5, జనవరి 2013, శనివారం

"సేవ్ ఇండియన్ ఫేమిలీ ఫౌండేషన్"వారి బహిరంగ లేఖ కి నా భావానువాదం

ఇటీవలి జరిగిన కొన్ని అతీతమైన “రేప్, ఆపైన హత్య” కేసులనూ, మీడియా ఓవరాక్షన్నూ, జనాల అతితీవ్ర స్పందననీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, మహిళాసంఘాలూ ప్రస్తుత అత్యాచార నిరోధక చట్టాలలో కొన్ని మార్పులు చేసే పనిలో ఉన్నాయి. “రేప్“ నేరానికి ప్రస్తుత శిక్ష, కనిష్ఠంగా 7 యేళ్లనుండి యావజ్జీవకారాగారం వరకూ విధిస్తున్నారు.


ప్రభుత్వం, మహిళాసంఘాల ప్రతిపాదనలవలన మారబోయేవి, జరగబోయేవి

1) శిక్ష “ఉరిశిక్ష”గా మార్పు, సాధారణ “రేప్”కి కూడా. (ఇటీవలి కేసులో అది “రేప్,ఆపైన హత్య)

2) రేపిస్టులకి “రసాయనిక నిర్వీర్యీకరణం” (Chemical castration). “రేప్” చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత “నిందితుని”దే. ఆరోపించిన ఆడది ఏ ఋజువునీ చూపనవసరం లేదు (కేసుని నమోదు చేయడానికి వైద్యపరీక్షలు అక్కరలేదు.). ఆమె యొక్క వాంగ్మూలం చాలు, ఒక వ్యక్తిని “రేపిస్ట్”అని పిలవడానికి. అమె తనపైన “రేప్”గానీ, “గ్యాంగ్ రేప్”గానీ జరిగిందని చెప్పుకుంటే చాలు, ఆ జాబితాలోని వారందరూ వెనువెంటనే అరెస్టు చేయబడతారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేవరకూ బెయులివ్వబడదు. అది 1 నెల నుండి 20యేళ్లవరక, ఎంతైనా కావచ్చు.

3) కేసు నమోదు, అయిన పిదప, విచారణకాలంలో  అమెకి 2 లక్షలు సహాయం ఇవ్వబడుతుంది, ఇందు 50వేలు వెంటనే ఇవ్వబడుతుంది., ఆ కేసు సరైనదైనా, కాకపోయినా.!

4) ఫిర్యాదుదారు కి ప్రభుత్వ ఉద్యోగం. (అందువల్ల, ప్రభుత్వ ఉద్యోగ సాధనకి అంత కష్టపడనక్కరలేదు. ఒక తప్పుడు కేసు బనాయిస్తే చాలు)

5) ఇచ్ఛాపూర్వక శృంగారం: మెదట ఇచ్ఛాపూర్వకంగా శృంగారం జఱిపినా, తాను మద్యం సేవించాననో, బలవంతంగా తాగించారనో, సదరు వ్యక్తి పెళ్ళి చేసుకుంటాడని మాటిచ్చాడనో, ఉద్యోగం ఇసానని నమ్మబలికాడనో, లేక బెదిరించి తనతో శృంగారం జరిపాడనో చెబితే “రేప్”గా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ “ఇచ్ఛాపూర్వకత” పూర్తిగా స్త్రీ యొక్క ఉద్దేశ్యాలపైన ఆధారపడి ఉంటుంది. మొదట్లో “ఇచ్ఛాపూర్వక శృంగారా”న్నిఆస్వాదించినా, ఆటుపైన “రేప్”అని పేర్కొనవచ్చును.

6) లా కమిషన్, అత్యాచార నిరోధక చట్టాన్ని “లింగాతీతం” చేయమని సిఫారసు చేసింది. తద్వారా స్త్రీ పై స్త్రీ జరిపేవి, పురుషునిపైన పురుషుడు జరిపేవి, “పిల్లలపైన స్త్రీ” జరిపేవి, ఈ చట్టపరిధిలోకి తేవవచ్చును. అయితే, ప్రభుత్వం, మహిళాసంఘాలూ ఇందుకు సిద్ధంగా లేవు.

7) వైవిహిక జీవితంలో పొరపొచ్చాలవలన “భార్య తన భర్త”పైన, “వరకట్న కేసు”, “గృహహింసకేసు” తదితర కేసులతో సహా “రేప్ కేసు” కూడా పెట్టవచ్చును.

8) రేప్/ గ్యాంగ్ రేపు అంటూ “తప్పుడు”కేసులు బనాయించిన స్త్రీ పైన ఎటువంటి చర్యలూఉండవు.

9) “పురుషుని పైన స్త్రీ” అత్యాచారం చేసినా “కేసు నమోదు”కై అవకాశం లేదు.

మా ప్రతిపాదన
వరకట్నకేసు/గృహహింస కేసులకి వలేనే “రేప్ కేసులు” కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నందున, ఇప్పుడే సరిచేయబూనుకోవాలి.
లేదా, భవిష్యత్తులో “రేప్ కేసులు” ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. బెదిరింపులకి, బ్లాక్ మెయిలింగుకీ, “డబ్బు తేలికగా సంపాదించడానికి” మరో మార్గం అవుతుంది.

1) ప్రపంచంలోని ఇతర దేశాలమాదిరి, మనదేశంలో కూడా అత్యాచార నిరోధక చట్టాన్ని “లింగాతీతం” (gender- neutral)చేయాలి.

2) సంబంధాలు బెడిసికొట్టిన కేసులను, “రేప్ కేసు”గా పరిగణించకూడదు.

3) తప్పుడు రేప్ కేసులను పెట్టినవారిని, కఠినంగా శిక్షించాలి. తద్వారా “నిర్భయ్”వంటి జెన్యూన్ కేసులు, న్యాయాన్ని పొందుతాయి

4) “రేప్ కేసుల విశ్వసనీయత”ను పెంచే విధంగా పోలీసు శాఖలో సంస్కరణలు తేవాలి.

5) సత్వర న్యాయ కలిగే విధంగా, తద్వారా “రేప్ కేసుల విశ్వసనీయత”ని పెంచే విధంగా న్యాయపరమైన సంస్కరణలు తేవాలి.

http://www.saveindianfamily.org/articles/open-letters/1169-wake-up-call-for-indian-men-government-prepares-law-to-destroy-indian-men.html

2 కామెంట్‌లు:

  1. ఈ కింద చెబుతున్నవి ఒక సారి సరి చూసుకోండి. నాకు అవి మరో అర్థాన్ని ఇస్తున్నాయనిపిస్తోంది.
    ====================================

    అమెకి 2.5 లక్షలు సహాయం ఇవ్వబడుతుంది
    అది కాదు వామన గీతగారూ వారు చెప్పేది. 2లక్షలు ఇవ్వాలి, అందులో 50,000 వెంటనే ఇవ్వాలి. ఆ కేసు నిజమా అబద్దమా అన్న దానితో సంబందం లేకుండా. తరువాత అబద్దమని తేలితే బహుషా తిరిగి ఇచ్చేస్తారేమో.

    ఇంకా ఇది బిల్లుగా కూడా రూపాంతరం చెందలేదు. కేవలం ప్రపోసల్ మాత్రమే ఉంది, కాబట్టి ఫైనల్ డ్రాఫ్టు వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.

    స్త్రీ మద్యం సేవించినపుడు, తాగించబడినపుడ, వంటి కొన్ని పరిస్థితుల్లో తప్ప, చాలా పరిస్థితుల్లో “ఇచ్చాపూర్వక శృంగారం”ని “రేప్”గానే పరిగణించబడుతుంది. అందువల్ల ఈ “ఇచ్ఛాపూర్వకత” పూర్తిగా స్త్రీ యొక్క ఉద్దేశ్యాలపైన ఆధారపడి ఉంటుంది.

    ఇది కూడా తప్పుగానే ఉంది. ఒక వేల స్త్రీ ఇచ్చాపూర్వక శృంగారం జరిపినా తరువాత, తాను అప్పుడు తాగున్నాననో లేక సదరు వ్యక్తి పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చాడనో, ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడనో, లేక బెదిరించి తనతో శృంగారం జరిపాడనో చెబితే చాలు అది రేప్ అవుతుంది. అంటే స్త్రీ తన ఇష్టా ఇస్టాలను భవిశ్యత్తులో మార్చుకున్నా అప్పటివరకూ జరిపిన శృంగారాన్ని రేప్‌గా చూపించే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నెనర్లండీ శ్రీకాంత్ గారూ..!
      మొదటిది తొందరపాటులో రాసిన తప్పు, రెండోది తేడాగా అర్థం చేసుకోవడం వలన వచ్చిన తప్పు.. రెండిటినీ సరిదిద్దినందుకు నెనర్లు..

      తొలగించండి