25, అక్టోబర్ 2013, శుక్రవారం

రాయలసీమ - 1

(సహకారం: గోపీనాధ్ - IAS Aspirations blog )
కొద్ది రోజుల ముందు రాసిన, కళింగ & ఆంధ్ర తర్వాత, 
         వేర్పాటు, సమైక్య ఉద్యమాలు ఉద్ధృతంగా జఱుగుతున్న ఈ రోజుల్లో, విడిపోవాల్సి వస్తే, "గ్రేటర్ రాయలసీమ" అడుగుతున్నారు, కొందరు. ఈ "గ్రేటర్ రాయలసీమ"లో నెల్లూరు (పాత జిల్లా), బళ్లారి జిల్లా, తిరువళ్ళూరు, వేలూరు వగైరాలన్నీ వస్తాయి. కానీ, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే, తిరువళ్లూరు, వేలూరు జిల్లాలు చెన్నపట్నాన్ని వదిలేసుకుని రాయలసీమలో చేరుతాయని నేను అనుకోవడం లేదు. అందువలన పాత నెల్లూరు జిల్లాని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాను. 
పురాణాలు, చరిత్ర
          రాయలసీమ ప్రాంత చరిత్ర చెప్పుకోడానికి ఒక్క గ్రంధం కూడా సరిపోదు.అందుకే నేనెఱిగున్న నాలుగు ముఖ్యాంశాలను రాస్తున్నాను.
  •  రామాయణకాలంలో, రాముని తరుఫున నిలిచి, రాక్షసులతో పోరాడిన కిష్కింధ రాజ్యం ఉన్నది, సీమలోనే. ఆ కిష్కింధ రాజధాని ఉన్న స్థలంలోనే, “హంపి” మహా నగరాన్ని కట్టారు, మన పూర్వీకులు. (బళ్లారి జిల్లాలో ఉన్నది).
  •  భారతదేశ చరిత్ర అంటే, గంగా-సింధు మధ్య చరిత్రేనని, దక్షిణాదిన నాగరికులే లేరని, అనుకునేవారికి అభిప్రాయాలను ముక్కలు చేస్తూ, బయల్పడిన నాగరికత తుంగభద్ర లోయలోనిది. (తుంగభద్ర లోయ, సింధు నాగరికతకి సమకాలీనమైనప్పటికీ, దానికంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం దక్షిణాది మీద ఉన్న చిన్నచూపుకి నిదర్శనంగా భావిస్తారు.)
  • హంద్రీ నదీ ఒడ్డున ఉన్నట్టివారే, ఆంధ్రులని; హంద్రీ అనే పేరే ఆంధ్రీగా, ఆంధ్ర గా సంస్కృత గ్రంథాలలో పేర్కొనబడిందని, (లేదా ఆంద్రీ నుండే హంద్రీ, ఆంధ్ర అనే మాటలు పుట్టి ఉండవచ్చని) ఒక వాదం ఉన్నది.
  • నిజాం నవాబు, బాకీ తీర్చలేక, బ్రిటీషువారికి అప్పగించిన, భూమి సీడెడ్ (దత్త మండలాలు). అర్కాటు నవాబు అప్పజెప్పిన భూమి నెల్లూరు జిల్లా (పాతది). 
  •  కీ.శే చిలుకూరి నారాయణరావు గారు , “సీడెడ్” అనే పేరుకి మాఱుగా సూచించిన పేరు “రాయలసీమ” (1928లో). అది, ఆ జిల్లా వాసుల ఆత్మగౌరవ చిహ్నంగా అందరి ఆమోదం పొందినదైందన్నది, తెలిసిన విషయమే. మరికొంతమంది, "రాయలసీమ" అనే పేరుని సూచించినది, కీ. శే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు అని అంటారు. 
  • విజయనగర సామ్రాజ్యానికి, కాకతీయ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచి, అవి కూలిపోవడానికి కూడా కారణమైన “పాలెగాళ్ళ వ్యవస్థ”ని బ్రిటీషు వారు ఏరివేసినా, అక్కడక్కడా మిగిలినవాళ్లు నేటికాలంలో ఫాక్షనిస్టులుగా ఉన్నారు. వీరందరూ, తమ వ్యక్తిగత తగాదాల్ని, కక్షలని, పగలని పక్కనబెట్టి, సీమ కోసమే కలిసి పనిచేస్తే, రాయల స్వర్ణయుగానికి, సీమని తీసుకెళ్ళడానికిపెద్ద సమయమేమీ పట్టదు, వీరికి.
 రాజధాని
          1565 సంవత్సరంలో, రాక్షసి-తంగిడి యుద్ధం తర్వాత, ఆఱు నెలలపాటు జరిగిన “హంపీ” మహానగర విధ్వంసం, దోపిడీ, తర్వాత, ఇప్పటికీ సీమవాసులకి స్థానబలిమి ఉన్న మహానగరం లేదు. మొదటినుండీ నాయకుల జన్మస్థానమైన సీమ, ఇప్పటివఱకూ రెండు నగరాల (హంపి కాకుండా) నిర్మాణంలో పాలుపంచుకొంది, మూడు నగరాలు ప్రపంచస్థాయి నగరాలుగా ఎదగడంలో అద్వితీయమైన పాత్ర పోషించింది. మొదటగా చెప్పింది, మద్రాసు, బెంగుళూరు నగరాలు గుఱించి, తర్వాత చెప్పినవాటిల్లో హైదరాబాదు అదనంగా చేరుతుంది.
          ఇప్పటికి వఱకూ, ఈ జిల్లాలో మహానగరం లేకపోవడం, వలన భవిష్యత్ కాలపు భూగర్భ మహానగరాన్ని(లని) ఇక్కడ కట్టడానికి అవకాశం కల్పిస్తోంది. చైనా దేశం, ఇప్పటికే భూగర్భ నగరాల నిర్మాణంలో ఎంతో ముందు ఉంది. దేశరక్షణ విషయంలో, ఇలాంటి నగరాల పాత్ర అద్వితీయమైనది. మిగితా భారతదేశంలోని ప్రాంతాలు, భూగర్భ నగరాల నిర్మాణానికి ఎంతవఱకూ పనికొస్తాయో తెలీదు. సీమలో చాలా ప్రాంతం , అనువైన ప్రాంతమే. అందువలన భవిష్యత్తులో కట్టబోయే రాయలసీమ రాజధాని, భారతదేశానికి “సైనిక రాజధాని”గా మారడానికి అవకాశం ఉంది. (విజయనగర సామ్రాజ్యానికి కూడా రెండు రాజధానులుండేవి. హంపి, రాజకీయ రాజధాని , పెద్ద పట్నమూ కాగా, అనంతపురం జిల్లాలోని పెనుకొండ సైనిక రాజధాని. అలాగే, మొగలులకి కూడా రెండు రాజధానులు ఉండేవి).

