30, నవంబర్ 2011, బుధవారం

మా ఇంటికొచ్చిన అయ్యప్పస్వామి ప్రసాదం




ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో(ఆరేళ్ళ క్రితం) జరిగిన రెండు అనుభవాల సమాహారమీ టపా..! 

కాలేజి అయిపోయి ఇంటికొచ్చినపుడు ఇంటికింద ఉండేవాళ్లు నా చేతిలో ఓ కాగితం పొట్లం పెట్టారు. (నా చేతిలో ఎందుకు పెట్టారంటే, సాయంత్రంపూట ఇంటికి ముందుగా వచ్చేది నేనే.., మరి మా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే.! మా అన్నయ్య ఆలస్యంగా రావడం కూడా జరిగి, పొట్లం నా చేతిలోకొచ్చింది). అది అయ్యప్పస్వామి ప్రసాదమట. ఎవరో నలుగురు స్వాములు మా వీధిలో పంచిపెట్టారట. మామూలు విషయమే కనక, ఆ పొట్లం ఇంటిలోకి తీసుకొచ్చేసాను.

ఆ తర్వాత దాని విషయమే మర్చిపోయాను.

ఓ గంట తర్వాత, మా చిన్నన్నయ్య (మా పెద్దనాన్నగారి రెండో అబ్బాయి., మేము పక్కపక్కవాటాల్లోనే ఉంటున్నాంలెండి) చెప్పాడు ఆ పొట్లం గురించి..
పొట్లంలో అటుకులూ, బెల్లమే ఉన్నాయి, కానీ పొట్లం కట్టిన కాగితం మీద ఉన్న రాతలు..


నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును

యెహోవా..

ఇలాగ ఉండి..,
 ఆత్రేయపురంలో వీరయ్యో, అమలాపురంలోని పుల్లమ్మో క్రీస్తుని నమ్మడం ద్వారా ఎంత బాగుపడ్డారో వివరించి కూడా ఉందన్నమాట..

ఈ విషయం మా వీధిలో ఎంతమందికి తెలుసో, ఎంతమందికి తెలీదో, అసలు చూసారో లేదో నాకు తెలీదుగానీ, మా ఇంట్లో మాత్రం కొంతమంది అవతల పారేసారు. కొంతమంది అవి తినేసి కాగితం చింపేసారు. (అఫ్‌కోర్స్‌.. ఏ పొట్లం కాగితమైనా ఇంతే..!) ఆ విషయాన్ని మర్చిపొయ్యారు రెండురోజుల్లో..

ఇంక కాలేజిలో ఒక ఫ్రెండు ఉండేవాడు. కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌..! ఇతను కాలేజిపక్కన ఉన్న చర్చికి రమ్మని పెద్దగా పోరకపోయినా, హిందూ మతం మీద, ఆచారాలమీద కామెడీలూ, గేలిచేయడాల్లాంటివి చేస్తూ ఉండేవాడన్నమాట..! అప్లికేషన్‌ లో మాత్రం రిజర్వేషన్‌ కోసం "హిందూ" అనే రాసుకున్నాడు. (అది వేరే విషయం)

ఒకసారి అతను చెప్పిన కథ (పుట్టించిన/ప్రచారం పుకారు) చాలా వెరైటీగా ఉంది..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్నపిల్లాడు పుట్టాడట కనుబొమ్మలు లేకుండా (నిజంగా ఉంటాయో ఉండవో నాకు తెలీదుగానీ., అతను చెప్పింది మాత్రం ఇదే)..! కనుబొమ్మలు లేవని ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఏడ్చేస్తున్నారట (ఎందుకో మరి). వెంటనే ఆ పిల్లాడు "నేను ఏసుక్రీస్తుని..! నా కనుబొమ్మల్లోని వెంట్రుకలు మీ బైబిళ్లలో ఉంటాయి. పోయి చూసుకొండి".అని అన్నాడట..!

అలా చెప్పి చనిపోయాడట..! వాటికోసం వెతికిన వారందరికీ దొరికాయట..!
ఈ కథ చెప్పి ఇతగాడు తనదగ్గర బైబిల్లో కూడా వెంట్రుకలున్నాయి అని చెప్పాడు. 

ఇది ఏ రకమైన ప్రచారమో నాకర్థం కావట్లేదు. ఆ సమయంలో అసలు కాకపోయినా, కొద్దిగానైనా అర్థం చేసుకోగలిగేవాణ్ని గనక వాడి చెప్పిన కథ కల్పిందేనని తెలుసుకోడానికి అట్టే సమయం పట్టలేదు. అదే ఏ ఐదు సంవత్సరాల పిల్లాడో, ఐదో క్లాసు అమ్మాయో ఇలాంటి దివాళాకోరు కథలు వింటే ఏమౌతుందో అర్థం చేసుకోవచ్చు. చాలా స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ జరుగుతున్న వాటికి ఉదాహరణలివి..!

"ప్రతీ మనిషికీ తనకి నచ్చిన మతాన్ని అవలంభించే హక్కూ, ప్రచారం చేసుకునే హక్కూ" ఉండి ఉండవచ్చుగాక, కానీ "దేశ సంస్కృతినీ, ఆచార వ్యవహారాలనీ, పరిరక్షించడం" అందరి బాధ్యత అనే దానికే రాజ్యాంగం ప్రాధాన్యం ఇస్తోంది (నాకు తెలిసున్నంత జ్ఞానంలో). ఎప్పుడైనా "హక్కు"లకీ "ఆదేశిక సూత్రాల"కీ మధ్య వివాదం లాంటిదొస్తే "ఆదేశిక సూత్రాల"కే కోర్టులు, ప్రభుత్వాలూ ప్రాధాన్యత ఇవ్వాలనీ చాలా మందికి తెలీదనుకుంటా బహుశా..! (తప్పయితే సవరించగలరు)

ఇటువంటి సంఘటనలూ, ప్రలోభాలూ బహుశా ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి
..
...
.....
By the way..అందరికీ సుబ్బారాయుడి షష్టి శుభాకాంక్షలు

4 కామెంట్‌లు:

  1. ituvanti prachaaraalu, prabhodhaalu, kathalu ekkuva ayyayi. dabbula kosam matham maaruthunna vaaru vaare ardham chesukovali vaari viluvalani.

    రిప్లయితొలగించండి
  2. ఆదేశిక సూత్రాలకి కోర్టుల నుంచి రక్షణ ఏమీఉండదండీ. అవి ప్రభుత్వానికి మార్గదర్శకత్వాలుమాత్రమే.

    రిప్లయితొలగించండి
  3. @గీతాయశస్వి గారు
    నమస్తే..!
    @ఇండియన్‌ మినర్వాగారూ..!
    "హక్కులకి" మల్లే ఆదేశిక సూత్రాలకి రక్షణ "తప్పనిసరి" కాదుగానీ, చట్టాలు చేసినపుడు వాటికే కదండీ ప్రాధాన్యత ఇస్తారు..?
    అవసరమని అనిపించినపుడు, "ఆదేశిక సూత్రాలు" పాటించడానికి "హక్కు"లని రద్దు చేయడంగానీ, మార్చడంగానీ చెయ్యొచ్చని విన్నాను మరి...!
    అయితే, నేను పొరబడింది వేరే చోట...
    "సంస్కృతిని, ఆచారవ్యవహారాలను గౌరవించి పరిరక్షించడం".. పౌరుల ప్రాధమిక విధుల్లోకి వస్తాయి. ఆదేశిక సూత్రాలు కాదు..!

    (తప్పులు సవరించగలరు)

    రిప్లయితొలగించండి
  4. బాగా వ్రాశారండీ! ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. వాళ్ళ మతాలని ప్రచారం చేసుకోవడం తప్పు కాదు కానీ అదే సమయంలో ఇతర మతాలని చులకన చేస్తూ మాట్లాడటం తప్పని నా అభిప్రాయం. అలా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీయకుండా, వాళ్ళ అభిప్రాయాలని కించపరచకుండా ఏమి చేసుకున్నా సరే నిరభ్యంతరంగా చేసుకోనివ్వచ్చని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి