీతుల్లో వుడటం అత్యంత దారుణం. ...ఇప్పటికి ఇంతే. ,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి.!

      నా కోరికని మన్నించి నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి