22, డిసెంబర్ 2011, గురువారం

రామానుజన్‌ సంఖ్య (1729)



మన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌ అయ్యంగార్‌ గురించి అందరికీ తెలిసిందే.. ఆయన జన్మదిన సందర్భంగా రాసుకుంటున్న టపా ఇది..!

బహుశా, చాలామందికి "రామానుజన్‌ సంఖ్య" గురించి తెలిసే ఉంటుంది. అందువల్లనూ, సమయం లేకపోవడం వల్లనూ దీని గురించి పెద్దగా రాయడం లేదు..!
రెండు వేర్వేరు జంట సంఖ్యల ఘనాల మొత్తంగా రాయగల అతి చిన్న సంఖ్య అది..! 
123+ 13 = 1728+1 =1729
103+93 = 1000+729=1729

ఆయన రాసుకున్న పుస్తకాల్లో కొన్ని పోయాయట..! ఉన్న కొన్నింటిలోనూ ఉన్న వాటి మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయట.. ఆయన "ఇది చిన్నదేలే" అని వదిలేసిన సిద్ధాంతాల్ని నిరూపించడానికి బుర్రలు బద్దలు కొట్టేసుకుంటారు, పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో..! మన విశ్వవిద్యాలయాలకి ఆ భాగ్యం కూడా లేదు..!
చిన్న గుమాస్తాగా పనిచేస్తున్న వ్యక్తి, చిత్తు కాగితాలమీద పెన్సిల్‌ ముక్కతో బరికిన నాలుగు పిచ్చి రాతలు కేంబ్రిడ్జివిశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ మతి పోగొడతాయని ఎవరైనా ఊహించగలరా..? ఈ రోజుల్లో కూడా అంతగా చేయడం అసాధ్యం. కానీ అది రామానుజన్‌కి సాధ్యమైంది. ఆయన ప్రతిభ ఎంతవరకూ వెళ్లిందంటే, ఆ ప్రొఫెసర్‌ తాను కనుగొన్న అతి గొప్ప విషయం "శ్రీనివాస రామానుజన్‌" అని చెప్పుకునేంతవరకూ..!


BTW, నా సంగతి.., ఈ రామానుజన్‌ సంఖ్యని చూసి స్ఫూర్తి తెచ్చుకుని., లెక్కల మేస్టారి కొడుకునని నిరూపించుకోవాలని, ఆయన ఘనాలకి(^3)కి చేస్తే...  మనం పవర్‌ 4 (^4) చేద్దామని ప్రయత్నించి, విఫలమైపోయి, వర్గాల(^2)కి సాధించి, దాన్నే నా అంతర్జాల చిరునామాల్లో వాడుతున్నాను, స్కూల్లో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నానికి గుర్తుగా..! నా బ్లాగ్‌ URLలో కూడా ఉంటుంది ఈ సంఖ్య..
112+22=121+4=125
102+52=100+25=125

నే చెప్పేదేంటంటే, ఈ రామానుజన్‌ సంఖ్య నాకు స్ఫూర్తినిచ్చిందని.., అంతకంటే వారే ఏదీలేదు..! దీనిద్వారా నే సాధించేమీ లేదు..! (ఇలా టపా రాయడం తప్ప)


శ్రీనివాస రామానుజన్‌ గానీ, ఆది శంకరాచార్యులుగానీ, జీసస్‌ క్రైస్ట్‌ గానీ బతికింది 33 యేళ్ళే..! (అదేం సారూప్యతో అర్థం కాదు).. కానీ తరతరాలకీ గుర్తుండేపోయే విధంగా జీవించారు. అద్భుతాలు చేసి చూపించారు..
ఏది ఏమైనా భారతీయులైన వివేకానందుడు, రామానుజన్‌, శంకరాచార్యులు, యువతరానికి ఇచ్చే/ ఇవ్వగల స్ఫూర్తి అంతా ఇంతా కాదు..! మనం ప్రచారం చేసుకోవడంలో ఉంది అంతే..!
......
ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుని జన్మదిన సందర్భంగా...!
BTW., ^2కి గానీ, ^4కి గానీ అతి చిన్న సంఖ్యలు ఎవరైనా చెపితే బాగుణ్ణు..!

4 కామెంట్‌లు:

  1. అలక్జాండర్ కూడా 33 ఏటనే పోయేడు.

    రిప్లయితొలగించండి
  2. వివేకానందులు బ్రతికింది 39 ఏళ్ళండీ.
    మంచి టపా!

    రిప్లయితొలగించండి
  3. సురేష్‌ గారూ.. నమస్తే..!
    నా టపా సందర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది.,
    మీ టపాలని చూసి inspire అయ్యి కొన్ని టపాలు రాసిన కారణం చేత...!
    BTW, వివేకానందుడి ప్రస్తావన తొలగించాను.
    ...
    ధన్యవాదములు

    @అబ్రకదబ్రగారు
    నమస్తే..! అలెగ్జాండర్‌, నాకు సమయానికి గుర్తు రాలేదులెండి..

    రిప్లయితొలగించండి
  4. manadesam lo chalamandiki "raamaanujam" gaaru kuda theliyani vaaru unnaru. mana chaduvulu ala thayaru chestunnai. prathi book lo vere desapu vaalla prasnale kaani manadesa saastravettala samasyalanu ivvatam laadu. dayachesi manadesa saastravettalanu gurtuchesukundam.

    రిప్లయితొలగించండి