28, మే 2012, సోమవారం

రామాయణంలో మగవారిపైన వివక్ష


ఇది మొదలెట్టింది, కొందరు “కుహానా” స్త్రీవాదులు, “రామాయణం పురుషాధిపత్యానికి చిహ్నం”అని చేసే వెర్రి మొర్రి వాదనలకి రిటార్డుగా. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రక్కదోవ పడితే, తెలియజేయాల్సిందిగా మనవి.
రామాయణం, పురుషాహంకారానికి చిహ్నం అంటారు, కుహానా స్త్రీవాదులు. రామాయణం పెట్టుబడిదారీ వ్యవస్థకి చిహ్నం అంటారు, కుహానా కమ్యూనిస్టులు. రామాయణం లేనే లేదు, అదంతా వట్టి కల్పన అని పదే పదే వల్లె వేస్తూ ఉంటారు, కుహానా హేతువాదులు. రామాయణం ద్రవిడులపై ఆర్యుల అరాచకాలకి ప్రతీక, రావణుడు ద్రవిడుడు, దళితుడు అంటారు, కుహానా దళితవాదులు. రామాయణంలోని రక్కసులే ఆంధ్రోళ్లుగా పుట్టరంటాడు ఓ కుహానా తెలంగాణవాది. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతీ ఉద్యమానికీ తేరగా దొరికింది రామాయణమేనని, అనిపించక మానదు. అసలు ఈ కుహానావాదులు, వారి వాదాల గురించి ఒక టపాని సిద్ధం చేస్తున్నాను. వీళ్లెవరు..? వీళ్ల లక్ష్యాలేమిటి..? లాంటివి అక్కడ మాట్లాడుకుందాం..! ముందే చెప్పుకున్నట్టు, కుహానా స్త్రీవాదులే ఇక్కడ నా టార్గెట్. 

“సీత”ని అగ్నిప్రవేశం చేయమన్నాడనీ, ఎవడో తాగుబోతు పౌరుడు వాగితే, మళ్ళీ వదిలేసాడనీ, ఇది పక్కా మగ దురహంకారమనీ, హుంకరిస్తుంటారు కదా. ఇక్కడ నేను రాస్తున్న “మగవారిమీద వివక్ష”లని చదవండి, ఈ సమాజం మగవారిపైన ఎంత వివక్ష చూపుతోందో అర్థమౌతుంది. ఇలాంటి వాటిని, తెలుగువారం “రామాయణంలో పిడకలవేట” అంటున్నాం. ఇక్కడ జరిగే పిడకల వేట “మగవారిమీద వివక్ష” పిడకలకోసం అన్నమాట.

మొదటి పిడక: పరాయి ఆడదాని వెంటపడినందుకు రావణుడు, సర్వనాశనమైపోయాడు. చివరికి చచ్చాడు కూడా. మరి పరాయి మగాడి వెంట పడినందుకు శూర్పణఖని ఎందుకు చంపలేదు.? ముక్కు, చెవులు కోసేసాడు లక్ష్మణుడు, అంతే..! రావణుని పిల్లలూ చచ్చారు, శూర్పణఖ పిల్లలూ చచ్చారు. అంతవరకూ వివక్షలేదు. ఆ తర్వాత, రావణుడు చచ్చాడు, కానీ శూర్పణఖ చావలేదు. ఒకే తప్పుకి ఆడదానికొక శిక్ష, మగవాడికొక శిక్ష. నోట్ దిస్ పాయింట్ యువరానర్..!

రెండవ పిడక: సీతాపహరణం తర్వాత, రాముడు సీతకోసం గాలించాడు, సుగ్రీవుడితో చెలిమికోసం వాలిని చంపాడు, వానరులనందరినీ సీతాన్వేషణకోసం పంపుతూ, ఉత్తగా వచ్చినవారికి ప్రాణభయం కలిగించాడు (ఆ పని చేసింది సుగ్రీవుడు లెండి), హనుమంతుడి చేత సముద్రం దూకించి లైఫ్ రిస్క్ తీసుకునేలా చేసాడు, ఆ తర్వాత కడలికి వంతెన కట్టి, రాక్షసులతో పోరాడు. ఇలా నానా కష్టాలూ పడితే, సీత ఏం చేసింది అని నేను అడుగుతున్నాను. నగలు దాచమని హనుమంతుడికి ఇవ్వడం తప్ప. అదీ గాల్లోంచి విసిరేసింది..! ఇది వివక్ష కాదా..? పోనీ రావణుడు బంధించేసాడు కాబట్టి, ఏమీ చేయలేకపోయింది అనుకుందాం. హనుమంతుడు రాముని దగ్గరకి చేరుస్తానన్నప్పుడైనా, వచ్చి ఉండొచ్చుగా.. ఊహూఁ..! నా స్వామే వచ్చి నన్ను విడిపించాలి అని ఇంకో రెండు పద్యాలూ, శ్లోకాలూ పాడింది. హనుమంతుడు చెప్పినట్టు చేసి ఉంటే, ఎంతోమందికి చావుతప్పి ఉండేది. ముఖ్యంగా, అన్నెం పున్నెం ఎరుగని కుంభకర్ణుడు లాంటి వాళ్లు, ఏ తప్పూ చేయకపోయినా చచ్చారు. పైగా, అతగాడు జయవిజయుల్లో ఒకడని దానికి జస్టిఫికేషనూ..!

మూడవ పిడక: అదలా ఉంచితే, జనామోదం పొందిన రాముణ్ణి  యువరాజు కానివ్వకుండా అడ్డుపడింది కైకేయి. అదీ మొగుణ్ణి బాధపెట్టి మరీనూ. కాదంటే “ఆడినమాట తప్పినవాడివి అవుతావ”ని బెదిరింపులు. ఇది గృహహింస కాదా..? అని అడుగుతున్నాను. ఆ బాధ భరించలేక, పాపం దశరధుడూ పోయాడు. దానికి జస్టిఫికేషను కోసం ఇంకో కథ.! అంతే తప్ప కైకేయిని, కన్నకొడుకు భరతుడు తప్ప ఇంకెవ్వరూ శిక్షించిన దాఖలా కనబడదు, అదీ మొహం చూడనంటాడు అంతే..! మరి భరతుడో., ఆవిడకి పుట్టినందుకు తనకు పితృతర్పణాలు పెట్టే అర్హత లేదని తండ్రి దగ్గర్నుండి శాపాన్ని పొందాడు. అంటే ఓ ఆడదాని వల్ల ఒక మగాడు పోయాడు, ఇంకో మగాడు జీవితాంతం బాధపడ్డాడు. దీనికి శిక్షలు లేవు. ఇది వివక్ష కాదా..? నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువరానర్..!

నాలుగవ పిడక: “తాటక” అనే రాక్షస స్త్రీని చంపాడు రాముడు. దశరధుడితో బాటు యుద్ధానిక్కూడా వెళ్ళి ఎంతోమంది రాక్షసులని చంపింది కైకేయి. మరి “ఆడదాన్ని చంపినవాడ”ని రాముణ్ణి వెక్కిరించినట్టుగా, “మగాణ్ణి చంపినద”ని కైకేయిని ఎవరూ వెక్కిరించలేదే..? రాముణ్ణి చివరికి కన్నకొడుకులు కూడా వెక్కిరించారు. ఇక్కడ పాయింట్ “వెక్కిరింపు”కాదు, ఆ వెక్కిరింపుకి గల కారణం యువరానర్..! యుద్ధంలో, ఆడది మగాణ్ణి చంపితే సమాజం ఒప్పుకుంటుంది. అదే యుద్ధంలో, మగాడు ఆడదాన్ని చంపితే ఒప్పుకోదు. ఇదెక్కడి అన్యాయం..?

ఐదవ పిడక: బంగారు లేడిని తెమ్మనగానే, పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయిన రాముడికి, ఏ అపాయమూ రాదనీ, ఆయన మహావీరుడనీ, కంగారు పడవద్దని తల్లిలాంటి వదినకి నచ్చజెప్పబోయిన లక్ష్మణుణ్ణి సూటిపోటి మాటలతో బాధపెట్టింది సీతమ్మ. ఎంత బాధపడ్డాడో పాపం లక్ష్మణుడు, చివరికి అన్నగారిమాటని కూడా కాదని పాక( పర్ణశాల అంటె ఘనంగా ఉంటుందేమో..!)ని విడిచివెళ్లాడు. ఇక్కడ రెండు పాయింట్లున్నాయి యువరానర్..! ఒకటి లక్ష్మణుడికి జరిగిన గృహహింస. రెండోది, తను గీసిన గీతని దాటొద్దని లక్ష్మణుడు చెప్పినా, వినకుండా “నీ లెక్కేమిటిలే నాకు..?” అని దాటిన సీత దురవగాహన. ఇక్కడ సరైన పదం చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు.

ఆరవ పిడక: సీతని రావణుడు ఎత్తుకుపోతూంటే, పోరాడి నేలకొరిగినవాడు జటాయువు. ఎంగిలి పళ్ళని నివేదించి, సుగ్రీవుణ్ణి కలవమని సలహా ఇచ్చింది, శబరి. వీరిలో ఎవరికి ఎక్కువ విలువనివ్వాలి..? ఏమో మరి..! రాముణ్ణి చూసే నేర్చుకోవాలంటారు, కనుక ఆడవాళ్లకే ఎక్కువ విలువనివ్వమంటారా..? చట్టం ఒప్పుకోదు. శబరిని నది అయి, అందరికీ ఇలాగే సేదదీర్చమని అన్నాడు రాముడు. మరి జటాయువో, ఈయన దశరధుని మిత్రుడుకూడానూ..! దహన సంస్కారాలు చేసాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతున్నాను యువరానర్. ఆడదానికొక రీతి, మగవాడికి అందునా ఒక పక్షికి ఇంకో రీతి అన్నమాట..! ఎక్కడ “పెటా”వాళ్ళు..? వీధికుక్కల్ని, ఊరపందుల్నీ కాపాడింది చాలు.! జటాయువుకి న్యాయం జరగాలని పోట్లాడండి..! పొండి..!

ఏడవ పిడక: రామాయణంలోని మనుషులకే కాదు, రాసినవాళ్లకి కూడా గృహహింస తప్పలేదు. కుటుంబం కడుపు నింపడానికి వేటనే నమ్ముకొని, వేటాడిన జంతువుల్నీ, మనుషులనీ చంపిన పాపంలో పాలు పంచుకుంటుంది తన ఆలి, అనీ ఆశించిన బోయవాణ్ణి, మోసం చేసింది అతని పెళ్లాం. పాపం మొగుడిది మాత్రమేనని, పాపం చేసి సంపాదించిన తిండి మాత్రం ఇద్దరిదీనని, ఆవిడ పెనుగువ(వాదన)లాడినందువల్లనే ఆ బోయవాడు, సంసారాన్ని వదిలేసి పోయాడు. (ఇప్పటి చట్టాలద్వారా జరుగుతున్నదీ అదే కదా..! అయితే, ప్రతీ అభాగ్యుడూ ఋషి అవ్వలేడు..) చివరికి మనకా విషయం చెప్పి ఆడవాళ్లు అప్పుడూ, ఇప్పుడూ ఒకటేనని నిరూపించాడు వాల్మీకి. మగవాళ్లపైన ఇంత వివక్షా..? దీన్ని తెగనాడుతున్నాను యువరానర్..!

హమ్మయ్య..! విజయవంతంగా ఐదారు పిడకల్ని సంపాదించాను. వీటితో చేసిన “పిడకల దండ”ని కుహానా స్త్రీవాదులకు బహూకరిస్తున్నాను. ఈ పిడకలు సరిపోవు అంటారా..? ఏం చేస్తాం..? నాకు “గొల్లపూడివారి బాలల బొమ్మల రామాయణం”, చందమామలలో చదివినవాటిలోనూ, సినిమాల్లో చూసినవాటిలోనూ గుర్తుండి, వేటాడగలిగిన పిడకలు ఇవే మరి..! అసలు వాల్మీకి రామాయణం పూర్తిగా చదివితే, ఇంకొన్ని “మగవారిమీద వివక్ష” పిడకలు దొరకచ్చు. ప్రస్తుతానికి ఇవే పిడకలు.. సర్దుకుపొండి..!


లేదా ఇంకొందరు వేటాడగలిగిన “కొత్త” పిడకలకోసం ఎదురు చూడండి..!

32 కామెంట్‌లు:

  1. రామాయణం ఒక పుక్కిటి పురాణం. దానిలో వివక్షలు వెతుక్కొని "మగ మహారాజులు" సంతోషించినా ఒరిగేది ఏముంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు, మీకో విషయం తెలుసా? రామాయణ విషవృక్షం పుస్తకం చదవడానికి ముందు కూడా నేను నాస్తికుణ్ణే. అది చదివి నేను కొత్తగా నాస్తికునిగా మారినది ఏమీ లేదు. 'నాకు కలలో రాముడు కనిపించాడు‌' అని చెపితే నమ్ముతారు కానీ 'నిజ జీవితంలో రాముడు కనిపించాడు‌' అని చెపితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే పురాణం అనేది ఒక నమ్మకం మాత్రమే, అది చరిత్ర ఎన్నటికీ కాదు.

      కేవలం నమ్మకాలని విమర్శిస్తే ఏమీ రాదు కాబట్టే రామాయణ విషవృక్షం పుస్తకం నేను చదివినా కూడా నేను నమ్మకాలని విమర్శిస్తూ కూర్చోవడం లేదు.

      తొలగించండి
    2. హై హై నాయకా29 మే, 2012 5:32 PMకి

      నువ్వు నమ్మకాలని విమర్శించవా? సొల్లు కబుర్లు చెప్పకు ప్రవీణ్. పెట్టుబడిదారీ వ్యవస్థ మంచిదని నా నమ్మకం. దాన్ని నువ్వు విమర్శించవా? సమైక్యవాదం మంచిదని నా అభిప్రాయం. దాన్ని నువ్వు విమర్శించవా? మరీ మార్క్స్ లా జరగని విషయాల గురించి మాట్లాడకు.

      తొలగించండి
    3. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఒక నమ్మకం కాదు. అది కొందరికి భౌతిక అవసరం. ఆ వ్యవస్థ ఉన్నంత వరకు కొంత మంది శ్రమ లేకుండా కేవలం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో డబ్బులు పెట్టి లాభాలు తీసుకోవచ్చు. సమైక్యవాదం కూడా కొందరికి భౌతిక అవసరమే. విదేశీ పెట్టుబడిదారులు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి సౌకర్యాలు ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలలోనే పెట్టుబడులు పెడతారు కానీ ఏ విజయవాడలోనో, కాకినాడలోనో పెట్టరు. రాష్ట్రం విభజితమైతే హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయి విదేశీ పెట్టుబడిదారులకి నష్టమే, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు చేస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకి కూడా నష్టమే. ఇవన్నీ కొందరి భౌతిక అవసరాలే కానీ నమ్మకాలు కావు కదా.

      తొలగించండి
  2. పురాణేతిహాసాలను అపార్ధం చేసుకోవటం వల్ల , మీరన్నట్లు సమాజంలో రకరకాల వాదనలు రావటం నిజమేనండి. మీ ఆవేదనను అందరూ అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే,

    1......రావణుడు ..... సీతాదేవిని అపహరించాడు. శూర్పణఖ ...రామలక్ష్మణులను అపహరించలేదు. రావణుడు శూర్పణఖ చేసింది ఒకేరకమైన తప్పు కాదండి. వారు చేసిన తప్పుల్లో కొద్దిగా తేడా ఉంది. అందుకే వారికి పడ్డ శిక్షల్లో కూడా కొద్దిగా తేడా ఉంది. దైవం చాలా చక్కగా ఆలోచించి ఎవరి తప్పొప్పులకు తగ్గ శిక్షలను వారికి విధిస్తారు. భగవంతుని తీర్పులో మనం సందేహించటానికేమీ ఉండదు.

    శూర్పణఖ యొక్క భర్తను రావణుడు చంపించటం వల్ల , ఆమె రావణుడిపై కోపంతో అలా చేసిందని కొందరంటారు. ఇది ఎంతవరకూ నిజమో నాకు తెలియదు మరి.

    2.....సీతాదేవి హనుమంతుని సహాయంతో రామునివద్దకు రావటం కన్నా రాముడు రావణుడిని చంపి సీతాదేవిని తీసుకువెళ్ళటమే పద్ధతిగా ఉంటుంది.. ఇక ఆ యుద్ధంలో చనిపోయిన వానరులు తిరిగి బ్రతికారంటారు.

