13, డిసెంబర్ 2011, మంగళవారం

పారిశ్రామిక, ఆస్థాన భద్రత (Industrial, Occupational Safety) - అవగాహన, ఆవశ్యకత



కోల్‌కతలోని ఆసుపత్రిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా, "భద్రత" అనేది మీడియాలోనూ, విధాన నిర్ణేతల్లోనూ మరొక్కసారి చర్చనీయాంశమైంది.. "భద్రత" ఆవశ్యకతపైన ప్రజలకి అప్రమత్తత అవసరం అయినా, మన మీడియా చేస్తున్న అతి చూస్తే మాత్రం నాకర్థమైనదేంటంటే, కొన్ని విషయాల్లో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని..! మనదేశంలో ISO Certification లాంటివి(ముఖ్యంగా అవగాహన) వచ్చిన తర్వాత, ప్రతీ పరిశ్రమ కొన్ని కనీస ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ISO Certification లేకుంటే స్టాక్‌ మార్కెట్‌ లలో గానీ, కస్టమర్‌ అప్రోచ్‌ విషయాలలోగానీ సదరు కంపెనీ వెనకబడిపోతుంది. ఈ ISO Certificationsలో "భద్రత" అనేది చాలా ముఖ్యమైన అంశం..! ఏ పరిశ్రమ అయినా "భద్రత"  విషయంలో రాజీ పడకూడదన్న నియమాలు చాలా ఉన్నాయి. అయితే..మన దేశ ప్రజలలో, ముఖ్యంగా విద్యావంతులు పారిశ్రామిక భద్రత (మరీ ప్రధానంగా అణు సంబంధితమైన పరిశ్రమలు) ఆదుర్దా చూసి, కొన్ని సాధారణ విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందనిపించింది.

1) ప్రమాదం అనేది ఒకసారి జరిగిన తర్వాత గానీ ఎవరికీ తెలీదు. పత్రికల్లో "అగ్నిప్రమాదం" సంభవించింది అని చాలా సులువుగా రాసేస్తారు. చూసేవాళ్ళకి ఒకే ప్రమాదం మళ్ళీ  మళ్ళీ జరుగుతోందని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ యదార్థం వేరుగా ఉండే అవకాశం ఉంది. "అగ్నిప్రమాదం"గానీ, వేరే ఏ విధమైన ప్రమాదమైనగానీ సంభవించడానికి చాలా కారణాలుంటాయి. అన్ని కారణాలు, సందర్భాలు మనకి తెలియకపోవచ్చు. కొన్ని (అప్పటి వరకూ తెలిసున్న) సందర్భాల గురించి  భద్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అప్పటి వరకూ తెలియని కొత్త కారణం వల్ల ప్రమాదం సంభవిస్తే వారికున్న అనుభవంగానీ, జ్ఞానం గానీ సరిపోకపోవచ్చు. అప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. భద్రతా పరిశోధనలో పరిశోధకులకి ఉన్న ప్రధాన అవరోధం ఇదే..! విశ్వసనీయ సమాచారం లభ్యత చాలా తక్కువ. అందుకే ప్రతీ పరిశ్రమకీ Record Keeping చాలా ముఖ్యం అని చెబుతారు. ఒకవేళ కొన్ని పరిశ్రమల దగ్గర సమాచారం ఉన్నా, వేరే ఇతర అంతర్గత కారణాల వల్ల ఎవరికీ ఇవ్వరు. ఇటువంటి తీవ్రమైన అవరోధాల మధ్యలో కూడా కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి,  CBRI లాంటి పరిశోధనా సంస్థలలో...! విద్యార్ధి స్థాయిలో జరిగే పరిశోధనలు "జరిగిపోయిన ప్రమాదం" మీద ఉంటుంది. అటువంటి పరిశోధన ఎంతవరకూ ఉపయోగపడుతుందంటే, ఆ "జరిగిపోయిన ప్రమాదం" మళ్లీ జరగనివ్వకుండా ఉంచేంత వరకూ మాత్రమే..!

2) ఒక ప్రమాదం సంభవించి తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందంటే, ఆ ప్రమాదం జరగడానికి ముందే కొన్ని హెచ్చరికల్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒక అమెరికన్‌ సర్వే ప్రకారం తీవ్ర ప్రమాదాలు, స్వల్ప ప్రమాదాలు, ఆస్తి నష్టాలు, తృటిలో తప్పించుకోడాలూ ఈ క్రింది చెప్పిన నిష్పత్తిలో ఉంటాయి.

తీవ్ర ప్రమాదాలంటే ఒక్కో పరిశ్రమకీ ఒక్కో నిర్వచనాలుంటాయి. కొన్ని పరిశ్రమల్లో ఒక్కరు మరణించినా తీవ్ర ప్రమాదంకిందే లెక్క. కొన్నింటిలో ఆ సంఖ్య పదివరకూ ఉంటుంది. కానీ ఎక్కువశాతం పరిశ్రమలకి ఇద్దరుగానీ అంతకన్నా ఎక్కువమంది గానీ మరణిస్తే అది తీవ్రమైన ప్రమాదమే..!
స్వల్ప ప్రమాదం - వీటి నిర్వచనం కూడా పరిశ్రమను బట్టి మారిపోతుంది. ఒక ప్రమాదం వల్ల స్వల్ప గాయాల దగ్గర్నుండి రెండు-మూడు నెలలు ఆసుపత్రి పాలవడం కావచ్చు, అంతకన్నా ఎక్కువ తక్కువలైనా కావచ్చు.
ఆస్తి నష్టం- ఇందులో కేవలం ఆస్తి నష్టం మాత్రమే ఉంటుంది. తప్పితే ఏ మనిషికీ ప్రమాదం సంభవించని సంఘటనలు.
తృటిలో తప్పించుకోవడం- పేరులోనే ఉందంతా..!
ఈ సర్వేని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అవాగాహన చేసుకుంటారు. కొంతమంది దాన్ని నిష్పత్తిగా భావిస్తే, మరికొంతమంది వేరే విధంగా భావిస్తారు. వారి ఉద్దేశ్యంలో ఒక తీవ్రమైన ప్రమాదం సంభవించడానికి ముందే 10 స్వల్ప ప్రమాదాలూ, 30 ఆస్తి నష్ట ప్రమాదాలూ, 600 తృటిలో తప్పించుకోడాలూ ఉంటాయి. వీటిలోని ఏ ఒక్క సంఘటన దగ్గరా "భద్రతా" సిబ్బంది జాగ్రత్త పడకపోవడం వల్లనే ఆ తీవ్ర ప్రమాదం సంభవించిందని వారి ఉద్దేశ్యం(ఆరోపణ).! అయితే, ఇంతకు ముందు చెప్పిన కారణం (అప్పటి వరకూ ఎవరికీ తెలీయని కారణం) అయితే ప్రమాదాన్ని నివారించడం దాదాపుగా అసాధ్యం..!

3) వివిధ ప్రమాదాలు, వాటి ప్రభావాల గురించి సాధారణ అవగాహన ఈ క్రింది పట్టిక ఇవ్వచ్చు.
ప్రమాదం
జరుగు సంభావ్యత
ప్రాణ నష్టం
ఆర్థిక నష్టం
అగ్ని (Fire)
ఎక్కువ
తక్కువ
ఒక మోస్తరు
విస్ఫోటనం (Explosion)
ఒక మోస్తరు (intermediate)
ఒక మోస్తరు
ఎక్కువ
విషవాయు ఉద్గారం (Toxic release)
తక్కువ
ఎక్కువ
ఒక మోస్తరు

కోల్‌కతాలో మొన్న జరిగిన ప్రమాదంలో విషవాయు ఉద్గారం జరిగిందని భావిస్తున్నారు. అందుకే ప్రాణనష్టం అధికంగా ఉంది.

4) ప్రమాదం సంభవించినపుడు తప్పించుకోడానికై  అత్యవసర ద్వారాలూ, పరికరాలూ ఏర్పాటు చేసి ఉంటాయి. ఈ ద్వారాలూ, పరికరాలూ ఎక్కడెక్కడ పెట్టాలనేది నిర్ణయించడానికి కూడా కొన్ని ప్రమాణాలున్నాయి. చెప్పగల నిపుణులు కూడా ఉన్నారు. లేనిదల్లా ప్రమాదం పట్ల అవగాహన మాత్రమే..! (దీనికి ఉదాహరణ భోపాల్‌ గ్యాస్‌ ఉదంతం). తప్పించుకుని పోయే మార్గాలని నిర్ణయించేటప్పుడు ఆ ఆస్థానంలోని మనషులు సంఖ్య, .ఇలా చాలా కారణాలమీద ఆధారపడతారు. తొక్కిసలాటలు జరిగితే అసలు ప్రమాదం కన్నా తొక్కిసలాట వల్లనే ఎక్కువ ప్రాణనష్టం ఉంటుంది (పూర్తిగా సమర్ధించకపోయినా ఒక మోస్తరుగా అర్థమయ్యే ఉదాహరణ ఏంటంటే, పెద్ద హాలులో మంటలు చెలరేగాయనుకుంటే, తప్పించుకొనే మార్గం పొడవు చిన్నగా ఉండాలా, పెద్దగా ఉండాలా అనేది మనుషుల సంఖ్యమీద ఆధారపడాలి. పొడవు చిన్నగా ఉండే మార్గంలో ఎక్కువమంది పట్టే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంటుంది.). ఉదాహరణకి కొంతకాలం కిందట వారణాసిలో గంగా హారతి సమయంలో జరిగిన బాంబు పేలుడులో, పేలుడు వల్ల ప్రాణనష్టం ఏమి సంభవించలేదు, ఆ తర్వాత వచ్చిన తొక్కిసలాటలో మాత్రమే ప్రాణనష్టం జరిగింది.(ఎంతమందనేది పక్కన పెడితే..!)

5) ఇంక అవగాహన గురించి మాట్లాడితే, భోపాల్‌ గ్యాస్‌ ఉదంతం గురించే ప్రముఖంగా చెప్పుకోవాలి. నిజానికి భోపాల్‌ గ్యాస్‌ ప్రమాదం మరీ అంత పెద్దదేం కాదు. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ తదితర పారిశ్రామిక దేశాలలో ఆ పాటి ప్రేలుళ్లూ, ప్రమాదాలూ చాలా సాధారణం. కానీ ప్రాణనష్టం విషయానికొస్తే మాత్రం భోపాల్‌ ఉదంతం అప్పటి వరకూ మానవ చరిత్రలో అతి పెద్ద దుర్ఘటనగా నిలిచిపోయింది. భోపాల్‌ ప్రమాదంలో విపరీతమైన ప్రాణనష్టానికి ప్రధానమైన కారణం ఒక్కటే.. అవగాహనా లోపం..! మనదేశానికి అప్పటి వరకూ పరిశ్రమల మీద, భద్రత మీద సరైన అవగాహన లేదు. పరిశ్రమలోని పనివారు, పరిసరాల్లోనే గుడిసెలు, షెడ్లూ వేసుకుని జీవిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. కారణం అవగాహనా లోపం (ఇప్పటి వరకూ నాకున్న అభిప్రాయం). పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతంలో వారిని అనుమతించకపోయి ఉండుంటే, ఆ ప్రమాద తీవ్రత తక్కువగానే ఉండి ఉండవచ్చు. (అయితే దీర్ఘకాలికంగా భోపాల్‌ ప్రాంతంలో వచ్చిన మార్పుల గురించి నాకు పూర్తి అవగాహన లేదు). వెరసి నే చెప్పేదేంటంటే అవగాహన లోపం చాలా ప్రమాదాలకి ప్రధాన కారణం. ఒకప్పుడు భోపాల్‌ గ్యాస్‌ ఉదంతం అయినా, ఇప్పటి కోల్‌కతా ఆసుపత్రి ఉదంతం అయినా. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి, రానివ్వకుండా ఆపడం "భద్రతా సిబ్బంది" కర్తవ్యం, లక్ష్యం, బాధ్యత వగైరా.. అదే విధంగా యాజమాన్యానిది కూడా..!

గమనిక:
1. Occupational Safetyకి సమానార్థకమైన భారతీయ పదం నాకు తట్టలేదు. "ఆస్థాన భద్రత" అనేది కొద్దిగా దగ్గరగా ఉందని భావించడం జరిగింది. Occupational Safety లో “occupational” అంటే అది నివాస భవనం కావచ్చు, వంతెన కావచ్చు, వ్యాపార సముదాయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, స్టేడియం కావచ్చు, ఆసుపత్రీ, పరిశ్రమలూ, భూగర్భ నిర్మాణాలూ, గోదాములూ, ఆఖరికి సెల్‌ టవర్‌ కూడా కావచ్చు.. అన్నింటికీ వాడే ఉమ్మడి పదం..! అదే విధంగా ఇతర పదాలకి కూడా తగిన తెలుగు పదాలను తెలుసుకొనగోరుతున్నాను.
2) ఈ టపా రాయడంలోని ఉద్దేశ్యాలు చాలానే ఉన్నాయి. ఒకటి నా ఆలోచనా పరిధిని పెంచుకోవడం. రెండోది ఉద్యోగార్థం నా ప్రవర(Resume)లో చెప్పుకోవడం. ఇంకోటి ఆత్మసంతృప్తి పొందడం ఆత్మవిశ్వాసం పెంచుకోవడం...వగైరా..
3) నాకు ఇప్పటి వరకూ పరిశ్రమలో పనిచేసిన అనుభవం లేదు కాబట్టి, పై వ్యాసంలోగానీ, అభిప్రాయంలో గానీ తప్పులుండే అవకాశం ఉంది 

2 కామెంట్‌లు:

  1. In my opinion, the infrastucture / social norms / laws in India in general are so out dated that it needs real focus on the part of administration / ruling parties to evolve to the next / acceptable level to deal witht he huge population and the scaling up that is required for it's growing needs. Till date we quote only American stats etc. for analyzing and understanding anything and everything. Which shows that the record keeping / research funding / methodologies that we have in the country and civil administration is grossly insufficient. I was not convinced, when in the popular medium like Movies it is showed that we the people need to do something about this kind of stuff at the gross root level. Contrary to it, it's the laws of the land that make or break anything. So the a real start would be (I am not talking about the knee-jerk reactions) introducing amendements in such a level to our existing consitution that it's thoroughly reviewed and updated, and added sufficiently. Apart from that the bills that are introduced in the parliment / state assemblies are not sufficient enough currently. There are a huge number of issues that needs public debate and adaptation as bill / law. Even the funding that is allocated to various federal programs in India needs to improve, and transperany as well by publishing the expenditure to public perusal. Pushing for and strengthening the MP/MLA and other political positions related RECALL law will help in increased responsibility and accountability by the elected leaders. These thoughts are though random can be ordered and prioritized with an open and honest public debate. Apart from the possibility / practicality aspect we have to realize that democratic process is painful and times-taking, but we have to start some where. I don't suppose it's that hard (I am not saying it's easy or faster either, but achievable with an iron will) when the private sector is capable of achieving what they are doing currently in their respective industries / enterprises. After all there is nothing to lose if we give it a shot, unlike private sector which will die its eventual dealth if it fails to achieve its profit goals.

    రిప్లయితొలగించండి
  2. @Gan గారు.
    నమస్తే..! నా టపా వీక్షించినందుకు ధన్యవాదాలు..
    మీరు ./Till date we quote only American stats etc. for analyzing and understanding anything and everything/..అన్నారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనం ప్రస్తుతం వాడుతున్న సాంకేతిక విజ్ఞానం ఇతర దేశాల దగ్గర్నుండి తెచ్చుకుంటున్నదే.! మీరు చెప్పిన విధంగా మూలం నుండి స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలని విధాన నిర్ణేతలు భావించడం లేదు. ఇప్పటి ప్రపంచీకరణలో అది సరైనది కాదు కూడా..! దానికోసం మనదేశం లాంటి దేశాలెన్నో ప్రయత్నించి దాదాపుగా విఫలమైపోయాయి. ఒక్క పూర్వపు రష్యా తప్ప..! అందుకే విధాన నిర్ణేతలు అన్ని విషయాల్లోనూ స్వదేశీ పరిజ్ఞానం సంపాదించుకోవాలని గిరి గీసుకుని కూర్చోకుండా, పద్ధతి మార్చేసారు.కొన్ని క్షేత్రాలలో మాత్రమే దృష్టి పెట్టి, ఆయా క్షేత్రాలలో ఏకఛత్రాధిపత్యం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనికి అచ్చమైనలు ఉదాహరణ ఐ.టీ రంగం, బీ.పీ.వో రంగం ఇలాగ..! దీని గురించి ఎక్కువగా మాట్లాడితే వేరే చోటికి వెళ్లిపోతుంది.

    ఇంక "భద్రత" విషయానికొస్తే, ఇంకొక ముఖ్య విషయం టపాలో రాయలేదు. "భద్రత" పై పెట్టే ఖర్చు, చాలా మంది ఆర్ధికవేత్తలూ, పరిశ్రమలూ కూడా వ్యర్ధమైన ఖర్చుగా, పరిశ్రమగానీ, సంస్థగానీ చేస్తున్న దండగ పని/ ఖర్చుగా భావిస్తారు(యి). కారణం చాలా స్పష్టం.. "భద్రత"పై పెట్టిన ఖర్చు ప్రమాదం జరిగినపుడు మాత్రమే అక్కరకు వస్తుంది. ప్రమాదం రాకపోతే ఉపయోగపడదు.

    రిప్లయితొలగించండి