1, నవంబర్ 2011, మంగళవారం

పతివ్రతల పరిరక్షణ చట్టం (ఆడవారిపై దాడుల నివారణ చట్టం)




            కాలేజీ అమ్మాయిలపై ఏసిడ్‌ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడవారికి రక్షణ కరువైపోయింది. సిటీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ఆడవారికి ప్రత్యేకంగా సీట్లూ, బస్సులూ, బోగీలూ కేటాయిస్తున్నా మగవారు అతిక్రమించేస్తున్నారు. అప్పుడప్పుడు చెంపదెబ్బలూ, చెప్పు దెబ్బలూ, పళ్లు రాలడాలూ అవుతున్నా మగజాతికి బుద్ధిరావడం లేదు. ఎన్ని చట్టాలు చేసినా మార్పు రావడం లేదు (ముఖ్యంగా ఫెమినిస్టులకి). పుట్టుకతోనే బుద్ధిమంతురాళ్లైన అందరు ఆడవాళ్ళు, పట్టుకతోనే వెధవలూ, బడుద్ధాయిలైన మగవాళ్ల కారణంగా ఎంతో వివక్షకి, ఎన్నో అవమానాలకీ, అనుమానాలకీ, భౌతిక దాడులకి గురవుతున్నారు.

                  ఇంతకు ముందే వచ్చిన గృహహింస బిల్లూ, మతహింస బిల్లు టైపులో ఈ బిల్లు కూడా వచ్చేస్తే, దేశం మొత్తం మారిపోతుంది (ఫెమినిస్టులకి ఒక సంతృప్తి)..!

                 ఈ బిల్లు, మిగతా బిల్లుల్లా (కాకుండా) కొన్ని నిర్దిష్టమైన నిర్వచనాలతోనూ, నియమ నిబంధనలూ, అతిక్రమించినవారికి శిక్షలతో ఉండేలా ప్రయత్నించడం జరిగింది.
నిర్వచనాలు:
1) పతివ్రత: పుట్టుకతో స్త్రీ., అదే విధంగా పుట్టుకతోగానీ, పెరిగిన పరిసరాలతో గానీ ఒక స్త్రీ పతివ్రత మాత్రమే అవుతుంది. కాకపోవడానికి ఆస్కారమే లేదు. అందువల్ల పుట్టుకతోనే స్త్రీలనందరినీ "పతివ్రత"లు అనవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ (తప్పు చేసినా, చేయకపోయినా) పతివ్రత, పతివ్రతే అవుతుంది. అందువల్ల రాజ్యాంగపరంగా గానీ, సాంఘికంగా గానీ ఒక "పతివ్రత"ని శిక్షించరాదు. (ఆదర్శం 1)
2) మృగాడు. పుట్టుకతో పురుషుడు. పుట్టుకతో స్త్రీగానీ, పురుషుడుగానీ కానియెడల ఆ వ్యక్తిని కూడా "మగాడు"గానే పరిగణించాలి (వివరాలకు సంప్రదించండి: "జనాభా గణన నియమావళి"). పుట్టుకతోగానీ, పెరిగిన పరిసరాలతోగానీ ఒక "మగాడు", "మృగాడు" మాత్రమే అవుతాడు. అందువల్ల ఈ విభాగానికి చెందినవారందరినీ "మృగాళ్లు" అనవచ్చు. ఏ పరిస్థితుల్లోనైననూ (తప్పు చేసినా, చేయకపోయినా) మగాడు, మృగాడే అవుతాడు. అందువల్ల అతడు (మాత్రమే) శిక్షార్హుడు.
3) దాడి: ఆఫీసుల్లోనూ, కళాశాలల్లోనూ "పతివ్రత"పై మృగాడు చేసే దాడి చాలా రకాలు ఉన్నా ప్రధానంగా ఈ క్రింది విధంగా వర్గీకరించాలి (గృహహింస చట్టం-2005 సౌజన్యంతో)
      1) మానసిక దాడి.
        మాట్లాడడం (పని ఉన్నా, లేకపోయినా), లెటర్లు రాయడం (అది లవ్‌ లెటర్ల మొదలు లీవ్‌ లెటర్‌ వరకూ),
        ర్యాగింగ్‌ వర్గం (కళాశాలలకి ప్రత్యేకం):
"సీనియర్‌" మృగాడు "జూనియర్‌" పతివ్రతని ర్యాగింగ్‌ చేయబోవడం (ర్యాగింగ్‌ నిరోధక చట్టం వర్తిస్తుంది.),
"సీనియర్‌" పతివ్రత "జూనియర్‌" మృగాణ్ణి ర్యాగింగ్‌ చేయబోతే వద్దని వారించడం, ఎదిరించడం (ర్యాగింగ్‌ నిరోధక చట్టం వర్తించదు) వగైరా.
    2) శారీరక దాడి: కత్తులు, చాకులూ, బాకులు తదితర మారణాయుధాలతో బెదిరించడం, గాయపరచడం, హత్యచేయడం; ఏసిడ్‌ దాడులు (ఆ ఏసిడ్‌ ఆఖరికి నిమ్మరసం కూడా కావచ్చు) చేయడం, వగైరా..

4) ఆదర్శం: అవసరమైనప్పుడు వదిలేసి, అఖ్ఖర్లేనప్పుడు పాటించాల్సినది. ఏ విభాగానికి చెందినవారికి ఆయా అదర్శాలు ఉన్నాయి. వీలుంటే వీటిని మార్చవచ్చు (ఆదర్శం 2)
5) పోలీసులు: మృగాళ్లని అరెస్టు చేయువారు. (వారు అందుకోసం 24 గం.లూ వేచి చూస్తూ ఉండాలి). వీరు మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయవచ్చు (ఆదర్శం 3). అందుకు మానవ హక్కులు వర్తించవు (ఆదర్శం 4). "మృగాళ్ల"ను ఎన్‌కౌంటర్‌ చేసినా కోర్టులు శిక్షించరాదు (ఆదర్శం 5).
6) మీడియా: వార్తాపత్రికలూ, టీవీ ఛానెల్సూ తదితరాలూ. తప్పు ఎవరిదైనా సరే, వీరు "పతివ్రత"ల కోసమే పనిచేయాలి (ఆదర్శం 6). 
7) పతివ్రతల సంఘాలు: పతివ్రతల హక్కులకోసం పోరాడు త్యాగశీలులు. (వీరు మాట్లాడేవన్నీ అక్షరసత్యాలు). వీలుంటే వీరికి గుడి కట్టించి పూజించాలి (ఆదర్శం 7)
8) కళాశాల: తప్పనిసరి పరిస్థితులలో ఎందరో పతివ్రతలూ, మృగాళ్ళూ కలిసి చదువుకునే, పాఠాలు చెప్పే, చెప్పించుకొనే చోటు.
9) ఆఫీసు: ఉదరపోషణార్థం పతివ్రతలూ, మృగాళ్లూ పనిచేసే చోటు., అది ప్రభుత్వ సంబంధితమైనా కావచ్చు, ప్రవేటు సంబంధితమైనా కావచ్చు, వేరే ఏ ఇతరములైనా కావచ్చు.
10) సంఘం: పతివ్రతలూ, పతివ్రతలు చేతిలో కీలుబొమ్మలైన కొందరు మృగాళ్ల, సమూహం.

నియమ నిబంధనలు:
1) కళాశాలలోగానీ, అఫీసులోగానీ మృగాళ్లు ప్రవేశించాలంటే, ఆ మృగాళ్లు "ప్రతిజ్ఞ 1" చేయవలసి ఉంటుంది.
2) కళాశాలలోగానీ, ఆఫీసులోగానీ పతివ్రతలు ప్రవేశించాలంటే, ఆ ఆఫీసు, కళాశాలలోని వారందరూ ప్రతీరోజూ  "ప్రతిజ్ఞ 1" చేయాలి.
3) భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని "మృగాళ్ళ భ్రూణహత్యల నివారణ బిల్లు", "మృగాళ్ల ఆత్మహత్యల నివారణ బిల్లు" రూపొందించాలి.
4) మృగాడు తనపై ఎవరైనా పతివ్రత "దాడి" చేసిందని ఆరోపిస్తే, సంబంధిత "పతివ్రత" అంగీకారం మీద సాధారణ కేసు నమోదు చేయవచ్చు. (ఇది పోలీసుల విచక్షణపైనా, పతివ్రతా సంఘాల విచక్షణపైనా ఆధారపడి ఉంటుంది).
5) "దాడి" అరోపణలు రాగానే సంబంధిత "మృగాణ్ణి", తక్షణమే అరెస్టు చెయ్యాలి. అతనికి కనీసం ఆరు నెలలు వరకూ బెయిలు మంజూరు చేయరాదు. అటుపైన చేసినా, సంబంధిత పతివ్రత, పతివ్రతా సంఘాల అంగీకారం మీద చేయాలి.
6) (పతివ్రతలకి ఐచ్ఛికమైన ఒక నిబంధన.) ప్రతిజ్ఞ 2 చేసుకుంటూ ఉండాలి.

శిక్షలు
ఈ శిక్షలని రాజ్యాంగ శిక్ష అనీ, సాంఘిక శిక్ష అనీ రెండు రకాలుగా వర్గీకరించాలి
 రాజ్యాంగ శిక్షలు:
1) "దాడి" జరిగితే సంబంధిత మృగాణ్ణి శిక్షించాలి. ఆ శిక్ష ఏమిటన్నది సంబంధిత "పతివ్రత" యొక్క సంతృప్తి, పతివ్రతా సంఘాల సంతృప్తి మీద ఆధారపడి ఉండాలి (ఆదర్శం 8)
2) కోర్టు విధించదగిన శిక్షలు:
                జైలు శిక్ష (2 రోజుల నుండి యావజ్జీవం వరకూ), కళాశాల లేదా ఆఫీసు నుండి బహిష్కరణ (విద్యార్థి మృగాళ్ళకు టీసీ మీద "రిమార్కులు", పతివ్రతల సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆఫీసులోని మృగాళ్లకు పెన్షన్‌, పీయెఫ్‌ తదితరాలు కూడా రద్దు చేయవచ్చు), రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణ లేదా లోక బహిష్కరణ (పతివ్రతా సంఘాల సారధ్యంలో).
 సాంఘిక శిక్షలు: దాడి చేసిన "మృగాళ్ల"ను పోలీసులకి అప్పగించబోయే ముందు, తర్వాత "సంఘం" విధించే శిక్షలు కూడా చాలా విధాలుగా ఉన్నా కొన్ని ప్రధానమైనవి బిల్లులో చోటు సంపాదించుకున్నాయి.
1) సంబంధిత "మృగాణ్ణి" చావగొట్టడం, గుండు గీయించి ఊరేగించడం, వెలివేయడం వగైరా
2) మీడియా వారు సంబంధిత "మృగాళ్ల" కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూకి పిలిచి అవమానించడం, గేలిచేయడం వగైరా
3) పోలీసువారు సంబంధిత "మృగాణ్ణి" కోర్టులో హాజరు పర్చే ముందు విధించే శిక్షలన్నీ (ఏ రూపంలో ఉన్నా) ఈ విభాగంలోకే వస్తాయి.

ఆదర్శాలు
         ముందుగా పేర్కొన్న ఆదర్శాలతో పాటు మరికొన్నింటినీ చేర్చి మరొక భాగంగా రాయడం జరుగుతోంది.
1) రాజ్యాంగపరంగా గానీ, సాంఘికంగా గానీ ఒక "పతివ్రత"ని శిక్షించరాదు.
2) వీలున్నప్పుడు లేదా అవసరమైనప్పుడు యీ ఆదర్శాలను మార్చవచ్చు
3) పోలీసులు మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి
4) యీ ఎన్‌కౌంటర్లకు మానవహక్కుల నిబంధనలు వర్తించవు.
5) మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేస్తే, కోర్టులు శిక్షించకూడదు.
6) తప్పు ఎవరిదైనా సరే, మీడియా వారు పతివ్రతలకోసమే పనిచేయాలి
7) పతివ్రతా సంఘాలవారికి గుళ్లు కట్టి పూజించాలి.
8) దాడి చేసిన "మృగాడి"కి విధించవలసిన శిక్ష, సంబంధిత "పతివ్రత"ని, పతివ్రతా సంఘాలని సంతృప్తిపరచే విధంగా ఉండాలి.
ప్రతిజ్ఞలు
1)
                నేను ఒక మృగాణ్ణి. "దాడి" అనేది కేవలం నేను గానీ/ తక్కిన మృగాళ్లు మాత్రమే చేస్తారని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను. "దాడి" వలనగానీ మరే యితర కారణంచేతగానీ "పతివ్రత" ఆత్మగౌరవానికి భంగం కలిగించిన పక్షంలో రాజ్యాంగబద్ధంగా గానీ, సాంఘికంగా గానీ విధించే శిక్షలు అనుభవించడానికి అంగీకరిస్తున్నాను. నా యొక్క హక్కులూ, రక్షణ పూర్తిగా "పతివ్రత"ల చేతిలో ఉంచడానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. పతివ్రతలు చేసే/చేయబోయే "దాడి"ని గౌరవిస్తాను.
2)  (పూర్తిగా ఐచ్ఛికం)

                     నేను పతివ్రతని. కాబట్టి తప్పుచేసినా, చేయకపోయినా పతివ్రతనే. "పతివ్రత"ని శిక్షించరాదన్న నిబంధనను ఉపయోగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. "దాడి" జరిగిన పక్షంలో నా మనస్సాక్షి ప్రకారంగా శిక్ష విధించమని కోర్టుని కోరతాను. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గను.
.............................................
(ఇది ఈ బిల్లు యొక్క సారాంశ రూపం. తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలరని ఆశిస్తున్నాం.)

8 కామెంట్‌లు:

  1. మగవాళ్ళ (బాధితుల) ఆవేదన ప్రతిఫలిస్తోంది ఈ వ్యాసం. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పారేమో!

    రిప్లయితొలగించండి
  2. మందాకినిగారూ..!
    //మగవాళ్ళ (బాధితుల) ఆవేదన ప్రతిఫలిస్తోంది ఈ వ్యాసం//
    అందుకోసమే రాసానీ వ్యాసం (టపా). వచ్చినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు..!

    రిప్లయితొలగించండి
  3. మీ బాధ అర్ధమవుతోందండీ. కాని గుమ్మందాటి బయటికి రావాలంటేనే అమ్మాయిలు వణికిపోయే పరిస్థితులను గూర్చి కూడా కొంచెం మీరు ఆలోచన ఆవేదనలు వ్యక్తం చేస్తే బాగుండేదనిపిస్తోంది నాకు. నిన్నో మొన్నో ఒకే రోజున ఇద్దరు అమ్మాయిలు కేవలం స్త్రీజన్మ యెత్తిన పాపానికి నిష్కారణంగా చనిపోవలసి వచ్చిన వార్త ఒకటి వాళ్ళ ఫోటోలతో సహా పత్రికల్లో వచ్చింది. పరిస్థితి యెంత దరిద్రంగా ఉందంటే, యిటువంటి వార్తలు కూడా మనకు రొటీన్ అయిపోయాయి. యెవరూ పెద్దగా స్పందించటం లేదు.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారూ..!
    నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు..!
    కుర్రవాణ్ని కనక, నా రాతల్లో కొద్దిగా ఆవేశం పాలు ఎక్కువగా కనిపిస్తోందేమో..! తప్పుగా అనుకోకండి
    "ఆడపిల్ల గుమ్మం దాటడానికి వణికిపోయే పరిస్థితులు"..అన్నారు., నా తెలిసినంత జ్ఞానంతో దీనితో అంగీకరించలేను.
    మా తరాన్ని బహుశా, మీరు జాగ్రత్తగా గమనించే ఉంటారు. మీ తరానికీ, మా తరానికీ చాలా తేడా ఉండే ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువమంది అబ్బాయిలు చాలా సాఫ్ట్‌గా ఉంటున్నారు. ఇంకా కరెక్ట్‌ గా చెప్పాలంటే, అమాయకత్వం అనుకోవచ్చు (ఏ విషయం తెలీకపోయినా అన్నీ తెలుసని కటింగ్‌ ఇవ్వడం అన్నమాట..! ఒక్కో సారి నా రాతల్లో కూడా మీకు అనిపించవచ్చు). దానికి కారణాలు చాలా ఉంటాయి. న్యూక్లియర్‌ కుటుంబాలు కావచ్చు వేరే ఏదన్నా కావచ్చు.

    ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఓపిక చేసుకుని చదవండి. ఒక కాలేజిలో ఒక అబ్బాయి- ఒక అమ్మాయి ప్రేమించుకున్నారనుకోండి. (నవ్వొచ్చే విషయమే అయినా..!)
    ఒకటి-రెండు నెలలో, సంవత్సరాలో బానే ఉన్నారు. ఊరంతా తిరిగేసారు అనుకోండి (ఇంట్లో వాళ్లకి చెప్పరు ఇలాంటి విషయాలు. ముఖ్యంగా అమ్మాయిలు..!).
    తర్వాత,

    కేస్‌ 1: అబ్బాయి , అమ్మాయిని దూరం పెట్టడానికి ప్రయత్నించాడనుకోండి. (లేదా వేరే అమ్మాయితో సంబంధం నడుపుతున్నాడనుకోండి.) అప్పుడు సమాజం (అంటే కాలేజిలోని విద్యార్ధులు, లేదా తెలుసున్నవాళ్లు)ఫీలింగ్స్‌ ఏంటి అతని మీద..?

    అతన్ని ఆ అమ్మాయి రోడ్డు మీద చితగ్గొడుతూ ఉంటే, అప్పటికప్పుడు మీ రియాక్షన్‌ ఏంటీ.? (మీరు ఆ అమ్మాయి కొట్టడం మాత్రమే చూస్తున్నారు. మిగిలినవి తెలీదనుకోండి)
    ....

    కేస్‌ 2: అమ్మాయే, ఆ అబ్బాయిని దూరం పెట్టేస్తోందనుకోండి. (లేదా వేరే అబ్బాయితో సంబంధం నెరపుతోందనుకోండి.)
    ఒళ్లు మండిన ఆ కుర్రాడు ఏం చేయగలడు..?
    రోడ్డు మీద ఆ అమ్మాయిని పట్టుకుని కొట్టలేడు కదా..! (కొడుతూంటే చుట్టు ఉండే సమాజం ఊరుకోదు)
    అప్పుడు ఏం చేస్తాడు..?

    ఈ రెండు కేసుల్లోనూ, కొంచెం తెలివితేటలు ఉన్నవాళ్లెవరైనా మర్చిపోవడానికో, తుడిచిపెట్టేయడానికో ప్రయత్నిస్తారు. అదే కాకపోతే, పరిస్థితేంటి..?

    అయినా ఇదంతా పక్కన పెట్టండి. ప్రతీ నాణేనికీ రెండు వైపులుంటాయి అంటారు కదా.! మరి ఈ అన్ని సంఘటనల్లోను ఒకటే రిపీట్‌ ఎందుకు అవుతోంది..? (ఇదే నా అనుమానం)

    సమాజం, మీడియా, పోలీసులు అందరూ ఒకే మూస (generalization) ధోరణిలో ఉన్నారనేదే నా ఆరోపణ..!

    //ఫోటోలతో సహా పత్రికల్లో వచ్చింది. //
    వారిలో ఎక్కువమందికి ఇది ఒక ఆదాయవనరు మాత్రమే..! అందువల్ల వీటిని చూసి ఫీలైపోవడం నా దృష్టిలో ఒక మానసిక రుగ్మత. అది అందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది

    రిప్లయితొలగించండి
  5. పై వ్యాఖ్యకి కొనసాగింపు(కొసమెరుపు)

    పైన పేర్కొన్న మానసిక రుగ్మత వల్లనే నేనీ టపా రాసాను. (నా వాదన ప్రకారం)

    రిప్లయితొలగించండి
  6. వామన వా? నవీన కలియుగ వేమనవా?
    నీ view లో దోషం లేదు కాని పరిపక్వత కావాలేమో అనిపిస్తుంది
    " ఏక పక్ష సిద్ధాంత ధోరణి " నీ నుండీ ఎప్పుడు దూరం అవుతుందో
    అప్పుడు ఈ లోకం నీ నుంచి నవీన వేమన గీత వింటుంది ...!!
    ప్రయత్నం ఆపకు
    ?!
    http://paramapadasopanam.blogspot.com

    రిప్లయితొలగించండి
  7. @ఎందుకో ఏమో గారూ..!

    నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు..!
    మీరన్నట్టు పరిపక్వతకోసమే కృషిచేస్తాను. కానీ, "నవీన కలియుగ వేమన" మాత్రం కాదులెండి...!
    (ఎందుకంటే వేమన మహాయోగి, గొప్ప జ్ఞాని కదా..!)
    "ఏకపక్ష ధోరణి".?!?!? ఏమో మరి..

    రిప్లయితొలగించండి