1, నవంబర్ 2011, మంగళవారం

ఒక సంస్కృత అద్భుత కావ్యం గురించి..



                         "ఫేస్‌ బుక్‌" చూస్తూండగా  మధ్యలో తగిలిన ఫోటో ఇది. బహుశా, ఎవరిదో పుస్తకం నుండి కాపీ చేసి పెట్టి ఉంటారు. సారాంశం మాత్రం అద్భుతం. ఆసక్తికొద్దీ నా బ్లాగులోకి తీసుకువచ్చాను.



ఆ కావ్యానికి సంబంధించిన లింకు

6 కామెంట్‌లు:

  1. మీరు పెట్టిన కాగితం సగమే కనిపిస్తోంది.
    ఇలాంటి కావ్యమే కదా రాఘవ పాండవీయం!!

    రిప్లయితొలగించండి
  2. బాగుంది దీనిని మొట్టమొదటి సారి మాగంటి వంశీ మోహన్ గారు www.maganti.org లో దీని pdf పెట్టినప్పుడు చదివాను అప్పుడు ఈ పుస్తకం కోసం వెతికాను కానీ దొరకలేదు! ఇప్పుడు మీ ధర్మమా అని దానిని చదివే అవకాశం దొరికింది! ధన్యవాదాలు!
    మందాకిని గారూ అదీ రాఘవ యాదవీయం అనుకుంట అండి మొత్తం ఇలానే పాదభ్రమక పద్యాలతో ఉంటుంది! నాకు సరిగ్గా గుర్తు లేదు!

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ..!
    సరిచేసానండీ..

    రసజ్ఞగారూ..!
    ధర్మం అదీ..అని పెద్ద మాటలెందుకులెండి..! కనబడింది గనక పెట్టాను.. పైగా మీ వ్యాఖ్యల్లోని విషయాలు నాకిప్పటి వరకూ తెలీదు.
    నా బ్లాగు సందర్శించినందుకు ధ న్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఎల్బా ఒక ద్వీపం పేరు. నెపోలియన్ చక్రవర్తిని పదివీచ్యుతుణ్ణి చేశాక ఈ ద్వీపంలో బంధీంచి ఉంచారు. ఎల్బాను చూడక మునుపు నేను శక్తిమంతునిగా ఉన్నాను అనే ఆ పేలిండ్రోం వాక్యం నెపోలియన్ ఉవాచగా అనుకోవచ్చు బహుశా. మీరు ఉదహరించిన సంస్కృత శ్లోకం విలోమం అయితే కావచ్చు (అంటే వెనకనించి చదివినా అర్ధవంతంగా ఉండడం) కానీ పేలిండ్రోం కాదు. సంస్కృత చాటువుల్లోనూ కావ్యాల్లోనూ ఇటువంటి పదాలతో ఆటలాడుకునే చమత్కృతులు కోకొల్లలు. పింగళి సూరన రాసిన రాఘవపాండవీయం ద్వ్యర్ధి కావ్యం - అంటే రెండర్ధాల కావ్యం. వెనకి నించి చదవడానికి దీనికి సంబంధం లేదు - ఒకే కావ్యంలో ప్రతీ పద్యమూ ఒక అర్థం రామాయణ కథా పరంగానూ మరొకటి భారత కథా పరంగానూ స్ఫురించేట్టు రాశారు. మన తెలుగు బ్లాగుల్లోనూ చిత్ర గర్భ బంధ కవిత్వాలు రాయగల సమర్ధులు పలువురున్నారు. ఉదాహరణకి శ్రీ చింతా రామకృష్ణగారి ఆంధ్రామృతం బ్లాగు చూడండి.

    రిప్లయితొలగించండి
  5. కొత్త పాళీగారూ..!
    చాలా విలువైన విషయాలు పంచినందుకు.. ధన్యవాదాలు..!

    రిప్లయితొలగించండి