25, అక్టోబర్ 2013, శుక్రవారం

రాయలసీమ - 2

చిత్ర పటాలు 


ఏ మార్పులూ, చేర్పులూ లేకుంటే ఏర్పడబోయే "రాయలసీమ"


రాష్ట్ర పునర్విభజన సంఘం (SRC) - 2 వేస్తే, నెల్లూరు (పాత జిల్లా), బళ్లారి కలిపిన "పెను రాయలసీమ" (Greater Rayalaseema)


రావలసిన అభివృద్ధి పనులు
1) జలయజ్ఞం లోని అన్ని ప్రాజెక్టులు: “శ్రీశైలం”, “నాగార్జునసాగర్”, ప్రాజెక్టు నీళ్ళ పంపకంలో సాంకేతికంగా ఎడారి ప్రాంతమైన, రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు అందించడానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి(దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్ర కన్నా). విభజనకి ముందే, నీళ్లపంపకాలను నిర్దేశించాలి. ముఖ్యంగా, 

  • దుమ్ముగూడెం – నాగార్జునసాగర్ కొన చెఱువు (Tail Pond)ప్రాజెక్టు.
  • హంద్రీనీవా – సుజల స్రవంతి
  • పోలవరం ప్రాజెక్టు (ఇందిరాసాగర్)
  • తెలుగు గంగ.
     వేగంగా పూర్తిచేయాలి. 
2) ఖనిజ వనరులు విరివిగా ఉన్న కారణంగా “రాయలసీమ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ” (Rayalaseema Mineral Development Corporation) ఏర్పాటు చేయాలి. రాయలసీమలో ఖనిజాల వెలికితీత, సరఫరా వగైరాలలో రా.ఖ.వ సంస్థకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
3) భౌగోళికంగా, మూడు వైపులా మూడు మహానగరాలు ఉండటం వలన, ఈ ప్రాంతంలో భారీసంఖ్యలో ఉద్యోగ/ఉపాధి కల్పన జరగకపోవడం వలన, ఇక్కడ నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయి.

  •  రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINL-వైజాగ్ స్టీల్)సంస్థ ద్వారా;కడప,అనంతపురం జిల్లాల్లోని ఖనిజాలను వాడుకునేలా కడప/అనంతపురం జిల్లాలో భారీ ఉక్కు కర్మాగారాన్ని(లని) నెలకొల్పాలి.
  • భారతీయ సిమెంటు సంస్థ (Cement Corporation of India), రెండు – మూడు చోట్ల భారీ సిమెంటు కర్మాగారాలను ఏర్పాటుచేయాలి.
  • “భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్”, “హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటేడ్”, “మిశ్ర ధాతు నిగమ్”, వంటి ప్రభుత్వ, రక్షణ రంగ పరిశ్రమలని ఏర్పాటు చేయాలి.
  • 1956 అనంతరంహైదరాబాదులో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వసంస్థల్లో 25%న్ని రాయలసీమకి పూర్తిగా తరలించాలిలేదా వాటిల్లో 40% సంస్థలు తమ కార్యకలాపాలని రాయలసీమలో పెద్దయెత్తున విస్తరించాలి. 
4) రైల్దారులు (Railways)

  • నడికుడి(ఆంధ్ర) -దొనకొండ –పొదిలి-కనిగిరి -బద్వేలు-కడప-రాయచోటి-మదనపల్లి-బెంగుళూరు(కర్ణాటక)
  • జడ్చర్ల – రాయవరం (తెలంగాణ)– ఆత్మకూరు – నంద్యాల – ఆళ్లగడ్డ – ప్రొద్దుటూరు-ఎఱ్ఱగుంట్ల - పులివెందుల – కదిరి – మదనపల్లి.
  • బళ్లారి – ఆదోని- కర్నూలు-ఆత్మకూరు- ఎర్రగొండపాలెం–మాచర్ల (ఆంధ్ర)
  • నెల్లూరు – బద్వేలు – మైదుకూరు –ప్రొద్దుటూరు
  • గూడూరు – రాపూరు – రాజంపేట – రాయచోటి – కదిరి – పెనుకొండ- చిత్రదుర్గ (కర్ణాటక)
  • రాయదుర్గ – కళ్యాణదుర్గం-అనంతపురం- తాడిపత్రి- కోయిలకుంట్ల- నంద్యాల
5)

