29, జనవరి 2012, ఆదివారం

Engineering Education in Telugu [తెలుగులో ప్రౌద్యోగిక (?) విద్య]


ఐక్య ప్రగతిశీల కూటమి - 2 ప్రభుత్వం కొత్తలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కపిల్‌ సిబ్బల్‌ గారి ప్రకటనలో ఒక విషయం ఏంటంటే, 2020 కల్లా "హిందీ దేశం"గా మారే ఆశయం కలిగి ఉన్నామని. అయితే, ఆ ప్రకటనకిగానీ ఆ మంత్రికి గానీ అప్పట్లో అంత ప్రాముఖ్యత లభించలేదు (నాకు తెలిసున్నంతవరకూ..!). ఒకే దేశం, ఒకే భాష అనేది బహుశా ఒక ఆదర్శం కావచ్చు. కానీ ఈ దేశంలో ఎన్నో భాషలున్నాయిఅటువంటప్పుడు హిందీయేతరుల మీద హిందీని రుద్ది దాన్ని అందరి భాష చేయాలనుకోవడం తప్పుడు విధానం. భాష విషయమ్మీద ముక్కలైన దేశాలు చాలానే ఉన్నాయి.. పక్కనే ఉన్న బాంగ్లాదేశ్‌ ఓ ఉదాహరణ. మనదేశంలో మాట్లాడేవారు (+మాట్లాడగలిగేవారినీ) లెక్కలోకి తీస్కుంటే హిందీ అన్నింటికన్నా పెద్దది మరియు ఉత్తరభారతదేశంలో (మాత్రమే) మాట్లాడే భాష; తెలుగు తర్వాతి స్థానంలోనూ, దక్షిణభారతంలో ప్రధానమైన భాషగానూ; బెంగాలీ ఆ తర్వాతి స్థానంలోనూ, తూర్పు భారతంలోని ప్రధాన భాషగానూ ఉన్నాయి.(ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం బెంగాలీ 2వ స్థానం, తెలుగు 3వ స్థానం). తమిళం, మరాఠీ, పంజాబీ వంటి భాషలు కూడా పెద్ద భాషలే. వీటిలో ఒక్క హిందీ మాత్రమే అధికార భాషగా గుర్తింపు పొందింది. తమిళం వాళ్ళు తమభాషని కూడా అధికారభాష చేయాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. వాళ్ల వెనకాల తెలుగువాళ్ళు..!

ఇంక ఇంగ్లీషు సంగతి.. దేశంలో 60% మంది హిందీయేతరులు,కనీసం 30% మందికి హిందీతో పరిచయం కూడా లేదు. అలాంటివారికోసం ఇంగ్లీషు వాడుతున్నాం అన్నారు. అది కాస్త, ప్రపంచస్థాయి భాష అయికూర్చుంది. అదీ భారతీయుల వల్లే..! ఎందుకో అందరికీ తెలుసు, ఇంగ్లీషు మాట్లాడేవారు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే..! సుమారుగా 35-40 కోట్లమంది సులువుగా మాట్లాడేస్తారు ఆంగ్లాన్ని. అది అమెరికా జనాభా కన్నా ఎక్కువ.... భారతీయ ఆంగ్లం (Indian English) అని విదేశీయులు అంటూంటే, వెక్కిరిస్తున్నారని అనుకొని కుమిలిపోవడం, బ్రిటిష్‌ ఇంగ్లీషు, అమెరికా ఇంగ్లీషుని అనుకరించ ప్రయత్నించడమూ అందరికీ తెల్సిందే. అయినా సరే మనకంటూ ఒక ప్రామాణికమైన ఆంగ్ల విశ్వవిద్యాలయాన్ని ఏర్పరుచుకోవడం లేదు. ఇప్పటికీ ఇంగ్లీషు డిక్షనరీ అంటే Oxford Dictionaryనో, వేరే విదేశీ విశ్వవిద్యాలయాల ప్రచురణల్నే ఉపయోగిస్తున్నాం. అంతేగానీ మనకంటూ ప్రత్యేకతని ఏర్పాటు చేసుకునే శ్రద్ధ అయితే ఏమీ లేదు. ఏదో గుడ్డిగా అమెరికానో, బ్రిటన్‌నో అనుసరించెయ్యడమే..!
ఇంక సంస్కృతం సంగతి, భారతదేశానికి చెందిన భాషలన్నింటితోనూ సంబంధాలు ఉన్న ఏకైక భారతీయ భాష ఇదొక్కటే..! ఇది భారతీయ భాష అనీ, మహ గొప్పభాష అనీ చెప్పుకుని చంకలు గుద్దుకోవడమే గానీ, స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి చిత్తశుద్ధితో దీన్ని అభివృద్ధి చేసిన దాఖాలాలు లేవు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అధికార భాషగా చేసుకోవడం తప్పించి. మన దేశంలో ఎప్పట్నుండో సంస్కృతం అనుసంధాన భాషగా ఉంటూ వచ్చింది. మన పూర్వీకులు చేసిన పరిశీలనలు, సమీకరించిన విజ్ఞానమూ, వారి ఆలోచనలూ, భక్తీ, ఆధ్యాత్మికత..ఇలా అన్నింటికీ సంబంధించిన database సంస్కృతంలో ఏర్పాటు చేసారు. అదిప్పుడు ఎవడికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకున్నవాడు నలుగురితో పంచుకోబోయినా పట్టించుకునేవాళ్ళు చాలా తక్కువ. నిజానికి ఇప్పటికీ సంస్కృతం దేశ జాతీయ భాషగా, సాంకేతిక భాషగా వాడుకునేందుకు అవకాశం ఉంది. (ఇజ్రాయేలు దేశం ఈ విషయంలో ఆదర్శం..! ఆ దేశం ఏర్పడే సమయానికి వారి ప్రాచీన భాష హిబ్రూ ఎవ్వడికీ  రాదు. కానీ ఇప్పుడు అది ఆ దేశ అధికార భాష). ఇది స్థూలంగా మన భారతీయ భాషల పరిస్థితి.
మొన్నా మధ్యన రాందేవ్‌ బాబా చేసిన దీక్ష అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బాబాగారు, పోలీసులు దాడి చేసినపుడు వానరావతారం ధరించి కుప్పిగంతులేసాడు. అది వేరే సంగతి. కానీ, "భారత్‌ స్వాభిమాన్‌"లోని కొన్ని డిమాండ్లు మంచివే చేసాడు. అందులో ఒకటి మాతృభాషలో విద్యాబోధన గురించి. ముఖ్యంగా సాంకేతిక విద్య(Technical Education), వైద్య విద్య ఇంకా ఇతర ఉన్నత విద్యలు కూడా మాతృభాషలోనే బోధించాలని.! ఈ డిమాండ్‌ బాబాగారిది మాత్రమే కాదు, ఇంకా చాలామంది ముందునుండి చేస్తున్నదే.. విద్యాప్రమాణాలు మెరుగుపడడానికి, ఎక్కువమంది సూచించేదే మాతృభాషలో విద్యాబోధన. మనం తెలుగువాళ్ళం కాబట్టి. "తెలుగులో సాంకేతిక/ప్రౌద్యోగిక విద్య" అని వ్యవహరింద్దాం. ఈ టపా ముఖ్యోద్దేశ్యం, దీని గురించి చర్చలాంటిది ఏదైనా జరుగుంతుందనీ, దానికి ఆతిథ్యం ఇద్దామనీనూ..!

సుమారుగా అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ మాతృభాషలోనే విద్యాబోధన సాగిస్తున్నాయి. అమెరికా అయినా, జపాన్‌, కొరియా, బ్రిటన్‌, జర్మనీ ఇలా చాలా దేశాలు. మనదేశంలో మాత్రం ఇంగ్లీషూ అంతర్జాతీయ సమైక్యతా అంటూ ఇంగ్లీషులో కానిస్తున్నారు.( ఆ ఇంగ్లీషులో మన ప్రత్యేకత అంటూ ఏమీ లేదు.) మాతృభాషలో విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్కించుకోవడం చాలా తేలిక. వేరే భాష అనేది కేవలం సంభాషించుకునేంతవరకూ, (అది దైనందిన సంభాషణ మొదలుకుని సాంకేతిక సంభాషణ వరకూ ఏదైనా) వస్తే సరిపోతుంది. 
ఫ్రాన్స్‌, జర్మనీ, కొరియా, జపాన్‌ దేశాలు వాటివాటి పరిశోధనలూ, వాటి వాడకమూ (Research and Applications) అంతా తమతమ భాషల్లోనే చేస్తాయి. అక్కడి విద్యార్థులూ, పరిశోధకులూ తమ పరిశోధనా వ్యాసాలనూ, పత్రికలనూ తమతమ భాషల్లో ప్రచురించుకుంటారు. పరిశోధన జరిగిన తర్వాత మాత్రమే ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రచురణకి పంపిస్తారు. మనదేశంలో మాత్రం మొత్తం అంతా ఆంగ్లమే (అదీ బ్రిటన్‌దో, అమెరికాదో అవుతుంది... ఎవడిష్టం వాడిది..!)..! పైపెచ్చు మనభాషల్ని తిట్టుకుంటూ ఉండడమూ..!

సరే నాకు ఇప్పటికి గుర్తొచ్చిన నాలుగైదు ముక్కలూ ఇక్కడ రాసేసాను. పనిలోపనిగా Engineering Educationలోని కొన్ని పదాలని పరిచయం చేయడానికి ఈ పట్టిక రాయడం జరిగింది. (సొంత తెలివితేటల్ని తక్కువగా ఉపయోగించి) మా సంస్థానం నుండి సేకరించినవాట్లో కొన్ని అన్నమాట..! ఓసారి వీక్షించండి తప్పులుంటే సవరించండి. ఖాళీలని పూరించండి.
English
हिंदी
తెలుగు
Engineer
अभियंता
అభియంత
Technical
पारिभाषिक
సాంకేతిక
Technological
प्रौद्योगिक
ప్రౌద్యోగిక
Archetecture & Planning Department
वास्तुकला एवं नियोजन विभाग
వాస్తుకళ మరియు ప్రణాళికా విభాగం
Biotechnology Department
जीव प्रौद्योगिकी विभाग
జీవ ప్రౌద్యోగిక విభాగం
Chemical Engineering Department
रसायन अभियांत्रिकी विभाग
రసాయన  అభియాంత్రిక విభాగం
Civil Engineering Department
जानपद अभियांत्रिकी विभाग

Earth quake Engineering Department
भूकंप अभियांत्रिकी विभाग
భూకంప  అభియాంత్రిక విభాగం
Electrical Engineering Department
विद्युत अभियांत्रिकी विभाग
విద్యుత్‌  అభియాంత్రిక విభాగం
Electronics and Computer Engineering Department


Management studies Department
प्रबन्ध अध्ययन विभाग

Mechanical Engineering Department
यांत्रिक अभियांत्रिकी विभाग
యాంత్రిక అభియాంత్రిక విభాగం
Industrial Engineering Department
औद्योगिक अभियांत्रिकी विभाग
పారిశ్రామిక అభియాంత్రిక విభాగం
Metallurgical & Materials Engineering Department
धातुकर्म एवं पदार्थ अभियांत्रिकी विभाग

Paper Technology Department
कागज प्रौद्योगिकी विभाग
కాగిత ప్రౌద్యోగిక విభాగం
Water Resource Development and Management Department
जल संसाधन विकास एवं प्रबन्ध विभाग
జలవనరుల అభివృద్ధి మరియు నిర్వహణ విభాగం

18 కామెంట్‌లు:

  1. ఏవండోయ్! ఇన్ని చదివాక నాకొక పేద్ద సందేహం వచ్చేసింది! మరి nanotechnology ని .......(?) ...... ప్రౌద్యోగిక విద్య అంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞగారూ..!
      నాకు తెలిసే ఉంటే, ఇక్కడ రాసే ఉండేవాణ్ణి కదండి....! తెలిసీ తెలియకుండా ఉంటే హిందీవాళ్ళు కూడా ఇంగ్లీషునే రాసేస్తారు(మనతెలుగువాళ్ల లాగే..!) Nanotechnologyకి नैनोप्रौद्योगिकी అని.! (హిందీ వెబ్‌ సైట్ల నుండి పట్టుకొచ్చిందే ఇది..!)ఇంకెవరైనా చెప్పగలిగితే బావుణ్ణు..! 10^(-9) అని అర్థం వచ్చేలా పదం ఉంటే వాడెయ్యడమే..!

      తొలగించండి
    2. రసజ్ఞ గారూ, వామనగీత గారూ,
      Nanotechnology లో nano శతకోటి అంశాన్ని సూచిస్తుంది కాబట్టి శతకోటి అంశ (శతకోట్యంశ అవుతుందేమో పండితులు చెప్పాలి) సాంకేతిక నైపుణ్యత అనొచ్చునేమో ఆలోచించండి

      తొలగించండి
  2. మంచి ప్రయత్నం. పదాల అనువాదాలే కాకుండా engineering సాంకెతిక పరిజ్ఞానాన్ని తెలుగులొ అనువదించదానికి క్రుషిచెయాలి. ఇది చాల కష్టం అని తెలుసు కాని మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మీకు నా నుండి చేతనైన సహాయన్ని అందించగలను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రశాంత్‌ గారు..! ధన్యవాదాలండి.
      సాంకేతిక పరిజ్ఞానం మొత్తం తెలుగులోకి తీసుకొని రావాలంటే, ఒక సంఘం(తెలుగు ఇంజనీర్ల సంఘం లాంటిదేదైనా) పూనుకొని/ఏర్పరుచుకొని చేయాల్సిందే. హిందీకైతే CSIR Laboratories అన్నీ ఉన్నాయి అభివృద్ధి చేస్తూ... అధికార భాష కనుక.! అందుకే "भारतीय वैज्ञानिक एवं प्रौद्योगिक पत्रिका" లాంటివి వస్తున్నాయి, పరిశోధనా వ్యాసాలతో సహా..!

      తొలగించండి
    2. చిన్న సవరణ.. ""भारतीय वैज्ञानिक एवं प्रौद्योगिक अनुसंधान पत्रिका"అని చదవగలరు

      తొలగించండి
  3. నా అభి ప్రాయాలు దిగువపొందుపరుస్తున్నాను.
    దయచేసి పరిశీలించగలరు. అన్నిచోట్లా అభియాంత్రిక కి బదులుగా అభియాంతిక అనివాడితే బాగుంటుందేమో. అందులో యాంత్రిక అన్న సూచన ఉన్నప్పటికీ.
    Engineer అభియంత అయినపుడు Engineering అభియాంతిక అవుతుందేమో. Engineering education అభియాంతిక విద్య; Biotechnology Department: జీవ సాంకేతిక విభాగము; Civil Engineering Department : పౌర అభియాంతిక విభాగము; Electrical Engineering Department : విద్యుదభియాంతిక విభాగము ; Metallurgical & Materials Engineering Department : లోహోత్పత్తి మరియు పదార్థ అభియాంతిక విభాగము;
    Paper Technology Department : కాగిత తయారీ సాంకేతిక విభాగము ;

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తిగారు..!
      "అభియాంత్రిక" అనే పదం భారతదేశంలో ఉన్న అన్ని IIT,NITల్లోనూ వాడుతున్నారు (బోర్డులవరకే పరిమితమైనా..!. మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజిలలో అది కూడా లేదు). అందుకే అలాగే ఉంచేసాను.
      ఇంక కాగిత "తయారీ",లోహ "ఉత్పత్తి" కాదు లెండి. "తయారీ","ఉత్పత్తి"యే కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి కదా.

      తొలగించండి
  4. పిల్లి=బిడాలం==మార్జాలం.

    రిప్లయితొలగించండి
  5. శర్మ గారు,
    నా వ్యాఖ్య ఎందుకు ప్రచురితం కాలేదో తెలీలేదు.
    నా సవరణలు : (హిందీకి)
    టెక్నికల్ కి పారిభాషిక్ అని మీరు వ్రాశారు. పారిభాషిక్ శబ్దావలీ అంటే శాస్త్రీయ నామములని అర్థము.
    టెక్నికల్ కి తక్ నీకీ సరి అయినది. (హిందీ)
    టెక్నాలజీ కి ప్రౌద్యోగికీ శబ్దం సరిపోతుంది కానీ
    ఇండస్ట్రియల్ కి ఔద్యోగిక్ అనేదే సరిఅయినది.
    ఇలా వాడబడుతున్నాయి కూడా .
    ఇక తెలుగు :
    నా సూచనలు :
    సివిల్ కి జనసామాన్య అని వాడవచ్చు.
    ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ కి విద్యుతాత్మక సంగణక అని వాడవచ్చు
    మేనేజ్ మెంట్ స్టడీస్ కి నిర్వహణ అధ్యయన అని వాడవచ్చు
    పేపర్ కి కాగితమే సరి. పత్రిక అంటే వేరే అర్థం కూడా ఉంది కదా.

    రిప్లయితొలగించండి
  6. nano కోసం ఇవేమైనా పనికొస్తాయేమో చూడండి.
    http://www.eemaata.com/em/issues/200209/601.html
    http://www.eemaata.com/em/issues/200005/776.html

    రిప్లయితొలగించండి
  7. @మందాకినిగారూ...! మీ వ్యాఖ్య స్పామ్‌లో కూడా లేదండి..! ఎందుకు ప్రచురితం కాలేదు నాక్కూడా అర్థం కాలేదు..
    ఈ వ్యాఖ్యలోని సవరణలు కాకుండా వేరేవైతే దయచేసి మళ్ళీ వ్యాఖ్యానించగలరు..!
    కాగిత ప్రౌద్యోగికం అని రాద్దామనుకున్నాను కానీ కొంచెం ఎబ్బట్టుగా అనిపించి రాయలేదు. కాగి ఇప్పుడు సవరించాను. చూడండి..! అయినా, పత్రిక అంటే కాగితం అనే అర్థం కూడా ఉంది కదండీ..! పత్రం (ఆకు) నుండి పుట్టింది కనుక పత్రిక అయ్యుండవచ్చని అనుకుంటున్నాను. కరెక్టేనా..?
    తెలుగులో ఇంకా సంబంధిత పదాలు వాడటం మొదలవ్వలేదు కనక, భాషావేత్తలకి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. హిందీలో పైన రాసినవి ఇంచుమించు అన్నీ వాడుతున్నవే, ఇంగ్లషునే హిందీలో రాసినవి వదిలిపెట్టేసాను. ఎలక్ట్రానిక్స్‌, తక్‌ నీకీ లాంటివి..! కంప్యూటర్‌కైతే సంగణన్‌ యంత్ర్‌ అని ఉందిలెండి, మీరన్నట్టుగా..!
    @షణ్ముఖన్‌ గారు..!
    మీరిచ్చిన లంకెలు చాలా బాగున్నాయి. nanoకి మీరు కూడా ఏదో ఒకటి సూచించగలరు.

    రిప్లయితొలగించండి
  8. శర్మ గారు,
    ధన్యవాదాలు.
    ఈ కొత్త కామెంట్ బాక్స్ వల్ల నేనే పొరబడి ఉంటాననుకుంటా.
    అసలు నిజానికి కాగితపు అనే మాట వాడాలి. అచ్చ తెలుగులో అలాగే కదా అంటాము. సంస్కృతాన్ని అనుకరిస్తూ కాగిత అనే ఆలోచన వస్తున్నది.
    మీరు పత్రిక గురించి చెప్పింది నిజమే కానీ పత్ర లేదా పాత్రిక లేదా అలా ఇంకోటైదయినా తయారుచేస్తే బాగుంటుంది. అంతవరకూ కాగిత/కాగితపు అనే మాట సూటిగా ఉంటుంది.
    మిగతా వాటిలో ఇండస్ట్రియల్ = ఔద్యోగిక్ (హిందీ) అనేమాట భారత్ పెట్రోలియం వారి అధికారిక శబ్దావళిలో ఉన్నదే నేను చెప్పింది. మరి హిందీ వాళ్ళు కూడా ఒక్కోశాఖ లో ఒక్కో పదం వాడుతున్నారా, ఏమిటి?
    మీరు కూడా వాడుతున్నవే రాశానన్నారు కదా అందుకే ఈ సందేహం.
    ధాతుకర్మ్ ఏవం పదార్థ్ = లోహకార్య మరియు వస్తు అని అనవచ్చనుకుంటున్నా.
    ఈ చర్చ తెలుగుపదం గుంపులో పెడితే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  9. @మందాకినిగారూ
    నేను పొరబడ్డాను.., औद्योगिकగా సవరించాను
    చర్చ జరగాలన్నదే నా ఉద్దేశ్యం కూడాను..!

    రిప్లయితొలగించండి