15, జనవరి 2011, శనివారం

వినుర వేమ


చెప్పులోన రాయి....చైనా...
చెవిలోన జోరీగ......పాకిస్థాన్‌...
కంటిలోన నలుసు...కాశ్మీర్‌...
కాలిముల్లు......శ్రీలంక...
ఇంటిలొన పోరు(తెలంగాణ) ఇంతంతకదయా....!


ఏ ముహూర్తాన చంద్రశేఖర్‌....నిరాహార దీక్ష చేసాడో కానీ....మన దేశం ఎప్పుడూ లేని విధంగా... ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు.. ఊపందుకున్నాయి....మత ప్రాతిపదికగా, జాతిప్రాతిపదికగా, వీలైతే కులప్రాతిపదికగా (ఇటువంటివి నాకెక్కడా ఇంకా కనబడలేదు...) కూడా.. వేర్వేరు చోట్ల ప్రత్యేకరాష్ట్ర డిమాండ్లు ప్రభుత్వం దగ్గరికి చేరుతున్నాయి... వీటిలో కొన్ని చాలామందికి తెలిసినవే..! కొన్న నాకు కొత్తగా ఈ మధ్యనే తెలుసుకొన్నవి ఉన్నాయి... ఇంటర్‌ నెట్‌ డిఫరెంట్‌ సైట్స్‌ నుండి కలెక్ట్‌ చేసినవాటిని ఇంతకు ముందు ఒకపోస్టులో రాసాను.. గతంలో రాసుకున్న ఆ పోస్టునే మళ్లీ ఎడిట్‌ చేస్తున్నాను..
అందులో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి..

తెలంగాణ - హైదరాబాద్

రాయలసీమ - కర్నూల్‌/తిరుపతి

అంధ్ర - విజయవాడ (?)

కళింగాంథ్ర - విశాఖపట్టణం

మన్యసీమ/గోండ్వానాలాండ్‌ -

తుళువనాడు - మంగుళూరు

కొడవ -

ఉత్తర కర్ణాటక - గుల్బర్గా/ హుబ్లి

కూర్గ్

కొంగునాడు - కోయంబత్తూర్

దక్షిణ తమిళనాడు - మధురై

విదర్భ - నాగ్పూర్

మరాఠ్వాడా (?)

కోషల్ప్రదేశ్ - సంబల్పూర్

సౌరాష్ట్ర - భావ్ నగర్

వింధ్య ప్రదేశ్‌ - రేవా (?)

బుందేల్ఖండ్‌ - గ్వాలియర్‌/ఝాన్సీ

పూర్వాంచల్‌ - అలహాబాద్‌/ వారణాసి

హరిత ప్రదేశ్‌ - మీరట్‌/ అగ్రా

గూర్ఖా లాండ్‌ - డార్జిలింగ్

సీమాంచల్(బీహార్‌)

మిథిల/మిథిలాంచల్‌ (బీహార్‌)

బ్రజ్ప్రదేశ్

మరుప్రదేశ్‌ (రాజస్థాన్‌)

మధ్య భారత్‌ -ఇండోర్

బగేల్ఖండ్

మహాకోషల్

అవధ్‌ –లక్నో(ఉత్తరప్రదేశ్‌ నుండి మిగిలిన ప్రాంతాలు విడిపోతే మిగిలినది ఈ ప్రాంతమే.. ఇక్కడ మాట్లాడే భాష అవధీ హిందీ)

అంగప్రదేశ్

ఇవికాకుండా అస్సాంలో చిన్న రాష్ట్రాల డిమాండ్లు సుమారుగా ఏడువరకూ ఉన్నాయట..! ఇంక కేరళలోని మలప్పురం, కోజికోడ్‌ చుట్టుపక్కల మూడు ముస్లిం ఆధిక్య జిల్లాలు ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కావాలని కోరుతున్నారు..

వీటిల్లో రిపిటీషన్స్‌ ఉండచ్చు..! కొన్నింటిని మిస్సై ఉండచ్చు..! తప్పులు కూడా ఉండచ్చు.. ఇంకా కొత్తగా వింటే మళ్ళీ రాసుకుంటాను.. తప్పులుంటే మారుస్తాను....

పైనున్న పొలికలో చెప్పులోన రాయి, చైనాతో పోల్చడం.. నాక్కూడా అంత బాగా అనిపించట్లేదు... కానీ రాయక తప్పట్లేదు..