  •  తిరుపతి నుండి కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధారవాడ వఱకూ (చెన్నపట్నం – ముంబయి స్వర్ణచతుర్భుజి రాదారికి సమాంతరంగా) 6 వరుసల రాదారి(6-Lane Highway)ని నిర్మించాలి.
  • కర్నూలు – కడప – చిత్తూరు జాతీయ రహదారి విస్తరణని వేగంగా పూర్తిచేయాలి.  
6) పరిశోధనా సంస్థలు – విద్యాలయాలు

  • రాయలసీమ కేంద్రీయ విశ్వవిద్యాలయం. (అనంతపురం) – Rayalaseema Central University
  • భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నెల్లూరు) – IIT/NIT
  • అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (తిరుపతి) - AIIMS
  • జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (కర్నూలు) – National Law University
  • భారతీయ విజ్ఞాన శాస్త్రాల సంస్థ (Indian Institute of Science), రెండవ ప్రాంతీయ విస్తరణ కేంద్రం. (అనంతపురం జిల్లా) – IISc – Regional Extension Centre – 2.
  • భారతీయ అణువిజ్ఞాన సంస్థ (కడప) – Indian Institute of Nuclear Sciences.
  • భారతీయ విజ్ఞాన శాస్త్రాల అధ్యయన & పరిశోధనల సంస్థ (సూళ్లూరిపేట)ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కు అనుబంధంగా, Indian Institute of Science Education & Research.
  • జాతీయ సంగీత విద్యాలయం (తాళ్లపాక, కడప జిల్లా) – National School of Music
  • గిరిజన విశ్వవిద్యాలయం (శ్రీశైలం/ నల్లమల) 
  • భారతీయ ఖనివిజ్ఞాన విద్యాలయం (Indian School of Mines),
  • కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం (నంద్యాల) – Central Agricultural University

7) తిరుపతిలో సైబర్ టవర్స్ ఏర్పాటు చేసి, “సమాచార సాంకేతికతల పెట్టుబడుల సీమ” (Information Technology Investment Region)ని ఏర్పాటుచేయాలి. 

8) వీలైతే, రెండు సైనిక గృహ సముదాయాలని(Cantonment Boards) ఏర్పాటు చేయాలి. బ్రిటీషువారికాలంలో యుద్ధవిమానాల బ్యాకప్ స్థావరంగా ఉపయోగపడిన కడప విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలి, లేదా సమీపంలో మరో వైమానికి స్థావరాన్నిగానీ, వైమానిక శిక్షణా కేంద్రాన్ని గానీ ఏర్పాటుచేయాలి. 

7 కామెంట్‌లు:

  1. బ్రదర్, నీవు ఆశించినట్లు అన్నీ జరిగితే చాలా మంచిది. కాని రాజకీయనాయకులలొ నిజాయితి వుంటె ఇవన్నీ నిజమవుతాయి. రామకృష్ణ, తిరుపతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి..
      వారికి నిజాయితి ఉంటే, తె.వాదుల చేత మాటలు పడవలసిన అగత్యం వచ్చేదే కాదు.
      రాష్ట్రం విడిపోయినా, విడిపోకపోయినా మన రా.నా లు సొంత ఊళ్లలకి పాధాన్యత ఇవ్వడం ప్రారంభించాలి.

      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. దయచేసి ప్రత్యేక కోనసీమరాష్ట్రం గురించి కూడా వ్రాయండి. కోనసీమ అభివృధ్ధిని ఎవరూ పట్టించుకోలేదు.
    అంధ్రప్రదేశ్‌రాష్ట్రాన్ని అసలు ఎన్ని ముక్కలుగా చేయవచ్చునో అన్న విషయం మీద బోలెడు రీసెర్చి జరగా లేమో.
    అంత ఓపిక లేకపోతే జిల్లాకొక రాస్ట్రంగా ఏర్పాటు చేయవచ్చును.
    బీజేపీ అనే గొప్ప జాతీయవాద పార్టీలవారూ చిన్నరాష్ట్రాలే చింతలు లేని రాష్ట్రాలు అంటూ మొత్తుకుంటూన్నారు.
    ఈ విషయంలో మన తెలుగువాళ్ళం దేశానికే మరొకసారి ఆదర్శంగా నిలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
    ఏ మంటారు?
    దేశాన్ని ఇలా జిల్లాల వారీగా రాష్ట్రాలుగా విడగొడితే అసలు లోక్‌సభ అవసరమే లేదు. మన ముఖ్యమంత్ర్ల సభ ఒక్కటీ సరిపోతుంది కూడా.
    దేశభవిష్యత్తు అంటున్నారా? అదేమిటండీ - అది మనచేతులో ఉందా చెప్పండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ బాధని అర్థంచేసుకోగలను, శ్యామలరావుగారు..!!

      కానీ, మన కోస్తాంధ్రవారి పరిస్థితి ఏమీ బాగోలేదు, ఇప్పటి వఱకూ, తెలంగాణవాదుల చేత మాటలు పడ్డాం (సీమవారితో కలిసి), ఇప్పుడు రాష్ట్రం విడిపోతుందంటున్నారు. మధ్యలో తుఫానొక్కటి వచ్చి నెత్తిన పడింది, రేపు, సీమవారు కూడా కోస్తావారినే అంటారు.

      రాష్ట్రం విడిపోకపోతే, మంచిదే..! కాదనను, కానీ, విడిపోతే మనకు అవకాశాలెక్కడ.?

      ఇప్పుడు, మనక్కావలసినవి ఇవి, అని రాయకపోతే, విడగొట్తేసిన తర్వాత, ఇంకెవడూ వినడు. పైపెచ్చు, "అప్పుడెందుకు అడగలేదు?" అని ఓ నిర్లక్ష్యపు ప్రశ్న వేస్తే, ఏం చేస్తాం.?

      మీరు కోనసీమ గుఱించి, గుర్తుచేసారు, కనుక రాస్తున్నాను, గత 70 యేళ్ళుగా చెబుతున్నప్పటికీ, కోనసీమకి రైలు లైను లేదు. ఎప్పట్నుండో అడుగుతున్న కోటిపల్లి-ముక్తేశ్వరం దగ్గర గోదావరి పైన వంతెన, ఇప్పటికీ లేదు. కోనసీమలో ఇంకా పడవలమీద ఇంకా రవాణా జరుగుతూనే ఉందిగా..! కీ.శే బాలయోగి, ఉన్న సమయంలో యానాం-ఎదుర్లంక వంతెన, కాకినాడ-కోటిపల్లి రైలు వచ్చాయి, అంతే..!

      ఆ మాటకొస్తే, విశాఖపట్నం-కాకినాడ-రాజమండ్రి ప్రాంతానికి అటువైపూ, ఇటువైపూ అభివృద్ధిలేదు, అడవులూనూ. తూ.గో.జి లోనే, మూడు-నాలుగు రోజులకి గానీ, చేరలేని ప్రాంతాలు బోలెడు ఉన్నాయి.

      ఇకపోతే, నా దృష్టిలో బిజేపీ అంటే మతిలేని దేశభక్తుల పార్టీ..! అఖండ భారత్ అనేవాళ్ళు, బాబ్రీ అనంతరం, దాని ప్రతిక్రియగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కూలిన 500 పైగా దేవాలయాల గుఱించి, సమాధానం చెప్పలేరు. ఇంతా చేసి, అక్కడ గూడీ కటలేకపోయారు, గానీ అవతల గుళ్లు కూలడానికి కారణమయ్యారు. అది, వాళ్ల "అఖండ భారతం".

      తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ ని విడగిట్టేయాలి, పరుగులు పెడుతున్న బిజేపీ, ఉత్త్రరప్రదేశ్ విభజనకి ఒప్పుకోదు, "జై తెలంగాణ", "జై సీమాంధ్ర" అనే మోదీ, "జై సౌరాష్ట్ర" అని మాత్రం అనడు.

