15, నవంబర్ 2013, శుక్రవారం

భద్రాచలం – ఎగువ గోదావరి


          మొదట ఉమ్మడి గోదావరి జిల్లాలో, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉండి; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అప్పుడే కొత్త గా ఏర్పడిన ఖమ్మం జిల్లాలో కలిసిన రెవెన్యూ మండలం, భద్రాచలం. తెలంగాణవాడైన, కంచర్లగోపన్న కట్టించిన ఆలయం ఉంది కాబట్టి, ఇది తెలంగాణకే చెందాలని వాదనలు మొదలుపెట్టారు, తె.వేర్పాటువాదులు. అసలు విభజనకే, అత్యధిక శాతం జనాలు ఒప్పుకోకపోతే, పంపకాలు గుఱించి ఎందుకు చర్చ అని అంటారు కొందరు. హైదరాబాదుపై ఆంధ్రులకి హక్కు లేనప్పుడు (లేదని వాగుతున్నప్పుడు), నిన్నగాక మొన్న కలిసిన భద్రాచలంపై తెలంగాణవారికి హక్కు ఎక్కణ్ణుండి వస్తుందని ఇంకొందరు. ఆంధ్రాలో కలిపెయ్యమని కొందరు, తెలంగాణలో ఉంచాల్సిందేనని బెదిరింపులకి దిగుతున్న ఇంకొందరు. వెరసి భద్రాచలం బంతాట, ఆడటం మొదలుపెట్టారు.


భద్రాచలానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చెందిన వివిధ సంఘటనల కాలరేఖ 
 • పోకల దమ్మక్క అనే గిరిజన స్త్రీకి సీతారామలక్ష్మణుల పుట్టుశిలలు దొరికాయి.
 • గోల్కొండ సుల్తానుల ఏలుబడిలో ఉన్న ఉమ్మడి తెలుగు ప్రాంతాలు ( ఉత్తరాన గంజాం జిల్లావఱకూ)లోని ప్రజలు ఇచ్చిన విరాళాలతో, హుస్నాబాద్ తహశీల్దారు, కంచెర్ల గోపన్న, 17వ శతబ్దంలో కొత్త ఆలయాన్ని నిర్మించాడు.
 • తానీషా ప్రభువుమీద అసంతృప్తితో, ఔరంగజేబు తానీషా అసమ్మతిదారులతో గోల్కొండ పైన దండెత్తి ధ్వంసంచేశాడు. సామ్రాజ్యానికి తలలో నాలుకలో ఉన్న హిందూ మంత్రులు అక్కన్న, మాదన్నల తలలు నరికించి, తానీషాని దౌలతాబాద్ లోని జైలులో పెట్టాడు. (12 యేళ్ల అనంతరం తానీషా అక్కడే మరణించాడు). అసఫ్ ఝా ని తన ప్రతినిధిగా నియమించాడు.
 • మొగలు సామ్రాజ్యం అస్థిరమైన పిదప, అసఫ్ ఝా వంశీయులు(నిజాములు) స్వతంత్రులైనారు. నిజాము అధీనంలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగంతో సహా, ఒరిసాలోని గంజాం, కోరాపుట్; తమిళనాడులోని ఆర్కాడు తదితరాలన్నీ ఉండేవి.
 • అనేక అస్థిర పరిస్థితుల అనంతరం, 1768లో నిజాం “సర్కారు ప్రాంతాన్ని” బ్రిటీషువారికి అప్పగించినా, 1823 వరకూ నిజాం నియంత్రణ ఉండేది. 1823 అనంతరం, సర్కారు ప్రాంతం పూర్తిగా కంపెనీపాలనలోకి వచ్చింది.
 • సరిగ్గా, అదే సమయానికి కృష్ణా – గోదావరి డెల్టాలో (సర్కారు ప్రాంతం) తీవ్రాతితీవ్రమైన కరువు వచ్చింది (దీనినే డొక్కల కరువు అంటారు). ఆ సమయంలో, గోదావరి మండలం లో ప్రతీ నలుగురిలో ఇద్దరు (జనాభాలో 50%), గుంటూరు సీమలో ప్రతీ ఐదుగురిలో ఇద్దరూ(జనాభాలో 40%) చచ్చిపోయారని, అధికారిక అంచనా. "డొక్కల కరువు" కాలంలో వేలమంది, మద్రాసు, సేలం, రంగూన్, కలకత్తా, మారిషస్ లకి వలసపోయారు. 
 • బ్రిటీషు ప్రభుత్వం నియమించిన అధికారిగా కాటన్ మహాశయుడు, 1850లో ధవళేశ్వరం ఆనకట్టనీ, 1853లో బెజవాడ ఆనకట్ట(ప్రకాశం బారేజి)నీ పూర్తిచేసాడు. అదే కాటన్ దొర, భద్రాచలాన్ని మద్రాసు ప్రెసిడెన్సీకి అప్పగించాలనీ, పోలవరం వద్ద పెద్ద ప్రాజెక్టు భవిష్యత్తులో చేపట్టవచ్చుననీ కూడా సూచించాడు.
 • కాటన్ సూచనమేరకు, 1860లో నిజాం ఎస్టేటుగా ఉన్న భద్రాచలం మండలాన్ని మొదట మధ్యరాష్ట్రం (Central Provinces)కి బదిలీచేశారు. తర్వాత, 1874 ఏప్రిల్ 1న మద్రాసు ప్రెసిడెన్సీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలోకి బదిలీచేశారు.
అప్పటి స్థితులు
 • 1874 నుండి 1959 వఱకూ, దేవీపట్నం (ప్రస్తుతం తూ.గో.జి ) ఎగువనున్న “కొండమొదలు” నుండీ వాజేడు వఱకూ ఉన్న ప్రాంతాన్ని “ఎగువ గోదావరి (Upper Godavari)”గా పిలిచేవారు. ఈ ప్రాంతానికి ముఖ్యపట్టణమైన భద్రాచలంలో సబ్-కలెక్టర్ అఫీసుని ఆ సందర్భంలోనే ఏర్పాటుచేసారు. దేవీపట్నం నుండి, అంతర్వేది వరకూ ఉన్న ప్రాంతాన్ని “దిగువ గోదావరి” అని పిలిచేవారు. దీని ముఖ్యపట్టణం రాజమండ్రి. అలాగే పశ్చిమ గోదావరి ముఖ్యపట్టణం, ఏలూరు.
 • కాకెనాడ(Cocanada) జిల్లా కేంద్రం అయినప్పటికీ, ఈ మూడు పట్టణాలలో సబ్- కలెక్టర్ ఆఫీసులు ఉండటం వలన, అతి ముఖ్యమైన అధికారులకి తప్ప, జిల్లా కేంద్రానికి (కొంతకాలం రాజమండ్రి, చాలాకాలం కాకెనాడ) ఎవరికీ రావలసిన అవసరం వచ్చేది కాదు.
 • భద్రాచలం మండలం విలీనం తర్వాత, కాటన్ ప్రతిపాదించిన విధంగానే, గోదావరి నదిపైన జలరవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. కోనసీమ సస్యశ్యామలమైంది. కోనసీమలోకి వ్యవసాయ వలసలు కూడా జరిగాయి. ప్రధానంగా, విశాఖపట్నం జిల్లా నుండీ, భద్రాచలం, రంపనాడు (Rampa Country) మండలాల నుండీ వలసలు ఎక్కువ జరిగాయి.
 • రాజమండ్రి – కాకెనాడ కాలువ తవ్విన తర్వాత, కాకెనాడ ముఖచిత్రమే మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడింది (1881 నాటి రాజమండ్రి జనాభా 19వేలు, 1901 నాటికి 36వేలు. 1901నాటికి మద్రాసు జనాభా మూడున్నర లక్షలు). మద్రాసు – కలకత్తా మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు(Safest and Best Port)గా,  రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. ఒకానొక స్థాయిలో, కాకెనాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.)
 • బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద,  భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవునుండి ప్రత్తి (ప్రధానంగా), తదితరాలు ఎగుమతి అయ్యేవి. 
 • 1906 బెంగాల్ విభజన, అనంతర పరిస్థితులు, బ్రిటీషువారిని పునరాలోచనలో పడేసి, 1921నాటికి దేశ రాజధాన్నే మార్చేటట్టు చేయడంతో, కాకెనాడే కాకుండా, తూర్పుకోస్తా మొత్తం ప్రాధాన్యం కోల్పోయింది. (విశాఖపట్నం మాత్రం, 1926లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడం వల్లనైతేనేమి, 1941లో ది సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లి. స్థాపించడం వల్లనైతేనేమి, నెమ్మదినెమ్మదిగా 1941నాటికి కాకెనాడని దాటి, ముందుకు పోయింది. కాకినాడ –విశాఖపట్నం మధ్య పోటీ, కుందేలు-తాబేలు కథలాంటిదే.!).


కృష్ణా గోదావరి ప్రాంతీయుల ప్రాతఃస్మరణీయుడు - కాటన్ దొర

కాలరేఖ (మళ్లీ)
 • 1823 నుండి 1874 వరకూ మాత్రమే, వేర్వేరు ఏలుబడులలో ఉన్న గోదావరి, భద్రాచలం ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఖమ్మం జిల్లాలో కలిపారు.
 • 1959లో కలిసినప్పటికీ 1972నాటికిగానీ భద్రాచలానికి “స్థానిక హోదా”ని (ముల్కీ హక్కు) ఇవ్వలేదు, ఖమ్మం జిల్లాలో.

ప్రస్తుతం
 • భద్రాచలానికి జిల్లాకేంద్రం కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయి.చుట్టూ ఉన్న గిరిజన ప్రాంతాలకి, ఆ అవసరమూ ఉంది.
 • భద్రాచలం డివిజనే కాక, తూ. గో.జి లోని రంప నాడు (Rampa country – రంపచోడవరం రెవెన్యూ డివిజన్)లోని డొంకరాయి, గుర్తేడు వంటి  చాలా ప్రాంతాలకి, పెద్ద దిక్కు భద్రాచలమే.
 • జిల్లాల పునర్విభజన, అనంతరం ఏర్పాటు చేయవలసిన జిల్లాలలో, మొదటి వరుసలో ఉండేది భద్రాచలమే. (అది ఆంధ్రా అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా). సీమాంధ్రలోనైతే,  తూ.గో.జిలోని  రంపనాడులోని కొంతభాగాన్నీ, భద్రాచలం మన్యాన్నీ కలిపి ఒక జిల్లాగా చేసే అవకాశం ఉంది.
 • హైదరాబాదునుండి “భాగో” అంటూ ఐదున్నర దశాబ్దాల అనుబంధాన్ని తోసిరాజని, సీమాంధ్రులను గెంటడానికి రెడీ అవుతున్న తె.వేర్పాటువాదులు, సీమాంధ్రులని తర్వాత సైతం ఎదగనివ్వకుండా మోకాలడ్డేసి, పోలవరం ఆపుచేయడానికే “ఐదుదశాబ్దాల అనుబంధంతోటి, భద్రాచలం కూడా మాదే” నంటున్నారు.
 • పోలవరం ముంపు ప్రాంతమే కాకుండా, దుమ్ముగూడెం కూడా ఈ మండలం లో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకి, ఆపుచేసినా, కనీసం అడ్డంకులు ఏర్పాటుచేసినా, మళ్ళీ “డొక్కల కరువు” నాటి పరిస్థితులు కృష్ణా-గోదావరి డెల్టాలకి, ఎడారిగా మారే పరిస్థితులు రాయలసీమకి ఎదురవుతాయి.

పోలవరం
          కాటన్ మహాశయుడు భారతదేశపు నదుల అనుసంధానం గుఱించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వఱకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, దివాన్ బహుద్దూర్ వెంకట కృష్ణ అయ్యర్ ప్రాథమిక పరిశీలనల అనంతరం, 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ .రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున “రామపాద సాగరం”గా పిలిచిన ప్రాజెక్టుకి 1980నాటికిగానీ శంకుస్థాపన జరగలేదు.
 •  పోలవరం ముంపు ప్రాంతంలో 83% శాతం భద్రాచలం మండలంలోనే ఉంది.
 • పోలవరం ఎడమ వాలు కాలువ (Left Bank Gravity Canal) ద్వారా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం నగరం, కాకినాడ – విశాఖపట్నం పారిశ్రామిక మండలానికీ, ఎడమ ఎత్తిపోతల కాలువ (Left Bank Lift Canal) ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నాలలోని మెట్ట ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి; కుడి వాలు కాలువ (Right Bank Gravity Canal ) ద్వారా ప్రకాశంబ్యారేజిని అనుసంధానం చేస్తూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకి,  కుడి ఎత్తిపోతల కాలువ (Right Bank Lift Canal) ద్వారా పులిచింతల జలాశయం అనుసంధానం చేస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాలకి గోదావరి జలాలని కేటాయిస్తారు.
 • పోలవరం నిర్మాణం అనంతరం, గోదావరినుండి కృష్ణకి మళ్ళించే 80 టి.ఎం.సి ల నీటిలో ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్రల వాటాగా 35 టి.ఎం.సీలు పోగా 45 టి.ఎం.సిలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు దక్కుతాయి.
 • పోలవరం నిర్మాణ అనంతరం, రామపాద సాగరం లో భవిష్యత్తులో నిర్మించబోయే, దుమ్ముగూడెం – నాగార్జునసాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు వలన 150 - 165 టి.ఎం.సీల గోదావరినీటిని కృష్ణకి మళ్ళిస్తారు.
 • మొత్తంగా, గోదావరినుండి కృష్ణకి మళ్ళించే నీటిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు దక్కేది, 195 – 210 టి.ఎం.సీ లు. ఈ మిగులు జలాల ఆధారంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణదశలోనూ, ప్రతిపాదనల దశలోనూ ఉన్నాయి. ప్రత్యక్షంగా, సర్కారు జిల్లాలూ, ఖమ్మం, నల్లగొండ జిల్లాలూ; పరోక్షంగా గ్రేటర్ రాయలసీమ,మహబూబ్ నగర్ జిల్లాలూ ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందుతాయి.
 •  పోలవరం పూర్తయిన తర్వాత, సర్కారు జిల్లాలకి 40-50 యేళ్లవరకూ, (దాదాపు శాశ్వతంగా) నీటి ఎద్దడి అనేదే రాదు. సముద్రం పాలవుతున్న గోదావరి నీటిలో 15-20% వఱకూ వినియోగంలోకి రావచ్చు.
 • విశాఖపట్నం – కాకినాడ – రాజమండ్రి ప్రాంతం, పారిశ్రామికంగా హైదరాబాదుని తలదన్నే స్థాయికి చేరుతుంది.

ఖనిజ సంపద, అడవులు
          అడవులలోని, ఖనిజాలు, అటవీసంపద అక్రమ రవాణాకి వ్యతిరేకంగా, సర్కారుజిల్లాలలో 1870లలో వచ్చిన “రంప విప్లవం”, బ్రిటీషుప్రభుత్వాన్ని 1/70 చట్టాన్ని తెచ్చేలా చేసింది. ఖనిజాలు, అడవులే కాకుండా గిరిజనుల సాంస్కృతిక, సామాజిక స్వాతంత్ర్యాలను కూడా కోరుకుంటూ, అల్లూరి శ్రీరామరాజు నాయకత్వంలో మన్యం మరో పోరాటం చేసింది. అందుకు వెన్నుదన్నులు ఇచ్చింది, సర్కారు ప్రజానీకమే. అటువంటి వారిమీద దోపిడీదారులని అరోపణలు చేస్తూ, ఓ తె.వేర్పాటు పత్రికలో ఒక వ్యాసం భద్రాచలంలోని అటవీ సంపదకి “వెలకట్టింది”. మచ్చుకి కొన్నింటిని, కాపీ పేస్టుచేస్తున్నాను. వీరి వ్యాసంలోని అసలు ఉద్దేశ్యమేమిటో, తేలిగ్గానే బోధపడుతుంది.

బొగ్గు నిల్వలు
//  తాలిపేరు నది ఆవల చర్ల మండలం నుంచి ఎగువ ప్రాంతం వరకూ అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ జరిపితే సుమారు వంద ఏళ్లపాటు నిరాటంకంగా బొగ్గు తీసేందుకు అవకాశం ఉంది.// , // 1987లో ఇక్కడ సర్వే నిర్వహించిన అధికారులు.. ఇక్కడి బొగ్గు నాణ్యతను సీ గ్రేడ్గా గుర్తించారు. క్వాలిటీ కలిగిన బొగ్గు మొత్తం సింగరేణిలోనే ఎక్కడా లభించదు. ప్రస్తుతం ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లో , ఎఫ్ గ్రేడుల బొగ్గు మాత్రమే లభిస్తున్నది. వీటి పోల్చితే సీ గ్రేడ్ బొగ్గు ధర రెట్టింపు ఉంటుందని అంచనా.// 

సున్నపురాయి
//  చర్ల మండలంలోని కాలివేరు గుట్టల్లో సున్నపరాయి నిల్వలు అపారంగా ఉన్నాయి. సుమారు 30వేల హెక్టార్లలో సున్నపురాయి ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.//, //  ఒక్క టన్ను విలువ రూ.500 నుంచి, రూ వరకు ఉంది. మిలియన్ టన్నుల్లో విస్తరించి ఉన్న సున్నపురాయి గనుల విలువ వెలకట్టలేనిది. సుమారు లక్షకోట్ల వరకు విలువైన ముడి ఖనిజం ఉంటుందని నిఫుణులు అంచనా వేశారు. //

బాక్సైట్
// బాక్సైట్ నిల్వలు చింతూరు, వీఆర్ పురం, చర్ల మండలాలలో, చింతూరు, వీఆర్పురం మండలాల మధ్య 30 కిలోమీటర్ల మేర విస్తారంగా ఉన్నాయి. మూడు మండలాల పరిధిలో మొత్తం లక్ష హెక్టార్లలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే రెండు వందల ఏళ్లపాటు నిరంతరాయంగా నడిపించవచ్చు. సుమారు 50వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. టన్ను బాక్సైట్ విలువ 15వేల నుంచి 20వేల వరకు ఉంటుంది. మొత్తాన్ని అంచనా వేస్తే ఐదు లక్షల కోట్ల ముడిఖనిజం ఇక్కడ లభ్యమవుతుంది.//

గ్రాఫైట్
// చింతూరు మండలంలో గ్రాఫైట్ విస్తారంగా ఉంది. సుమారు 50వేల హెక్టార్లలో రూ.లక్ష కోట్ల విలువ చేసే ముడిఖనిజం ఉందని నిపుణులు అంచనా వేశారు. అక్కడ పరిక్షిశమ పెట్టి 50 ఏళ్లపాటు నడిపించవచ్చు. సుమారు ఐదు వేల మంది ఉద్యోగ అవకాశం లభిచనుంది. ఖనిజం మొత్తం విలువ పది లక్షలకోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.//

// చర్లలో అపార బొగ్గు ఖనిజాలు ఉన్నాయి: బండి రాము (చర్ల గ్రామస్తుడు)
చర్లలో అపార బొగ్గు ఖనిజాలు ఉన్నాయి. 50ఏళ్ల క్రితమే ఇక్కడ నిర్వహించిన సర్వేలో బీ బ్లాక్ బొగ్గు ఉందని సర్వే బృందం నిర్థారించింది. ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ సంపద తెలంగాణ ప్రాంతానికే చెందాలి. తద్వారా ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుంది.//
          1/70 అమలులో ఉన్న ప్రాంతాలలో స్థానిక గిరిజనులు తప్ప, మరెవ్వరూ భూమిని, ఆస్తులని కొనుగోలు చేయడానికి వీల్లేదు. అలాంటిచోట్ల, అగ్రకుల వ్యవసాయదారులు ఎక్కణ్ణుండి వచ్చి భూములు కొన్నారో, ఆ దేవుడికే తెలియాలి. స్థానిక గిరిజనులు అనే అవకాశాన్ని వాడుకుని, పక్కజిల్లాలలోని రాజపుత్ర గిరిజనులు, తమ అవకాశాలని తన్నుకుపోతున్నారని, భద్రాచలానికే పరిమితమై ఉన్న స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నా, పట్టించుకునేవాడు ఎవడూ లేడు.
          పైపెచ్చు, గనులు జాతీయ సంపద, సింగరేణి బొగ్గు అయినా, కెజి గ్యాస్ అయినా, భద్రాచలం చుట్టుపక్కల ఉన్నఖనిజాలైనా. సొంత రాష్ట్రంలో దొరుకుతున్న గ్యాసుని పక్కరాష్ట్రాల కంపెనీలు తరలించుకుపోతూ కూడా, సరైన రాయల్టీ రాబట్టలేని, సీమాంధ్ర అర్భక నాయకులు, భద్రాచలం లేదా చుట్టుపక్కల ఖనిజాలమీద కన్నువేసారు అని అనడం, హాస్యాస్పదం.

భద్రాచలంపై వివిధ వ్యక్తుల/సంఘాల స్పందనలు

భద్రాచలం పై కె.సి.ఆర్ (గతంలో)
“1956 నవంబర్1కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం. 1956 నవంబర్1 రెండు రాష్ట్రాల కలయిక ఆంధ్రప్రదేశ్‌. ఇప్పుడు మేమడుగుతున్నది 1956కి ముందు ఉన్న మా రాష్ట్రం. అప్పటి రాష్ట్రంలో ఒక్క ఇంచ్తక్కువైనా ఊరుకోం. ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్కూడా మాకు అక్కరలేదు. గీ భద్రాచలం ముచ్చట నాకు ముందే దెల్సు. మా జయశంకర్గారి ని ఇది వరకే అడిగిన. సార్, ఏంది గీ భద్రాచలం ముచ్చట, దీని కత ఏందీ కార్ఖానా ఏందీ అని. దానికి ఆయన ప్రొపెసరు కదా, యెంటనే చాలా చక్కగా గిట్లన్నడు- 1956 కి ముందు రెండు రాష్ట్రాల కలయిక ఆంధ్రప్రదేశ్‌. గీ రెండూ, గీ తెలంగాణ అప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం. మాగ్గావల్సింది గా ప్రత్యేక రాష్టమ్రే. గదే రాష్ట్రం గట్లనే గావాలే ఇప్పుడు. అంతకు మించి ఒక్క ఇంచ్మాకక్కరలేదు ఆంధ్రోళ్ళ నుండి. మేము కూడా అప్పటి మా రాష్ట్రంలో ఇంచ్కూడా వదులుకోం. ఇక రాష్ట్రంల గీ భద్రాచలం ఉంటద, ఊడుతద- గిదంత మాకు దెల్వద్పి.
కె.సి.ఆర్ (ఇప్పుడు)
“భద్రాచలం తెలంగాణదే”
ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలసి బుధవారంనాడు భద్రాచలం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఈ డివిజన్ ను ఆంధ్రాలోనే విలీనం చేయాలని భద్రాచలం పరిరక్షణ సమితి కన్వీనర్ విజయ్ వర్మ డిమాండ్ చేశారు. భద్రాచలంలో గిరిజన, గిరిజనేతరుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.భద్రాచలం డివిజన్ 1956కు ముందు తూర్పుగోదావరిజిల్లాలో కొనసాగిన  విధంగానే ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేయాలన్నారు. పలువురు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధిని లంబాడీలు తన్నుకుపోయారని ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణలో కలిపే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

తె.వేర్పాటువాదుల దాడి (పై విలేఖరుల సమావేశంలోనే)
        భద్రాచలం ఆంధ్రాలో విలీనం చేయాలని ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశాన్ని స్థానిక తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణకోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తరుణంలో సీమాంధ్రులు ఇలాంటి కవ్వింపుచర్యలు చేపడితే తగిన బుద్ధిచెబుతామన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమనీ,ఈ విషయాన్ని ఆంధ్ర పాలకులు గమనించాలని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా భద్రాచలంలో ఎవరు సమావేశాలు పెట్టినా అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒక దశలో అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలప్రతినిధులను స్టేషన్ కు తరలించారు.

1959లో ఖమ్మం జిల్లాలో కలిసిన భద్రాచలం మాది అంటున్న వారు 1956 లోనే ఆంధ్రప్రదేశ్రాజధానిగా ఏర్పడిన హైదరాబాద్పై మాకు హక్కు లేదని ఎలా అంటారుస్వాతంత్రానికి ముందు చరిత్రను తీసుకొని హైదరాబాద్తెలంగాణాది అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం రెవిన్యూ డివిజన్ను 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారు. కానీ కర్నూలును త్యాగం చేసుకొని 1956లోనే హైదరాబాద్రాజధానిగా ఆంధ్రప్రదేశ్ఏర్పడింది. 56లో ఏర్పడిన హైదరాబాద్పై మాకు హక్కులేదంటే 59లో కలిసిన భద్రాచలంపై మీకు హక్కు ఎక్కడి నుంచి వస్తుంది?. భద్రాచలంపై మీకు నిజంగా హక్కు వచ్చి ఉంటే... కర్నూలును త్యాగం చేసుకొని 56లోనే సమైక్య రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన హైదరాబాద్పై మాకెందుకు హక్కు ఉండదు?. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రాయచూరు జిల్లాలోని అలంపూరుగద్వాల్తాలూకాలు మహబూబ్నగర్జిల్లాలో కలిశాయి. అవన్నీ మీ హక్కు అనుకున్నప్పుడు రాజధానిపై మాకు హక్కు లేదంటే ఎలా ఒప్పుకుంటాం?హైదరాబాద్ను రాజధానిగా చేయడానికే కర్నూలును త్యాగం చేశాం. సమైక్య రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలువిద్యాలయాలు,పరిశ్రమలపై మాకు అన్ని రకాలా హక్కుంది. హైదరాబాద్నదీ జలాల సమస్యకు పరిష్కారం చూపకుండా ఏకపక్షంగా విభజన ప్రకటిస్తే ఒప్పుకొనే ప్రసక్తేలేదు.ఒకప్పుడు ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో ఉండింది కాబట్టి ఇప్పుడు మాకిచ్చేయమని రాష్ట్రం వాళ్లు అడిగితే ఇస్తారా? ''

రాష్ట్ర విభజన తో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దేవుణ్ణి కూడా వదల కుండా,'భద్రాద్రి రాముడు మావాడే'నంటూ తెలంగాణావాదులు చేస్తున్న ప్రకటనలు తెలుగు ప్రజల మనసులను గాయపరుస్తున్నాయి.భద్రాచల రామునికీ,సీతమ్మ తల్లికి ఆభరణాలు చేయించిన రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న రాసిన కీర్తనలు ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృత ప్రాచుర్యం పొందినట్టు రాష్ట్రంలో ఎక్కడా పొందలేదు. ఇందుకు కారణం, ఆంధ్రప్రదేశ్ఏర్పడటానికి ముందు వరకూ భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్బాగంగా ఉండటమే. రెండు ప్రాంతాల ప్రజల మధ్య గోదావరి విడదీయరాని బంధాన్ని ఏర్పరిచింది.రోజమండ్రి నుంచి భద్రాచలం,పాపికొండలు తదితర ప్రదేశాలకు గోదావరిలో లాంచి సర్వీసులు ఇప్పటికీ తిరుగుతున్నాయి. భద్రాద్రితో గోదావరి జిల్లా వాసుల అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది.గోదావరి స్నానంతో పాటు సీతారామచంద్రుల దర్శన భాగ్యం లభిస్తుందన్న ఆశతో ఎంతో మంది వృద్ధులూ, రిటైరైన వారు తమ శేష జీవితాన్ని భద్రాచలంలో గడిపేందుకు ఇష్టపడతారు. అంతేకాక, 'సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్రా !' అంటూ రామదాసు పాడిన కీర్తనను గోదావరి వాసులు రాగయుక్తంగా భక్తిపారవశ్యంతో పాడుకుంటారు. శ్రీరామనవమికి భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరయ్యేవారిలో అధిక సంఖ్యాకులు గోదావరి ప్రాంత వాసులే. తరతరాలుగా రాములవారి కల్యాణానికి భద్రాద్రి వెళ్ళడం ఒక ఆనవాయితీగా పాటిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు. భద్రాద్రిని తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా బ్రిటిష్పాలకులే కొనసాగించినప్పుడు, సాటి తెలుగు వారు అయి ఉండి తెలంగాణావాసులు భద్రాద్రి కోసం పట్టుపట్టడం న్యాయసమ్మతం కాదు. భద్రాచలాన్ని తూర్పు గోదావరి జిల్లా అంతర్భాగంగా కొనసాగించాలి. భద్రాచలం ఆలయం జీర్ణోద్ధరణకూ, పర్ణశాల నిర్మాణానికి సమకూరిన విరాళాల్లో అధిక శాతం ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చాయన్న సంగతి నేటి తరం వారికి తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ఏర్పాటు సమయంలో భద్రాద్రిని తూర్పుగోదావరి జిల్లా నుంచి విడదీయడమే పెద్ద తప్పు. తప్పును సరిదిద్దుకునేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి గోదావరి జిల్లా వాసులు అంగీకరించరు.
--చల్లా శ్రీరామచంద్రమూర్తి, భద్రాచలం

మన్యసీమ
సమైక్యాంధ్రే గిరిజనుల ఆకాంక్ష అని, రాష్ట్రాన్ని విభజిస్తే 'మన్యసీమ' ఏర్పాటుకు మరో విప్లవం చేపడతామని ఎస్టీ సంక్షేమస్థాయి కమిటీ చైర్మన్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం విజయనగరం జిల్లా సాలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'మన్యసీమ'పై చర్చించేందుకు ఆదివారం (నేడు) ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే గిరిజనులకు ఐదో షెడ్యూల్ ద్వారా లభించే ప్రత్యేక రాయితీలకు గండిపడుతుందన్నారు.
గిరిజనుల అస్థిత్వానికి ముప్పు ఏర్పడుతుందని, తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే.. గిరిజనులకు 'మన్యసీమ' ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గోదావరి బెల్ట్, నాగావళి, వంశధార బెల్ట్లో వున్న ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు వున్న గిరిజన ప్రాంతాలతో మన్యసీమ ఇవ్వాలని కోరారు. విషయమై ఆంటోనీ కమిటీకి నివేదికిస్తామన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.


భద్రాచలంపై, పోలవరంపై కొన్ని సందేహాలకి సమాధానం
 1. తెలంగాణ వారి సొమ్ముతో, తెలంగాణవాడైన కంచెర్ల గోపన్న భద్రాచలాన్ని నిర్మించాడు.
 జ. భద్రాచలం రామాలయం నిర్మాణం జరిగిన కాలానికి, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలే కాకుండా,   ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలు, కర్నాటకలోని బళ్లారి, దావణగెరె జిల్లాలూ, గోల్కొండ ఆధీనంలోనే  ఉండేవి. ముఖ్యంగా, 1823 నుండి 1860వఱకూ తప్ప గోదావరి డెల్టా, భద్రాచలం ప్రాంతం రెండూ ఒకరి ఏలుబడిలోనే ఉన్నాయి. వేర్వేరు ఏలుబడులలో ఉన్న ఆ సమయంలోనే, కృష్ణా – గోదావరి డెల్టాలో “డొక్కల కరువు” వచ్చింది.

1860లో నిజాం నవాబు  బ్రిటిషువారు కోరుకున్నందున "బహుమానం"గా ఇచ్చేసాడు. (షరతులు వగైరాలేమీ లేవన్నమాట). అయినప్పటికీ, రామాలయాన్ని తన అధీనంలోనే అట్టేపెట్టుకున్నాడు. 

దాని ఆలనాపాలనా సరిగా చూసేవాళ్లు లేక, పూర్తిగా జీర్ణావస్థకు చేరుకుంటే, 1960లో అంటే సమైక్య రాష్ట్రంలోనే, ప్రజలందరూ ఇచ్చిన విరాళాలతో దాన్ని పునర్నిర్మించారు. రామాలయ జీర్ణోద్ధరణ కమిటీ, అధ్యక్షునిగా రాష్ట్రమంతా, తిరిగి విరాళాలు సేకరించిన కల్లూరి చంద్రమౌళిగారిని "అపర రామదాసు"గా కీర్తిస్తారు. 

వెరసి, చెప్పేదేంటంటే, ఇప్పుడున్నది అలనాటి రామదాసు (గోపన్న) కట్టించినది కాదు.

తె.వేర్పాటువాదులు "నిజమైన నిజాం భక్తులు"అయితే, ఆ నిజామే బహుమానంగా ఇచ్చుకున్నదానిని మళ్లీ అడగకూడదు.  


2. భద్రాచలంతో తెలంగాణకి ఐదు దశాబ్దాల అనుబంధం.
 జ. హైదరాబాదుతో సీమాంధ్రులకి ఐదున్నర దశాబ్దాల అనుబంధం. భద్రాచలంతో మొదటినుండి అనుబంధం ఉన్నది, పాల్వంచ సంస్థానం (తెలంగాణ), వేఁగినాడు (ప.గో.జి), కోనసీమ, రంపనాడు ప్రాంతాలకి. చాలా కుటుంబాలకి భద్రాద్రి రాముడు, ఇలవేల్పు. పాల్వంచ తప్పితే, మిగిలినవన్నీ, ఆంధ్రలోనివే. 

3. రామునికి, పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ హైదరాబాదు పాలకులనుండీ ప్రతీయేటా సమర్పించబడటం, ఆచారంగా ఉంది.
జ. ఆ ఆచారం కొనసాగించుకోండి. ఎవరు వద్దన్నారు?. రోడ్లమీద గోడలు కడతామని, పండుగలకు ఇంటికెళ్ళిన సీమాంధ్రులని మళ్ళీరానివ్వమని తె.వేర్పాటువాదులు రెచ్చగొట్టినట్టుగా, రోడ్లమీద పోతున్న బస్సులమీద రాళ్ళు రువ్వినట్టుగా; ఇప్పుడుగానీ భవిష్యత్తులోగానీ తెలంగాణవారిని భద్రాచలంలో రానివ్వబోమని ఎవరూ అనలేదు. దాడులూ చేయలేదు. (అంతస్థాయిలో మూర్ఖత్వం, గోదావరి ప్రజానీకానికి లేదు.)

4. అన్ని ప్రముఖదేవాలయాలూ సీమాంధ్రలోనే ఉన్నాయి. భద్రాచలమైనా తెలంగాణకివ్వాలి.
జ. బాసర – (ద్వాపరయుగంనుండి ఉన్న సరస్వతీదేవికి ఉన్న రెండు గుళ్ళలో ఇది ఒకటి. రెండోది కాశ్మీరులోని శారదాపీఠం. ప్రస్తుతం మొండిగోడలు తప్ప మరేదీ లేదక్కడ.), యాదగిరిగుట్ట, అలంపురం(శక్తిపీఠం), చిలుకూరు, కాళేశ్వరం, వేములవాడ, ఇలాంటివన్నీ తెలంగాణలో ఉన్నాయి.

5. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం.
జ. భద్రాచలమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో అంతర్భాగమే. తెన్ అంటే దక్షిణం, “ఉఁగలు”అనేది బహువచన సూచకం, “తెనుఁగులు” అంటే దక్షిణాదివారు అని అర్థం. “తెనుఁగు” అనేదే, జనాల నాలుకలమీద “తెలుఁగు” అయింది. తెలుఁగులు పరిపాలించేదే, తెలంగాణ (అలాగే, రాజపుత్రులు పరిపాలించినది రాజపుతానా).
కలిసి ఉంటాం, అన్ని 13 జిల్లాలవారు అంటున్నా, ఒప్పుకోకుండా, అదే జిల్లాలనుండి వచ్చిన ఒక మండలాన్ని మాత్రం మాది అనడం, కచ్చితంగా నియంతృత్వ ధోరణి. 


నడుస్తున్న చరిత్రలో పత్రికలో వచ్చిన తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాల పటం - 
మహాతెలుగునాడు లేదా తెలంగాణ లేదా సమైక్యాంధ్ర, అంటే ఇది.!! 


6. పోలవరం నిర్మిస్తే, గిరిజనులు నిరాశ్రయులౌతారు, వారి జీవనానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
జ. భద్రాచలం ప్రాంతంలోని గిరిజనులు, ఇప్పటికీ పోడు వ్యవసాయాన్నే అనుసరిస్తున్నారు. (అంటే, వలసలు వారి జీవన విధానంలోనే ఒక భాగం). పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత, రామపాదసాగరం ఏర్పడిన తర్వాత, వారికి స్థిర వ్యవసాయం చేయడానికి, స్థిరనివాసం ఏర్పాటుచేసుకోడానికి అవకాశం కలుగుతుంది. తద్వారా, వారి స్థితిగతులు మెరుగుపడతాయి. 

పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై నా సూచనలు
 • పోలవరం నిర్మాణాన్ని కోరుకుంటున్న వాడిగా, ఆ ప్రాజెక్టుకి 60 యేళ్లుగా వచ్చిన, వస్తున్న అడ్డుపుల్లలని దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టు లబ్ది ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఒకే రాష్ట్రంలో ఉండాలని మొదటగా కోరుకుంటున్నాను.
 • నిర్వాసితులకి పునరావాసం కల్పించడానికి, 1/70 చట్టం అమలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు ఉత్తర కోస్తాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత తూ.గో.జి లోని రంప నాడు, పునరావాసానికి మొదటి ఆప్షను.
 • భద్రాచలం – నర్సీపట్నం –విశాఖపట్నం, భద్రాచలం – కొవ్వూరు రైలు లైన్లు నిర్మిస్తే, భద్రాచలం , చుట్టుపక్కలనున్న ప్రాంతాల ప్రజలందరి కష్టాలు తీరతాయి. శాశ్వత అతిధులుగా మన్యంలో తిష్టవేసి ఉన్న మలేరియా, అతిసారం వంటి రోగాలను సాగనంపడానికి ఆధునిక వైద్యులకి అవకాశం దొరుకుతుంది. అలాగే, భద్రాచలం-కిరణడోలు – అరకు, నర్సీపట్నం – పాడేరు – పార్వతీపురం లైన్లు గిరిజన ప్రాంతాల మధ్య రాకపోకలకున్న అడ్డంకులను తగ్గిస్తాయి.
 • పోలవరం ముంపుని లెక్కించి, రాకపోకలకి అంతరాయం కలిగించంత ఎత్తులోకి డివిజన్ లోని రాదార్లనీ, వంతెనలనీ పునర్నిర్మించాలి.
 • కూనవరం వద్ద గోదావరిపైన వంతెన(ల)ను నిర్మించి, కొంత/చింతూరు – అశ్వారావుపేట - జంగారెడ్డిగూడెం మధ్య రహదారిని అభివృద్ధిచేయాలి. వాజేడు వద్ద మరో వంతెన నిర్మించాలి.
 • భద్రాచలం పరిసర ప్రాంతాలలో, భారీ/మధ్య తరహా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి.
   సేకరణలు, లంకెలు 

 1.    Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris
 2.    Imperial Gazetteer of India 
 3.    http://www.namasthetelangaana.com/News/article.aspx?category=1&subCategory=12&ContentId=274813
 4.    http://manabhadradri.blogspot.in/2013/08/blog-post_9.html
 5.    http://www.prabhanews.com/specialstories/article-408488
 6.    http://uttaralu1.blogspot.in/2013/09/blog-post_27.html
 7.    http://www.sakshi.com/news/andhra-pradesh/bhadrachalam-division-should-merge-with-andhra-region-55436 
 8.  http://telugu.teluguvaahini.com/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%80%E0%B0%AE-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0/
 9.   http://yazdani.in/%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D/


20 వ్యాఖ్యలు:

 1. Bhadrachalam with Telangana: 1823-1860: 37 years; 1959-2013: 54 years; total 91 years
  Bhadrachalam with Andhra: 1873-1959: 86 years

  Two questions please:

  1. Today Bhadrachalam division consists of 8 mandals. How many of these were moved to Madras in 1873?
  2. Do you have a mandal wise breakup of Polavaram submergence?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. 1823 -1860: 37 యేళ్లు,
   కానీ, 1959-2013, తప్పు..! 1959 నుండి 1972 వరకూ భద్రాచలానికి ముల్కీ హక్కు ఇవ్వలేదు. ఆ 14 సంవత్సరాలూ ఇటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలోనూ భాగం కానట్టే లెక్క..!

   1823 - 1860 తప్ప, మిగిలిన అన్ని సంవత్సారాలు, భద్రాచలం మండలం, ఉభయగోదావరి జిల్లాలూ ఒకరి ఏలుబడిలోనే ఉన్నాయి. గోల్కొండ, నిజాం నవాబులైనా, బ్రిటీషువారైనా, ఆంధ్ర రాష్ట్రమైనా, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అయినా,

   1)ఇప్పుడు, భద్రాచలంలో ఉన్న 8 మండలాలూ, అఖండగోదావరి జిల్లాలోనేవే

   2)అంత విస్తృతమైన సమాచారం నా వద్ద లేదు. దొరికితే, షేర్ చేస్తాను.

   తొలగించు
  2. "ఆ 14 సంవత్సరాలూ ఇటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలోనూ భాగం కానట్టే లెక్క"

   1860-1823+2013-1972= 78

   పోనీ ఈ నిష్పత్తిలో (78:86) పంచుకుందామా?

   "1823 - 1860 తప్ప"

   1823 - 1873 తప్ప
   పోలవరం ముంపు ప్రాంతంలో అతికొద్ది భాగం మాత్రమె ఒరిస్సా చట్టేస్గడ్ రాష్ట్రాలలో ఉంది. ఎంత కొంతయినా 1956 నాటి ఖమ్మం జిల్లాలో ఉంటె, అది తెలంగాణాలో (56 సరిహద్దుల ప్రాతిపదికపై) ఉంటుంది కాబట్టి పోలవరానికి మూడు రాష్ట్రాల ఇబ్బంది అలాగే ఉంటుంది.

   తొలగించు
  3. "ఈ రెండు ప్రాజెక్టులకి, ఆపుచేసినా, కనీసం అడ్డంకులు ఏర్పాటుచేసినా, మళ్ళీ “డొక్కల కరువు” నాటి పరిస్థితులు కృష్ణా-గోదావరి డెల్టాలకి, ఎడారిగా మారే పరిస్థితులు రాయలసీమకి ఎదురవుతాయి"

   ఇన్నేళ్ళు కృష్ణా గోదావరి డెల్టాల పుణ్యమా అంటూ కరువు రాలేదు. సాగు భూమి/జిల్లా విస్తీర్ణం నిష్పత్తిలో చూస్తె రాష్ట్రంలో మొదటి అయిదింట నాలుగు స్తానాలు ఉన్న ఈ నాలుగు జిల్లాలో కరువు వచ్చే అవకాశమే లేదు.

   తొలగించు
  4. "భద్రాచలం పరిసర ప్రాంతాలలో, భారీ/మధ్య తరహా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి"

   బయ్యారం మండలంలో ఎందుకు వద్దండీ? ఇనుము ఖనిజం లేకున్నా రెండు ఉక్కు కర్మాగారాలు మీకే కావాలా?

   తొలగించు
  5. //సాగు భూమి/జిల్లా విస్తీర్ణం నిష్పత్తిలో చూస్తె రాష్ట్రంలో మొదటి అయిదింట నాలుగు స్తానాలు ఉన్న ఈ నాలుగు జిల్లాలో కరువు వచ్చే అవకాశమే లేదు.//
   లెక్కల గుఱించి, సరిగా తెలీదు గానీ, ఆ జిల్లాల్లో తూ.గో.జి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. తూర్పు గోదావరిలో 34% వరకూ అడవులు ఉన్నాయి. ఖమ్మం జిల్లా(44%), ఆదిలాబాద్ (37%) తర్వాతి స్థానం తూ.గో.జి దే.!

   కొంచెం వివరంగా చెప్పగలరు.

   కరువు వచ్చే అవకాశం లేదని మీరెలా చెప్పగలరు.?
   గత 20 యేళ్ళుగా డెల్టా ఆధునికీకరణ చేయడం మానేసి, మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరదలొస్తే, పంటలన్నీ బురదలోకి పోతాయి. నీళ్ళు ఆపుజేస్తే ఎండిపోతాయి.

   రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఎగువనున్న తెలంగాణ, ఇప్పుడు సొంతంగా తెచ్చుకున్న విద్వేషాలతో నీళ్లు ఆపుజేస్తే, ఎక్కడినుండి నీళ్లు తెచ్చుకోవాలి.? సముద్రం నుండా.?

   ప్రాజెక్టులు వస్తాయని ముందు కాలువలు తవ్వేశారు. ఆ ప్రాజెక్టులు వస్తాయో లేదో తెలీదుగానీ, ముందు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో భూగర్భజలాలు పడిపోయాయి. ఇది మెట్ట ప్రాంతం పరిస్థితి.

   డెల్టా ప్రాంతంలో నీటి ప్రవాహం ఆగిపోతే, సముద్రం నీరు డెల్టా ఒండ్రుమట్టిలోకి చేరిపోయి, ఇంక ఎందుకూ పనికిరావు (గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్, దగ్గర ఉన్న ఉప్పు నీటి నేలలు, సరస్వతీ నది ఇంకిపోయిన తర్వాత అలా ఏర్పడినవే). అదే జరిగితే, కృష్ణా - గోదావరి డెల్టా మూకుమ్మడిగా వలసపోవాల్సి వస్తుంది.

   సాధారణంగా దిగువరాష్ట్రాలకి మిగులు జలాల్ని కేటాయిస్తారు. కానీ, కృష్ణ విషయంలో వాటిని కూడా పంచేసారు. రేపు గోదావరి కూడా అలా చేస్తే, ఎప్పటిలాగే, ఎవరి నీళ్ళు రావచ్చు. కానీ, ఎగువన నిండేదాక దిగువరాష్ట్రానికి నీళ్లు వదలకపోతే, పంటలేసుకోడానికి భూములే పనికిరాకుండా పోతాయి.

   //బయ్యారం మండలంలో ఎందుకు వద్దండీ? ఇనుము ఖనిజం లేకున్నా రెండు ఉక్కు కర్మాగారాలు మీకే కావాలా?//
   బయ్యారంలో వైజాగ్ స్టీల్ ని రానివ్వకుండా అడ్డం పడింది, తెరాసే కద..!! అవతల, సొంత గనులు లేక, ఉత్పాదక వ్యయం ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతున్న ప్లాంట్ కి గనులు కేటాయిస్తూ, ప్రతిగా కర్మాగారాన్ని పెట్టాలని కుదుర్చుకున్న ఒప్పందానికి అడ్డంపడినవారిని అడగండి.

   ఛత్తీస్ గఢ్ లోని కిరణడోలు వద్ద, ఇనుప ఖనిజం విస్తారంగా దొరుకుతుంది. కర్మాగారం కట్టుకోడానికి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కానీ, ఎన్.ఎం.డీ.సీ (హైదరాబాదులోనిదే), వెలికితీస్తున్న ఇనుప ఖనిజాన్ని, జపాన్ కి విక్రయిస్తున్నారు. కిరణడోలు నుండి విశాఖపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల ద్వారా లెక్కకుమిక్కిలిగా ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. కిరణడోల్ - కొత్తవలస రైలు లైను, రైల్వే శాఖకి దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్నది. ఈ లైను పేల్చివేస్తామని మావోయిస్టులు బెదిరించేది కూడా అందుకే.!

   బొగ్గు నిక్షేపాలు, ఇనుప ఖనిజం, పక్కనే గోదావరి, ఇంతకంటే వేరే ఏం కావాలి, ఉక్కు కర్మాగారానికి.?

   కేవలం భద్రాచలం - కిరణడోలు, భద్రాచలం - విశాఖపట్నం లైను వేస్తే, సరిపోతుంది. అవి లేకనే, గోదావరికి ఎడమవైపునున్న ఖమ్మం జిల్లాలో పరిశ్రమలే కరువయ్యాయి. ఉన్న కొద్ది పరిశ్రమలూ సారపాక, కొత్తగూడెం, మణుగూరులలో ఏర్పాటుచేసారు. అవన్నీ గోదావరికి కుడివైపునున్నవే.

   తొలగించు
  6. "ఆ జిల్లాల్లో తూ.గో.జి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు"

   తూగో జిల్లా వివరాలు: విస్తీర్ణం: 10,807 చ.కి.మీ; 2008-09 నీటి సంవత్సరం నికర సాగు: 503.128 హెక్టేర్లు (నాలుగో స్థానం); నిష్పత్తి: 46.6 % (నాలుగో స్థానం)

   "గత 20 యేళ్ళుగా డెల్టా ఆధునికీకరణ చేయడం మానేసి, మీనమేషాలు లెక్కిస్తున్నారు"

   అంటే ఆధునీకరణ చేస్తే కొత్త ప్రాజెక్టు అవసరం లేనట్టే కదా? పోలవరం ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ వ్యయంతో సరిపోతుంది

   "నీళ్లు ఆపుజేస్తే, ఎక్కడినుండి నీళ్లు తెచ్చుకోవాలి"
   నదీజలాల పంపకానికి ఒప్పందాలు & ట్రిబ్యూనల్ తీర్పులు ఉంటాయి. వాటిని అతిక్రమిస్తే న్యాయస్తానాలు ఉన్నాయి.

   "సాధారణంగా దిగువరాష్ట్రాలకి మిగులు జలాల్ని కేటాయిస్తారు"
   ఇది కేవలం మొదటి కృష్ణా ట్రిబ్యూనల్ ముందటి కొన్ని ప్రత్యెక కారణాల వల్ల జరిగింది. అందునా ఆ మిగులు నీళ్ళ మీద హక్కులు ఏర్పడవని స్పష్టంగా చెప్పారు. అంతేతప్ప మిగులు జలాలు కిందివారికి కేటాయించాలనే సంప్రదాయం ఎక్కడా లేదు.

   ."రేపు గోదావరి కూడా అలా చేస్తే, ఎప్పటిలాగే, ఎవరి నీళ్ళు రావచ్చు"
   గోదావరి జలాల పంపకాలకు ఆధారం ఒప్పందాలు. ఈ ఒప్పందాలన్నీ "మీకు ఇన్ని నీళ్ళు, మాకు మిగితాది" అనే తరహాలో ఉన్నాయి. కాబట్టి అపోహలకు తావు లేదు.

   తొలగించు
  7. //అంటే ఆధునీకరణ చేస్తే కొత్త ప్రాజెక్టు అవసరం లేనట్టే కదా? //
   మీకలా అర్థమైందా.?
   ఆధునికీకరణ, వరదల, కాలువల నిర్వహణకి సంబంధించినది. వృధాగా పోతున్న నీళ్లను వాడుకోగలిగే శాతం చాలా తక్కువ, కొత్త ప్రాజెక్టుతో పోలిస్తే.

   //వాటిని అతిక్రమిస్తే న్యాయస్తానాలు ఉన్నాయి.//
   ఉన్నాయి. ఆలమట్టి విషయంలో కర్నాటక కోర్టు తీర్పుని లెక్కజేసిందా.? ఇప్పటికీ, కర్నాటక దయాదాక్షిణ్యాల మీదనే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా బేసిన్, ఉంది.
   ఆంధ్ర - తెలంగాణల మధ్య ఇంతకంటే మంచి వాతావరణాన్ని నేను ఊహించడం లేదు, ప్రస్తుతం ఉన్న వాతావరణం దృష్ట్యా.

   // కాబట్టి అపోహలకు తావు లేదు.//
   ఎందుకు లేదు సార్..? భేషుగ్గా ఉంది. "మా నీళ్లు మాకే", "నదుల్లో గోడలు కడతాం" లాంటి మాటలు, సౌభ్రాతృత్వాన్ని ఇంకొంచెం పెంపొందిస్తాయి కూడా..

   తొలగించు
 2. ప్రాణహిత-చేవెళ్ళ ఎలా లాభసాటికాదో విస్పష్టంగా వివరించినా చెవికెక్కించుకోరు కానీ భద్రాచలమ్మీద, జనమ్మీదా విపరీతమైన ప్రేమ కురిపించేస్తారు. ఇక్కడ భద్రాచలమ్మీద ప్రేమకన్నా పోలవరం ఎక్కడ పూర్తవుతుందో అన్న చింతే ఎక్కువ తె,వాదులకు (తెలబాన్లకు మరీ ఎక్కువ). పోలవరంవరకూ తీసుకుంటే అది ఎప్పటికైనా పూర్తయ్యే ప్రాజెక్టే. కేంద్రం తన నదుల అనుసంధానం కార్యక్రమంలో ప్రధానంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇదే! కేవలం ఆంధ్రానే కాకుండా కర్నాటక, తమిళనాడు కూడా లబ్ధిపొందుతాయి ఈ ప్రాజెక్టువల్ల.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గతంలో, మీ బ్లాగులో, “పోలవరం”, “ప్రాణహిత –చేవెళ్ల” ప్రాజెక్టుపై వచ్చిన చర్చని చూశాను. చాలా కొత్త విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.

   ప్రాణహిత – చేవెళ్ల మీద నాకే వ్యతిరేకత లేదుగానీ, చూడబోతే దానికంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు అత్యుత్తమమని అనిపించింది. ఆంధ్ర ప్రాంతానికై పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఉందో, తెలంగాణకై ఇచ్చంపల్లికి అంతే ప్రాధాన్యత ఉందని అనిపిస్తోంది. అంతర్రాష్ట్ర జలవివాదాలు ఉన్న కారణంగా, దాన్ని చేపట్టలేక, ప్రత్యామ్నాయాలను చూస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

   తెలంగాణ ఏర్పడి, విదర్భ ఏర్పడకపోతే, మహారాష్ట్రనుండి చంద్రపూరు, గడ్చిరోలి జిల్లాలు తెలంగాణలో కలుస్తామని అంటున్నారు. అప్పుడు “ఇచ్చంపల్లి”కి అడ్డంకులు తక్కువే. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాలు కూడా కలిస్తే, అసలే గొడవా ఉండదు. తెరాస వారు, నిజంగా తెలంగాణ అభివృద్ధికే కట్టుబడి ఉంటే, పోలవరానికి అడ్డం పడటం మాని, ఇచ్చంపల్లి కోసం నిర్మాణాత్మక కృషి, సూచనలు చేసి ఉండేవారు. కానీ నా ఉద్దేశ్యంలో కూడా, తె.వేర్పాటువాదులకి ఆంధ్రాద్వేషమే ఎక్కువ. అందుకే కూర మాడిపోయినా, కుక్క చచ్చిపోయినా ఆంధ్రోడిదే తప్పు, అని దుమ్మెత్తిపోశారు, పార్టీ పుట్టినప్పట్నుండి, ఇప్పటి వరకూ.

   దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అయిన ఇచ్చంపల్లి కూడా, పోలవరంలాగే “గంగా-కావేరి నదుల అనుసంధానం“ ప్రాజెక్టులో ఒక భాగం. పోలవరం ఎలాగైనా పూర్తవుతుందని తెలుసు. కానీ ఎప్పటికి అనేది.? ఇప్పటికే వచ్చిన వివాదాలేంటి.? పూర్తయిన తర్వాత వచ్చే వివాదాలేంటి.? ఇలాంటివాటన్నిటి మీదనే ఆంధ్రా ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంది.

   పోతే, పోలవరానికి కూడా ప్రత్యామ్నాయాలు సూచించడం విన్నాను, సి.పీ.ఎం మంత్రుల బృందానికి కూడా విన్నవించింది. ఆ ప్రత్యామ్నాయాన్ని బ్లాగర్లలో కూడా కొంతమంది సమర్థించినట్టు, గుర్తు (మీరు కూడానా.?).

   అందులో భాగంగా, గోదావరి డెల్టాలో మూడు పాయలమీదా మూడు చిన్న బారేజీలు, ఎత్తిపోతల పథకాలు సూచించారనుకుంటా. అదెలా సాధ్యమో, నా బుర్రకి అర్థం కావట్లేదు. డెల్టా మట్టి, మీద సాధారణ రాకపోకలకోసం వంతెన కట్టడానికే, ఆలోచించీ, ఆలోచించీ, ఇప్పటిదాకా చాలా ప్రతిపాదనలని పక్కనబెట్టారు. అలాంటిచోట్ల, నేల బ్యారేజిని ఎలా తట్టుకుంటుందనో మరి. ఏ ఇంజనీరైనా, కొండప్రాంతాలు, రాతినేలలలోనే, డ్యాములు కట్టమని సిఫారసు చేస్తాడు. ధవళేశ్వరమైనా, విజయవాడైనా, నాగార్జున సాగర్, శ్రీశైలం అన్నీ అలాంటి చోట్ల ఉన్నవే. పోలవరం కూడా అంతే. కేవలం గిరిజన ప్రాంతాల ముంపు లాంటి కారణాలకోసం, ప్రత్యామ్నాయాల కింద ఇలాంటి సూచనలు ఇవ్వడం, ప్రాజెక్టులకి అడ్డంపడటం కిందనే లెక్క.!

   అదలా ఉంచితే, పోలవరం వల్ల తమిళనాడుకొచ్చే లాభం ఏముందండి? వివరించగలరా.?

   తొలగించు
  2. వివాదాలకు దేశంలో కొదవేముంది?! ఏ విషయాన్నెలా వివాదాస్పదం చెయ్యొచ్చో తెలిసిన మేధావులున్న దేశం మనది!!

   పోలవరం ప్రత్యామ్నాయాల విషయానికొస్తే అవి కేవలం ముంపుప్రాంతాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారుచేసినవి. సరిగ్గా చెప్పాలంటే రోగిష్టోడికి జావ పెట్టినట్టు.

   పోలవరంవల్ల గోదావరి-కృష్ణా-పెన్నా-పాలారు నదుల అనుసంధానం పాక్షికంగా పూర్తయ్యినట్టవుతుంది. గోదావరినీళ్ళు కృష్ణకు మళ్ళించటంద్వారా వచ్చేనీటి మిగులును కర్నాటకలోని తుంగభధ్ర పరిధిలోనూ, రాయలసీమలోనూ, ఉత్తర తమిళనాడులో పాలారు పరిధిలోనూ వాడుకోవటానికి అవకాశం ఉంటుంది.

   తొలగించు
  3. //ఏ విషయాన్నెలా వివాదాస్పదం చెయ్యొచ్చో తెలిసిన మేధావులున్న దేశం మనది!!//
   చాలా కరెక్టుగా చెప్పారు. నిజానికి మన దేశంలో, మేధావితనాన్ని ప్రదర్శించడానికున్న ఏకైక మార్గం అదే.!! (వారి దృష్టిలో.)

   కామెంటినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  4. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నేను అధ్యయనం చేయలేదు.

   ఇచ్చంపల్లి వస్తుందని నాకు నమ్మకం లేదు. దీనికి అవరోధం వివాదాలు కాదు, పర్యావరణ అనుమతులు.

   నదుల అనుసంధానం అనేది "కల"గానే మిగులుతుందని అనుకుంటున్నాను.

   తొలగించు
  5. నదుల అనుసంధానానికి తె.వేర్పాటువాదులు అడ్డుపడకపోతే, "కల"గా మిగలదు లెండి.

   కామెంటినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  6. జై గారూ, ఇక్కడ నమ్మకాల గుఱించిన చర్చ కాదులెండి, దానిక్కావలిసినంత జాగా ఉండనే ఉంది. అక్కడ చర్చించవచ్చు. నేను మాట్లాడుతున్నది పూర్తిగా సాధ్యాసాధ్యాలగుఱించీ, లాభసాటి వ్యవహారాలగుఱించీనూ. వాటిగుఱించి మీకేదన్నా తెలిస్తే చెప్పండి. అలాగే మీరేదో సాగునీటి వ్యవహారాలగుఱించి అధ్యయనం చేశానన్నారు ఇక్కడా లంకేదన్నా ఇస్తే నోట్ చేసి పెట్టుకుంటాను. ఈ బ్లాగాయన ఏమీ అనుకోరులెండి.

   ప్రాణహిత-చేవెళ్ళ నడపటానికే ఏడాదికి రమారమి 3500 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ లెక్క నేను చెబుతున్నది కాదు, తె.వాదులు చెబుతున్నదే! ఆ లెక్కన తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? సాధారణ, పారిశ్రామిక వినియోగం ఎంత? అది పోను ఈ ప్రాజెక్టుకి ఎంత కేటాయించాలి? ఈ ప్రాజెక్టు కింద సేద్యం చేయబోయే రైతులు నీటి, విద్యుత్ తీరువాలు ఎంతెంత కట్టాల్సొస్తుంది? వీటికి సమాధానాలు మీకీపాటికే వెలిగుండాలి. వెలిగినా కుదరదుపొమ్మంటే తెలంగాణ కష్టాలకు నా సానుభూతి! :)

   మరో ముచ్చట ఏంటంటే ఈ ప్రాజెక్టు విద్యుదుత్పత్తి సామర్థ్యం అక్షరాలా సున్నా మెగావాట్లు! (పోలవరం ప్రస్తుత డిజైను ప్రకారమే అయితే 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్త్యం కలిగి ఉంటుంది, ఆ ప్రాజెక్టు నడపటానిక్కావలసిన విద్యుత్ అక్షరాలా నామమాత్రం!)

   తొలగించు
  7. అచంగగారు.

   మీరడిగిన దానికి జైగారు స్పందించడం లేదు.
   మరి, చూసారో లేదో.

   తొలగించు
 3. మొత్తానికి భద్రాద్రి రామన్న కూడా ఆంధ్రోళ్ళకి పొరుగు రాష్ట్రం వాడ్ని చేశేసారన్న మాట. తెలివంటే కచరాదే. ఒప్పుకోవాల్సిందే. వడ్డించే వాడు మన వాడయితే యెన్నయినా అదుగుతారు. డిల్లీ కాంగ్రెసోళ్ళని ఆంధేరా కాంగ్రెసోళ్ళ(తెకావా ల తో సహా) కన్నా యెక్కువగా బుట్టలో వేశేసాడు, యే మందు తాగించాడో గానీ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఏం చేస్తామండి.?
   అంతా మన తెలుగువాళ్ల ఖర్మ..

   ధన్యవాదాలు.

   తొలగించు