    ఈ రోజుల్లో కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగి ఎందరో సైనికులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈనాటి ప్రజాస్వామ్యంలో కూడా సైనికుల జీవితాలు మారలేదు. ప్రజలకోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే , చాలామంది ప్రజలేమో విలాసాలు, సినిమాలతో కాలక్షేపం చేస్తున్నారు.

    ఇక రావణకుంభకర్ణులు...జయవిజయులే అయినా ....... .జయవిజయులుగా వారిని గౌరవిస్తాం, రావణకుంభకర్ణులు పాత్రలలో వారిని వ్యతిరేకిస్తాం.

    3..... భర్త చనిపోయి జీవితాంతం విధవగా బ్రతకవలసి రావటం, కుమారుడైన భరతుడే ఆమెను నిందించటం, ప్రజలు కూడా ఆమెను ఆడిపోసుకోవటం ఇవన్నీ కైకేయికి బాధాకరమైన విషయాలే..

    4......రాముడు రావణుడినీ చంపారు, తాటకినీ చంపారు. అన్యాయంగా ప్రవర్తిస్తే స్త్రీ పురుషులనే తేడా లేకుండా ఎవరికైనా సరే శిక్ష పడుతుందని ఈ విధంగా నిరూపించారు కదా !

    6......శబరి నది అయితే, జటాయువుకు సాక్షాత్తూ శ్రీరాముడే దహనసంస్కారాలు నిర్వహించారు అంటే జటాయువుకు మోక్షమే వచ్చి ఉంటుంది. అది గొప్ప విషయమే కదండి.

    7.....కుటుంబాన్ని పోషించవలసిన యజమాని ధర్మబద్ధంగా సంపాదించటమే పద్ధతి. అలాకాక అన్యాయంగా సంపాదిస్తే ఆ పాపాన్ని ఇంట్లో వారు భరించాలనటం ఏం న్యాయం ? అయితే కొందరు ఆడవాళ్ళు నగలు. నాణ్యాలు అంటూ భర్తను పోరినప్పుడు భార్య పోరు పడలేక ఆ భర్త అన్యాయంగా సంపాదించినప్పుడు మాత్రం .....ఆ పాపంలో వాటాను ఆ భార్య కూడా భరించవలసే ఉంటుంది.

    మీరన్నట్లు ఈ రోజుల్లో గృహహింస వంటి కొన్ని చట్టాలను కొందరు ఆడవాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారన్నది నిజమేనండి...స్త్రీ, పురుష వివక్షలు , ఇంకా సమాజంలోని అనేక సమస్యలకు కారణం ప్రజల అంతులేని స్వార్ధమే. ఈ వైఫల్యాలకు పురాణేతిహాసాలు ఎంతమాత్రం కారణం కాదు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓపికగా వివరణ ఇచ్చినందుకు నెనర్లు..
      ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు జాతి గర్వించదగిన సాహిత్యాన్ని అవమానిస్తూ ఉంటే, రాయాలనిపించి ఇది రాసాను. రాసింది రామాయణ కథని విమర్శిస్తూనే అయినప్పటికీ, అవమానించకుండా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించాను.
      ఇంక మీ వివరణ దగ్గరికి వస్తే,
      1) రావణుడు అపహరించాడు, శూర్పణఖ ఆ పని చేయలేదు. కానీ శూర్పణఖ చేసింది, రావణుడు చేయంది, ఒకటుండి. అదే చంపడానికి ప్రయత్నించడం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కోసింది, సీతని చంపబోయినందుకు. రావణుడు ఆ పని చేయనే లేదు. (వాల్మీకి రామాయణంలో ఉందో లేదో గానీ బాపు సంపూర్ణ రామాయణం లో రావణుడు తాను రామునిమీద జాలి తలచి, ఆయన లేని సమయంలో సీతాపహరణం చేసానని చెప్పుకున్నాడు).
      3) అవి కైకేయికి ఎంత బాధాకరమైనవి అయినా, అవి ఆవిడ చేసుకున్న స్వయంకృతాపరాధం. దశరథుడు, భరతుడు ఏ తప్పూ చేయకపోయినా బాధపడ్డారు.
      4) నేననేది శిక్ష గురించి కాదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అయితే యుద్ధంలో ఆడ-మగ తలపడి, ఆ యుద్ధ విజేతల మీద సమాజం చూపే ట్రీట్ మెంట్ లో తేడాలు ఎత్తిచూపుతున్నను.
      7) "ధర్మబద్ధం" అనేదానికి స్పష్టమైన నిర్వచనం ఏమిటి..?
      ఆ కట్టుకున్న భార్యకి పెళ్ళికి ముందే అతను బోయవాడు అని తెలీదా.? తెలుసు..! కానీ పాప పుణ్యాల దగ్గర తన స్వార్థం తాను చూసుకుంది. దానికి విరక్తి తెచ్చుకున్న ఆ వేటగాడికి "మరా మరా" ఉపదేశం జరిగిందంటారు. అది వేరే విషయం. అసలు సంసారమే లేకపోతే, అతనికి వేటాడవలసిన అవసరం ఏముంది.?

      ఏదైనా, నేను ఎంచిన వాటికి మీరు "నమ్మకం"మీద ఆధారపడిన వివరణే ఇచ్చారు. రామాయణాన్ని విమర్శించిన "కుహానా" వాదులకు వచ్చిన వివరణలు కూడా "నమ్మకం"మీద ఆధారపడ్డవే..!