      అందరూ, కట్టకలిసి కత్తిగట్టినపుడు ఆపద్ధర్మం కూడా వదిలేసి, "జై సమైక్యాంధ్ర" అని అరిచి మాత్రం ఏం ఉపయోగం ఉంది.? రెణ్ణెళ్ళు జీతాలు తీసుకోకుండా, ఉద్యమం చేసినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా ఉందా.?

      ధన్యవాదాలు.

      తొలగించండి
    2. అవునండీ, ఈ‌ గందరగోళం అంతా చిరాకు తెప్పిస్తోంది.
      దీనికి సుదూరభవిష్యత్తులో రెండు పరిష్కారాలు కనిపిస్తున్నాయి.
      ఐకమత్యం విలువ తెలియని తెలుగుజాతికి బుధ్ధి చెప్పే పరమ కటువైన పరిష్కారాలు అవి.

      - 1. ఈ తెలుగుగడ్డని ముక్కలు ముక్కలు చేసి పొరుగురాష్ట్రాల్లో కలిపివేస్తారు. -లేదా-
      - 2. ఏదో ఒక నాడు, మనదేశంలో ఈ పరోక్షవిదేశీపాలన పోయి ప్రత్యక్షవిదేశీ పాలన వచ్చి
      - వారికి అనుకూలంగా దేశాన్ని విభజించుకుంటారు.

      ఇందులో ఏది జరుగుతుందో చెప్పలేము.
      వీటికి భిన్నంగా మరేదైనా మంచి పరిస్థితి వస్తే సంతోషమే.
      కాని అలా కనిపించటం లేదు.
      శివసంకల్పమస్తు.

      తొలగించండి
    3. వ్యాపారం చేసుకునేవాళ్ళను MPలుగా ఎన్నుకోవడమే ప్రజల తప్పు.
      ఈ కీలక సమయంలో ఆ MPలు రాజకీయం కంటే వాళ్ళ వ్యాపారమే ముఖ్యమనుకుంటున్నారు.
      లేకపోతే వీళ్ళకు చిత్తశుద్ది ఉంటే, ఇప్పటికైనా 19 మంది సీమాంధ్ర కాంగ్రెస్ MPలు మూకుమ్మడిగా రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి పార్టీని, పదవులని వీడుతున్నాం, మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అని వ్రాసి ఇస్తే అధిష్టానం దిగి రాదా?


      తొలగించండి
    4. @శ్యామలరావుగారు
      చూద్దామండి..
      ధన్యవాదాలు..

      @బోనగిరిగారు..
      ఇదే మాట, ఎవరో కేంద్ర మంత్రి కూడా అన్నట్టు గుర్తు, పార్ట్ టైం రాజకీయాలు చేసే వాళ్లమాటలని సీరియస్ గా ఎలా తీసుకుంటాం.? అని..

      రాజీనామాలు చేసి, ఒత్తిడి పెంచే పరిస్థితిలో వారు ఉన్నారో లేదో, అని నా డవుటు. ఇప్పటిదాకా, హై కమాండు విభజన చేయదులేనన్న ధీమాతో వారంతా, "అధిష్టానాని"కి కట్టుబడి ఉంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు, నమ్ముకున్న అధిష్టానం వారిని నట్టేట ముంచి, "జగన్", "తెరాస్"ల తోకలు పట్టుకుని 2014 ఎన్నికలు అనే గోదారి ఈదేద్దామని అనుకుంటోంది.

      వారు ఏం చేద్దామన్నా, "పంజరంలోని చిలుక"ని చూసి, బెదురుతున్నారని నా అనుమానం. వారి పరిస్థితి, ముందు నుయ్యి, వెనుక గొయ్యి.

      మొత్తానికి, కాంగ్రెస్సు తెలుగువాళ్లలని రెండోసారి వెఱ్ఱివాళ్లని చేసేసినట్టేనని, నిర్ధారించుకుని, ఈ పోస్టులు వేయడం మొదలెట్టాను.

      ఏది ఏమైనా, కామెంటినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి