14, మార్చి 2012, బుధవారం

శారదాపీఠం, కాశ్మీరం


 ఈ మధ్యకాలంలో అంధ్రభూమిలో వచ్చిన "కాశ్మీరులో భాషల వ్యథలు" వ్యాసం చూడడం జరిగి, వ్యాసవిషయంలోని  "శారదా లిపి" నన్నాకర్షించింది. వెంటనే గూగూల్లో కొట్టడం, వికీపీడియా వ్యాసం కనబడ్డం జరిగి కాపీ,పేస్ట్,ఎడిట్ చేసి తెవికీలోకి ఎక్కించేసాను.

అయితే.. ఈ వికీపీడియా వ్యాసాలు తిన్నగా ఉండవుగా, "ఇవి కూడా చూడండి" అంటూ ఉంటాయిగా..! సర్లే.. అంతగా బ్రతిమాలుతుంటే, మనదేం పోయిందని చూసాను.. అదే.. "శారదా పీఠం" గురించిన వ్యాసం..! అందులోని కొన్ని వాక్యాలివి..

//శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది.ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు.//

బయటి లింకుల్నించి దాని చిత్రపటాలని పట్టుకొస్తిని..!  మీరూ ఓ సారి చూస్కోండి...!

ఇంత సరదా చెప్పుతున్నావు..అంత బావుంటుందా..? అని మాత్రం అడగొద్దు.. ఎలా రాయాలో అర్థంకాక ఇలా రాస్తూ పోతున్నాను.































విగ్రహం ఏది..??????? (ఈ ఫొటో ఒకసారెప్పుడో "ఈనాడు" పత్రికలో చూసినట్టు గుర్తు.!)

సారీ..! ఫొటోలు చూసి ఎలా రియాక్ట్ కావాలో తెలీక, ఇలా రాసేసుకుంటున్నా.., ఏమనుకోకండి...!

ప్రాచీన కాలంలో, ఈ శారదా పీఠం వద్ద సంస్కృత విశ్వవిద్యాలయం ఉండేది(ట). ఎన్నెన్నో సంస్కృత గ్రంథాలు, పురాణాలు రాయబడ్డాయి(ట).


ఈ సందర్భంగా, కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలనిపిస్తోంది. ఆ మధ్య జమ్మూ మార్కెట్టులో సరుకులు అమ్ముకోడానికి అనుమతి ఇవ్వకపోతే, శ్రీనగర్ వ్యాపారస్థులు ఆందోళన చేసిన విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు, వాళ్ళు బెదిరింపులకు కూడా దిగారు ఏంటంటే, "జమ్మూలో కాకపోతే, మేం ముజఫరాబాద్ లో కూడా అమ్ముకోగలం" అని. గొడవ పూర్తిగా జ్ఞాపకం లేదుగానీ చెప్పాల్సిన విషయం వేరేది ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరువారికీ, భారతీయ కాశ్మీరు ముస్లింల మధ్యలో వ్యాపారాలేకాదు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లేనివి కాశ్మీరు పండితులకి మాత్రమే...!

ఈ గుడి సంగతి చూసారుగా...!కాశ్మీరు స్వేచ్ఛ గురించి గొంతు చించుకొని అరిచే మేధావులు(?) ఈ గుడి గురించి మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారో కనుక్కోండి..!


"గుడికెళ్ళి మా కులదేవతని దర్శించుకోనివ్వండి మహాప్రభో...!" అని అరిచి, అరిచి శోషవచ్చి పడిపోతున్న కాశ్మీరీ పండితులని ఎవ్వరూ పట్టించుకోరు.  ఎవ్వరికీ అక్కర్లేదు. ఇంక ఈ రాళ్ళూ, రప్పలూ ఎవడ్డిక్కావాలి..?  
అదండీ, "లౌకిక" భారతదేశపు దౌత్యనీతి..!

మీకింకా ఓపికుంటే, "మీరుగొట్టం" (youtube) నుండి సేకరించిన ఈ వీడియోని తిలకించగలరు. ఎవరో హస్తభూషణం ద్వారా దీన్ని చిత్రీకరించారు.



ఈ లంకెనుండి వెళితే ఇంకొన్ని ఫొటోలు చూడొచ్చు..
(పూర్తి పొటోలు చూడడం నాకైతే సాధ్యం కాలేదు. మీకు కుదురుతుందేమో ప్రయత్నించండి)

----------------------
నాకు ఎమర్జెంటుగా టపా వేసెయ్యాలనిపించి వేసేసాను. రాత నచ్చకపోతే తిట్టుకోవద్దు..!


2 కామెంట్‌లు:

  1. మంచి పని చేశారు.
    ఇలా ఉందని కూడా తెలీదు.
    ఆదిశంకరులు ఉత్తరాన బదరిలో పీఠాన్ని స్థాపించిన విషయం ఒక్కటే తెలుసు.
    శారదా పీఠం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. @మందాకినిగారు..!
    శారదా పీఠం గురించి తెలీదన్నారు కాబట్టి.. ఇంకో రెండు వాక్యాలు రాస్తున్నా.
    మనదేశంలో పురాణకాలం నుండీ ఉన్న సరస్వతీ ఆలయాలు ఇది మొదటిది, రెండోది మనరాష్ట్రంలో ఉన్న బాసర.
    అదీయునుగాక, అష్టాదశ శక్తిపీఠాలు అని చాలా మంది నిత్యం తలుచుకొనేవాటిలో "సరస్వతీ దేవి" అంటే ఇక్కడి దేవతే..!
    ఈ శ్లోకం, ఇక్కడి శక్తిపీఠానికి సంబంధించినదే..!
    //జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
    మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ//
    ఇది ఆదిశంకరులు రాసిన స్త్రోత్రంలోని చిన్న ముక్క
    //వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి
    అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //

    టపా వీక్షించినందుకు ధన్యవాదాలు..!

    రిప్లయితొలగించండి