      మీ బ్లాగు బావుంటుంది.
      నెనర్లు

      తొలగించండి
  3. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
    @మనోహర్ చెనికల
    @lakshman

    టపా సందర్శించినందుకు నెనర్లు
    @Jai Gottimukkala
    రామయాణాన్ని పుక్కిటి పురాణం అనేవాళ్ళు, రామాయణంని ఆధారంగా పిచ్చి ప్రేలాపనలు చేసేవాళ్లని విమర్శిస్తే చూడాలని ఉంది. అంటే, నాస్తికులు, హేతువాదులు ముందుకు వచ్చి రావణుడు దళితుడు అనివాగే వాళ్లనీ, రామాయణం పురుషాధిక్యతకి చిహ్నం అనేవాళ్లనీ విమర్శించాలన్నమాట.

    అయితే, వీళ్ళ మధ్యన ఏదో ఒప్పందం ఉన్నట్టు, వీళ్లెపుడూ రచనలు చేసుకుని విమర్శలు చేసినట్టు కనబడదు. ఎప్పుడు చూసినా హిందూ మతం, అగ్రకుల అభిజాత్యం, బూర్జువా, పురుషాధిక్యత అని నాబోటొవాళ్ళకి అర్థం కాని పదాలే వాడుతూ ఉంటారు.కనీసం మీరన్నా ఆ పని చేయండి..!

    ఇంతకు ముందొక టపాలో, "పుక్కిటి"పురాణం లో "పుక్కిటి" అంటే అర్థమేంటో చెప్పమని కోరాను. మీరు ఆ పదం వాడారు కాబట్టి, దానర్థం మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు తెలిస్తే అ పదం పుట్టుక, వ్యుత్పత్తి తదితర విషయాలను చెబుతారని ఆశిస్తున్నాను.

    ఇక్కడ సంతోషించేది "మగమహారాజులు" కాదండి. మన సాహిత్యం నిండా "పురుషాధిక్యతే" అని ఏడిచేవాళ్లకి (కుహానా స్త్రీవాదులు, వారి వెనుక ఉందే బాకావాదులు), కొంత "రాక్షస" ఉపశమనం కలిగిద్దామని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాలగ్రామ సుబ్రహ్మణ్యం గారూ, పుక్కిటి పురాణం అనే నానుడి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. అర్ధం మాత్రమె తెలుసు. ఒకవేళ ఆ పదం అభంతరంగా ఉంటె క్షమించండి. ఇంతక ముందు మీరు అడిగిన విషయం నేను చూడలేదు, sorry.

      రామాయణం తదితర గ్రంధాలు ఆయా కాలపు విలువలకు అద్దం పడతాయనే వాదన నాకయితే కరెక్టుగానే తోస్తుంది. A work of art represents and upholds a set of values & interests.

      మీ వాదన బట్టి ఆ కాలంలో (బహుశా ఇప్పుడు కూడా) స్త్రీల ఆధిపత్యం ఉందని, ఈ విషయమే గ్రంధంలో బయటి పడిందని మీరు అనుకుంటున్నట్టు నాకు అర్ధం అయింది. ఇది నిజం కాకపోవచ్చని నా అనుమానం.

      భూకైలాస్ సినిమాలో రావణుడికి మరో దృక్పథంతో చూపించారు. రామాయణం గురించి వివిధ కోణాలలో చేసిన విమర్శను ఎండగట్టిన మీరు ఈ ఒక్క కోణాన్ని వదిలేయడం కాకతాళీయమా?

      తొలగించండి
    2. "పుక్కిటి" అనే మాట పట్ల నాకు అభ్యంతరం ఏమీ లేదు. అది సరైనా పదమేనా కాదా అని ఎప్పట్నుండో నా సందేహం.

      తర్వాత , నేను స్త్రీ ఆధిపత్యం ఉందని ఎక్కడా అనలేదండి..!
      స్త్రీ సానుకూల సమాజం మాత్రమే ఉందని నా భావన. అప్పుడైనా, ఇప్పుడైనా, బహుశా ఎప్పుడైనా..! ఒకే తప్పుకి విధించాల్సిన శిక్షలలో లింగవివక్ష ఉంది అనే చూపుతున్నాను.

      ఇలా మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలీదు "ఆకాశంలో సగభాగం ఆడవారిది" అని అంటారు కదా..! ఆకాశం స్వేచ్ఛకి చిహ్నం కనుక అందులో తప్పులేదు.
      నేను "జైళ్లలో సగభాగం ఆడవాళ్ళదే" అంటాను. అక్కడ మాత్రం సమానత్వం అవసరం లేదా..?
      మంచిలో మాత్రమేనా సమానత్వం..? "చెడు"లో వద్దా..?
      I am not having exact statistics. But, I am sure that more cases will be on the name of males over females..!

      ఇంక, నేను "భూకైలాస్" చిత్రం పూర్తిగా ఎప్పుడూ, చూడలేదు. చూసిన తర్వాత ప్రయత్నిస్తాను.

      తొలగించండి
  4. @Praveen Mandangi
    విమర్శించడం తప్పు కాదండి..! అది పెద్ద పనీ కాదు.! అవమానించడమే తప్పు..!
    విమర్శించడానికి అర్హత ఉండాలని నా ఉద్దేశ్యం. అప్పుడే ఆ విమర్శకి విలువ ఉంటుంది. దాన్ని బట్టి అసలు సాహిత్యానికీ గౌరవం పెరుగుతుంది.
    కానీ గౌరవం లేకుండా చేసేవి విమర్శలు అనిపించుకోవు. వెక్కిరింతలు అవుతాయి.
    "రామాయణ విషవృక్షం"రాయడానికి ముందు, రంగనాయకమ్మగారికి ఉన్న అర్హత ఏమిటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఇక్కడ పంచుకోగలరు.

    రిప్లయితొలగించండి
  5. అది అవమానం అని ఎందుకు అనుకోవాలి? మతాన్ని అవమానిస్తే మార్క్సిస్ట్‌లకి ఏమీ రాదు. అది క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, హిందూ మతమైనా. యూరోప్‌లో క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ నాస్తికులు అనేక పుస్తకాలు వ్రాసారు, అక్కడ నాస్తికులని అరెస్ట్ చేసే anti-blasphemy చట్టాలు ఉన్నా సరే. అక్కడ మతమూ పోలేదు, నాస్తికత్వమూ పోలేదు. పాకిస్తాన్‌లో ఇబ్న్ వరాక్ కూడా ఖురాన్‌ని విమర్శిస్తూ పుస్తకం వ్రాసాడు. ఆ పుస్తకం చదివితే ఖురాన్‌లో అనేక మార్పులూ, చేర్పులూ జరిగాయని అర్థమవుతుంది. బైబిల్ నుంచి కొన్ని కథలని అప్రామాణిక కథలుగా భావించి తొలిగించినట్టే ఖురాన్ నుంచి కూడా కొన్ని కథలని అలాగే తొలిగించారు. http://debate.org.uk/topics/books/origins-koran.html ఈ విషయాలు తెలిసి కూడా ఖురాన్‌ని నమ్మేవాళ్ళు ఉన్నారు. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, రామాయణమైనా అప్పట్లో మనిషికి ఉన్న జ్ఞానం ఆధారంగా ఆధునిక జ్ఞానంతో సరిపోలేలాగ వ్రాయడం సాధ్యం కాదు.

    రిప్లయితొలగించండి
  6. ఖురాన్‌లో దేవుడు సూర్యుణ్ణి తూర్పు నుంచి ఉదయింపచేస్తాడనీ, పశ్చిమాన అస్తమింపచేస్తాడనీ వ్రాసి ఉంది. కానీ వాస్తవం వేరు. భూమి గుండ్రంగా ఉన్నప్పుడు సూర్యుని వెలుతురు భూమి మీద ఒక వైపే పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు వెలుతురు పడే దిశ మారుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది అని ఖురాన్ సంకలనం చేసినవాళ్ళకి తెలియదు కాబట్టే ఖురాన్‌లో అలాంటి దోషాలు వచ్చాయి. బైబిల్‌లో అయితే భూమి బల్లలాగ ఉందనీ, అది స్థంభాల మీద నిలబెట్టబడి ఉందనీ వ్రాసి ఉంది. వేదాలలో కూడా భూమి గురించి ఇలాంటి కథలే ఉన్నాయి. మత గ్రంథాలలో వ్రాసినవాటికి ఎన్నడూ ఆధునిక విజ్ఞానంతో పోలిక ఉండదు. ఎందుకంటే అవి వ్రాయబడిన కాలంలో మనిషికి తెలిసిన జ్ఞానం చాలా పరిమితం. రంగనాయకమ్మ గారైనా, ఇబ్న్ వరాక్ అయినా, బెర్ట్రాండ్ రస్సెల్ అయినా సైన్స్ పుస్తకాలు చదివి మతాన్ని విమర్శించేవాళ్ళు ప్రతి చోటా ఉంటారు. రంగనాయకమ్మ గారు "రామాయణ విషవృక్షం" పుస్తకంలో మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాదాన్ని కూడా ఉపయోగించడం వల్ల మార్క్సిజంని వ్యతిరేకించే వర్గంవాళ్ళకి ఆ పుస్తకం నచ్చలేదు. బైబిల్, ఖురాన్‌లకి కూడా చారిత్రక భౌతికవాదంతో పొంతన కుదరదు. నేను ఇంగ్లిష్‌లో బ్లాగులు వ్రాసే రోజులలో ఒక ముస్లిం నన్ను తీవ్రంగా దూషిస్తూ నాకు మెయిల్ పంపాడు. ఆ మెయిల్‌లో మార్క్స్, ఎంగెల్స్, డార్విన్‌లని కూడా తీవ్రంగా దూషిస్తూ వ్రాసాడు. మతవాదులు ఏది వ్రాసినా మతం మీద విశ్వాసం లేనివాళ్ళు కూడా నమ్మాలి కానీ అవిశ్వాసులు తమ అభిప్రాయాలు చెప్పుకుంటే అతను నాకు మెయిల్‌లో పంపినట్టువంటి దూషణలే పంపుతారు.

    రిప్లయితొలగించండి
  7. @Praveen Mandangi
    గౌరవం ఇవ్వకుండా చేసే విమర్శ (అది పొగుడుతూ చేసినా, తెగుడుతూ చేసినా) అవమానకరమే అవుతుంది.
    అవమానం అనే ఎందుకు భావించాలి అంటే, నా దగ్గర సమాధానం ఏమీ లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @Praveen Mandangi
      మీరు మార్క్సిస్టులు మతాన్ని విమర్శిస్తే వారికేమీ ఒరగదు అంటూనే, నాస్తికుల దగ్గరకి పోతున్నారు.
      నాస్తికులు, మతాలని విమర్శిస్తారు. అది వారి జీవన హక్కు. లేకపోతే వారికి మనుగడే ఉండదు. అది అందరికీ తెలిసిందే..! వారి విమర్శలమీద నాకున్న కంప్లైంటల్లా "గొట్టుముక్కల"గారికిచ్చిన వ్యాఖ్యలో రాశాను.
      అయితే, కమ్యూనిస్టులకి, మత గ్రంథాలపైన విమర్శలతో పనేంటి..? వాటికి అతీతంగా పనిచేయాలి కద..
      కమ్యూనిజం జోలికి పోవడం నాకిష్టం లేదీ టపాకి సంబంధించినంతవరకూ..!
      నేనడిగిన దానికి మాత్రం మీరు స్పందించలేదు.
      //"రామాయణ విషవృక్షం"రాయడానికి ముందు, రంగనాయకమ్మగారికి ఉన్న అర్హత ఏమిటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఇక్కడ పంచుకోగలరు.//అని అడిగాను.

      తొలగించండి
    2. ఇంగ్లిష్ బ్లాగ్ వ్రాసే రోజులలో నేను నాస్తికుణ్ణని చెప్పుకోలేదు. మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాదానికి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం కూడా ఒక బేసిస్. అయితే, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే 'మనిషిని దేవుడు సృష్టించలేదనీ, ఒక జీవి నుంచి ఇంకో జీవి పరిణామం చెందుతుందనీ' అంగీకరించాల్సి వస్తుంది. మత గ్రంథాలలో వ్రాయబడిన సృష్టి కథలకి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం వ్యతిరేకం కనుక ఆ రోజు ఆ ముస్లిం నన్ను దూషిస్తూ మెయిల్ పంపాడు. నేను వ్యక్తిగతంగా నాస్తికుణ్ణే అయినా అప్పట్లో నేను నాస్తికుణ్ణని పైకి చెప్పుకోలేదు. చెప్పుకోకపోయినా నేను నాస్తికుణ్ణని ఎలాగూ తెలిసిపోతుంది కదా.

      ఒక మత గ్రంథాన్ని విమర్శించడానికి ప్రత్యేక అర్హత అవసరం లేదు. మత గ్రంథం చదివినవాళ్ళు ఎవరైనా మత గ్రంథాన్ని విమర్శించొచ్చు. రంగనాయకమ్మ గారికి ఏ అర్హత ఉందని అడిగితే ఈ సమాధానమే చెపుతాను.

      తొలగించండి
  8. నాస్తికులు, మతాలని విమర్శిస్తారు. అది వారి జీవన హక్కు. లేకపోతే వారికి మనుగడే ఉండదు....are you kidding us???
    atheists will all die if they don't defend their belief??

    giving the proof of GOD is upon the theists! not on atheists! He says, I never saw, hear, felt the GOD, IF you did so, prove it!!! so, prove it!you!!!
    communism and atheism has not got anything in common! politically! not all atheists are communists! better get this fact!

    //"రామాయణ విషవృక్షం"రాయడానికి ముందు, రంగనాయకమ్మగారికి ఉన్న అర్హత ఏమిటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే ఇక్కడ పంచుకోగలరు.//అని అడిగాను.

    what's your capability of writing against an author?? did you have any prior eligibility?
    or, come to that point, about the atheists?? what's your eligibility to write about them??

    as a matter of fact, about the Ramayana itself??? if you can write about it, Ranganayakamma has every right to write about it! don't read if you don't want to!!! that's all!!! If there are 100 Telugu blogs, 50 of them could be non-sense, would it be your right to go on and criticize all of them, all 50???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ అజ్ఞాత
      నాకు పరాచికాలు ఆడవలసిన అవసరం లేదు. నాస్తికుడు అనేదానికి బై డీఫాల్ట్ నిర్వచనం "ఆస్తికుడు కానివాడు" అని. ఎప్పటి కాలంలోనైనా ఆస్తికులు, లేదా ఆస్తికులు అని చెప్పుకునే నాస్తికులే ఎక్కువమంది ఉంటారు. అటువంటు చోట, తాను నాస్తికుణ్ణి అని చెప్పుకుని మాత్రమే ఒక వ్యక్తి, "నాస్తికుడు" అనిపించుకుంటాడు. ఆ చెప్పుకోవడం, దేవుణ్ణి , మత గ్రంథాలని తిడుతూ కావచ్చు, ఆస్తికులని తిడుతూ కావచ్చు,. అలా లేకపోతే, అతనూ "గుంపులో గోవింద"ఆస్తికుడు అయిపోతాడు, తప్ప నాస్తికుడు అవ్వలేడు. ఇదే విషయం దన్నుగా నాస్తికులకి మనుగడ అస్తికులని విమర్శించడం వల్లనే అని అన్నాను.

      నేను ఒక రచయితకి వ్యతిరేకంగా ఇక్కడేమీ రాయలేదు. సదరు రచయిత గురించి అర్థం కాలేదు అన్నాను. అంతే..!
      ఆ రచయిత రాసిన పుస్తకం మీద వేరే చోట విమర్శలు అవుతున్నాయి. ఇక్కడ కాదు. గమనించండి..!
      ఇహ, విమర్శని వద్దు అని నేను చెప్పను. అయితే "విషవృక్షం" లాంటి తీవ్రమైన పేర్లు పెట్టుకుని రచనలు చేసేవాళ్ల ఉద్దేశ్యాలని అర్థం చేసుకునే ప్రయత్నం అంతే..!
      నాకు ఏ ఇజంతోనూ గొడవల్లేవు. ఉన్నదల్లా "ఇజం" పేరుమీద దొంగనాటకాలు ఆడేవారిమీదనే నా గురి అంతా..

      BTW, If you are an atheist, and believe that writings like Ramayana are fictitious. I am very enthusiastic to see that you criticizing, critics over "Ramayana". In fact, those critics are based on believes of theists.

      తొలగించండి
  9. Above Anonymous: Giving the proof for non existence of God is on atheists. Just because you didn't see it, it doesn't meant something doesn't exist.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Idealism cannot motivate people in all cases. So, it's the responsibility of the believers to prove the existence of god.

      తొలగించండి
  10. విశేఖర్ గారి బ్లాగ్‌లో నేను వ్రాసిన కామెంట్ ఇది:
    >>>>>
    రాజశేఖర్ గారు, మార్క్సిజం-లెనినిజంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినది చారిత్రక భౌతికవాదమే కానీ నాస్తికత్వం కాదు. మార్క్సిస్ట్‌గా మారకముందు కూడా నేను నాస్తికుణ్ణే. కేవలం దేవుడు, దెయ్యం, చేతబడి లాంటి వ్యక్తిగత విశ్వాసాలు మార్చుకోవడానికి ఎవరూ మార్క్సిజంని ఆశ్రయించరు. సామాజిక అభిప్రాయాలు మార్చుకోవడానికి మాత్రం మార్క్సిజం అవసరమే. పెట్టుబడిదారీ వర్గంవాళ్ళు ప్రైవేట్ ఆస్తి అనేది మొదటి నుంచి ఉందనీ, అదే కొనసాగాలనీ అంటారు. కానీ చరిత్ర పరిణామంలో ప్రైవేట్ ఆస్తి అనేది మొదటి నుంచి లేదు. ఆ విషయం చదివిన తరువాత నాకు ప్రైవేట్ ఆస్తి మీద ఉన్న భ్రమలు అన్నీ పోయాయి.
    >>>>>

    రిప్లయితొలగించండి
  11. మీరు పురాణేతిహాసాలంటే గౌరవమున్న వ్యక్తి అని మీ బ్లాగు చదివిన వారికి తెలుస్తుంది. నేనూ మీ బ్లాగ్ చాలాసార్లు చదివానండి. మీరు ఎన్నో చక్కటి టపాలు వ్రాసారు. స్త్రీ, పురుష వివక్ష గురించి మీ ఆవేదన నాకు అర్ధమయింది. అయితే,

    1) రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో ఉంచటం వల్ల సీతమ్మ తన భర్తకు , పిల్లలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఏ తప్పూ చేయకపోయినా ఎన్నో బాధలు పడవలసి వచ్చింది. సీతారాముల నిండు జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి రావణుడు . అతడు చేసిన తప్పు చాలా పెద్దది.

    3) దశరధుడు కూడా కైకేయిని వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేదేమోనండి.

    4) రాముడు తాటకిని వధించి , ఆ రాక్షసి పీడ వదిలించినందుకు అప్పటివారు ఎంతో సంతోషించారంటారు. ఇక యుద్ధ విజేతల మీద సమాజం చూపే ట్రీట్ మెంట్ లో తేడాలు అంటే..... ఇలాంటి కుహనా విమర్శకుల విమర్శలను మనం పట్టించుకోనవసరం లేదండి.

    7) "ధర్మబద్ధం" అనేదానికి స్పష్టమైన నిర్వచనం ఏమిటి..? అంటే,...
    ఇక్కడ బోయవాని విషయంలో చూస్తే , అడవిలో జంతువులను వేటాడి జీవించటం , అడవిలో దొరికే పండ్లు ఆహారంగా స్వీకరించటం , ఇంకా పంటలను పండించుకుంటూ జీవించటం ఇవన్నీ బోయవానికి ధర్మబద్ధమే. అయితే ఈయన అడవిలో వెళ్ళే బాటసారులను కూడా హింసించి వారి యొక్క ధనాన్ని అపహరించటం, కొంతమంది బాటసారులను చంపటం కూడా చేసేవారట. అలా బాటసారులను చంపి ధనం సంపాదించటం ధర్మబధ్ధం కాదు కదా !

    ఇలా రాయటం మీతో వాదించాలని ఎంతమాత్రం కాదు. మీ బ్లాగులో ఎక్కువగా రాసినందుకు క్షమించండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Hi ANRD garu.. me 1st point lo seethamma pillalaku duram aeindi ani rasaru.. kani ravanasurudu seeth nu ethuku poinappudu pilla lu leru kadandi.. lava kusa lu taravtha eppudo puttaru kada.. please correct.

      Pardhu

      తొలగించండి
  12. హహ్హహ్హ... బాగుంది బాగుంది. స్త్రీ ఆధిపత్యం నశించాలి శించాలి చాలి లి. కోరస్ బాగా చెప్పానా :)

    రిప్లయితొలగించండి
  13. @Narayanaswamy S.
    నెనర్లు.
    @Bhardwaj Velamakanni
    :)))))
    @nagarjuna
    నశించాల్సింది అధిపత్యం కాదండి, అక్కర్లేని సానుభూతి.
    కామెంటినందుకు నెనర్లు

    రిప్లయితొలగించండి
  14. Aha..!! emi pidakalu rasav brother. magavallni evaru pattichukovadm ledu.. nuvina kasta gattiga pidakalu rayu.. i support.

    Pardhu

    రిప్లయితొలగించండి
  15. chala bagundhi ramayanum oka maha kavyam ma bhavi tharalaku manaku samajam lo ala melagalo cheppi oka githa saram ani na bhavana...Ramudu dhevudu ina ravanasudu rakshasudu ina idharu vari vari dharamalu niravthinchadamlo mahaonatham ga pravarthincharu andhuku chakani ex. rama ravana sumgramaniki ravanudai muhurtham pedathadu ramudu gelavalni.........

    రిప్లయితొలగించండి