                కాబట్టి భారత ప్రభుత్వం ఈ దిశలో కూడా ఆలోచించాలి. 
1) కర్నూలు
అనుకూలతలు
·        ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని, అతి పెద్ద నగరము కావడం.
ప్రతికూలతలు
·        రాయలసీమలోనే ఒక చివరికి ఉండటం.
2) తిరుపతి
అనుకూలతలు
·        అంతర్జాతీయంగా ఉన్న పేరు,(యాత్రాస్థలంగానైనా సరే).
·        చెన్నపట్నానికి దగ్గర్లో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన ఇప్పటికే జరిగి ఉండటం.
ప్రతికూలతలు
·        పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతి, వాతావరణాన్ని “రాజధాని” పాడుచేసే అవకాశం ఉందన్న అనుమానాలు
·        భౌగోళికంగా చివరకి ఉండటం.
3) కడప – ప్రొద్దుటూరు
అనుకూలతలు
·        రాయలసీమ మధ్యంలో ఉండటం, (ప్రకాశం, నెల్లూరులను కలుపుకుని అయినా సరే), అలాగే, హైదరాబాదు, బెంగుళూరు, చెన్నపట్నాలకి సరిగ్గా మధ్యలో ఉండటం, కూడా.
ప్రతికూలతలు

·        విమానాశ్రయం ఇంకా లేదు (బ్రిటీషుకాలంనాటి వైమానిక దళ విమానాశ్రయం ప్రస్తుతం వాడుకలో లేదు)



2 కామెంట్‌లు: