21, ఏప్రిల్ 2012, శనివారం

అగ్గి పడింది..!



మొత్తానికి భారత్ పంచమాగ్ని (అగ్ని -5)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆగ్నేయాస్త్రం సైన్యం చేతుల్లోకి రావడానికి ఇంకో రెండేళ్ళు పడుతుంది. అయితే ఈలోపులోనే మన శత్రు దేశాలకి, ముఖ్యంగా మన దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న దేశాలకి రంగు పడింది. అక్కడితో మనం సంబరాలు చేసేసుకోవడమేనా.? కానే కాదు...
ఎందుకంటే, ఈ వార్త చూడండి.
// భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి ఆ ప్రభుత్వం చెప్తున్నదానికన్నా ఎక్కువ శక్తివంతమైందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లగల ఈ క్షిపణికి వాస్తవానికి 8 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందని ఓ చైనా పరిశోధకుడు చెప్పడం గమనార్హం. ‘వాస్తవానికి అగ్ని-5 క్షిపణికి 8 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగల శక్తి ఉంది’ అని చైనాకు చెందిన పిఎల్‌ఏ అకాడమీ ఆఫ్ మిలిటరీ సైనె్సస్‌లో పరిశోధకుడుగా పనిచేస్తున్న డు వెన్‌లాంగ్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రికతో అన్నారు. ఇతర దేశాలకు ఆందోళన కలగకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ క్షిపణి సామర్థ్యాన్ని తక్కువ చేసి చెప్తోందని ఆయన అన్నారు. అగ్ని-5 క్షిపణి అయిదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల లాంగ్ రేంజ్ క్షిపణి అని ఈ క్షిపణిని రూపొందించిన డిఆర్‌డిఓ శాస్తజ్ఞ్రులు ప్రకటించడం తెలిసిందే.
ఈ క్షిపణి ప్రయోగంతో భారత్ ఈ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన చేరింది. కాగా, చైనా స్టాండర్డ్స్ ప్రకారం ఖండాంతర క్షిపణి అంటే కనీసం 8 వేల కిలోమీటర్ల రేంజి ఉన్నదని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఝాంగ్ ఝావోఝోంగ్ అన్నారు. అంతేకాకుండా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా తయారు కావడానికి అగ్ని-5 క్షిపణి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చని కూడా ఆయన చెప్పారు.//


అగ్ని-5 క్షిపణి, చెప్తున్నదానికన్నా ఎక్కువ శక్తివంతమైందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు(ట). దాని సామర్థ్యం గురించి ప్రచారం చేసుకోవాల్సింది మన దేశమేగానీ, చైనాకెందుకంత ఆసక్తి..?
మొట్టమొదటి కారణం, ముఖ్యమైన కారణం, భారత ఆగ్నేయాస్త్రాన్ని చూసి చైనా నిజంగానే అదిరింది. ఆధునిక యుగంలో భారతదేశానికి చైనా బెదరడం ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుశా, చైనా దృష్టిలో భారతదేశం
పాశ్చాత్యుల చేతిలో ఒక పావు, అంతే తప్ప భారతదేశానికి ఒక విధానమంటూ లేదు. సరిగ్గా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశం. భారతదేశాన్ని ఇప్పటివరకూ చాలా దేశాలు ముఖ్యంగా చైనా సీరియస్సుగా తీసుకున్నట్టు కనబడదు. ఇకపైన సీరియస్సుగా భారత్కు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో తన గళాన్ని విప్పబోతోంది.
రెండవ కారణం ఆసియాకి నేతృత్వం వహించడానికి మరో దేశం సిద్ధమౌతోందేమోనన్న అనుమానం. వియత్నాం, టిబెట్ వంటి ఆసియా దేశాలు/ప్రాంతాలు ఇప్పటికే చైనా వ్యతిరేకత ద్వారా ప్రపంచదేశాల దృష్టిలో ఉన్నాయి. వాటికి దిశానిర్దేశం చేసేవారెవ్వరూ లేరు. 
అగ్ని-5  పరిధి ( DRDO ప్రకటన ప్రకారం)

అదలా ఉంచితే, చైనా శాస్త్రవేత్తల ప్రకటనలోని ముఖ్య ఉద్దేశ్యం, ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశపు "అగ్ని" మీద అనుమానాలనీ, భయాలనీ రేకెత్తించి, ఈ అస్త్రాన్ని సైన్యానికి దక్కనివ్వకుండా చేయడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకి "అగ్ని" ఊతం ఇవ్వబోతోందని చాలామంది భావిస్తున్నారు. అయితే, చైనా చేయబోతున్న ఈ ప్రచారాల వల్ల అవన్నీ బూడిద పోసిన పన్నీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ "సూర్య" అనే ఖండాంతర క్షిపణి కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహిస్తోందని అన్ని దేశాలూ అనుమానిస్తున్నాయి. వాటికీ చైనా ప్రచారం అదనం. ఇంక మండలి సభ్యత్వానికి ఏ దేశాలు మద్దతునిస్తాయి.?


ఈ సూర్య క్షిపణి కార్యక్రమం 1995 నుండి భారత్లో జోరుగా నిర్వహింబడుతున్నట్టు పలుదేశాల్లో పుకార్లు వ్యాపించి ఉన్నాయి. దాని పరిధి 10,000 కి.మీ నుండి 16,000 కి.మీ వరకూనట. ఈ గాలివార్తలన్నిటినీ రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO) ఖండిస్తూ వస్తోంది. అయినా, ఈ అనుమానాలు తగ్గట్లేదు. వాస్తవానికి ఈ సామర్థ్యం సాధించడం భారత్కు అంత కష్టమేమీ కాదు(ట). కానీ ఆయుధపోటీకి దారి తీసే అవకాశమున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.


ఏదియేమైనప్పటికీ, దౌత్య విధానంలో దూకుడును సంతరించుకోవాల్సిన అవసరం, అవకాశం భారతదేశానికి "అగ్ని" కల్పిస్తోంది. ఇంకో విధంగా చెప్పాలంటే "తప్పనిసరి చేసింది".

7 కామెంట్‌లు:

  1. బాగా రాశారు. తెలుగు పేపర్లలో అన్నిటికన్నా నమ్మదగిన పేపర్ ఆంధ్రభూమి అని నా అభిప్రాయం. అందులోను ఏడిటొరియల్ రాసేవారు, మనదేశం, దాని అవసరాలను, దేశం గురించి మనలను ఆలోచించే విధంగా, మనదేశ అవసరాల కోణం నుంచి చాలా చక్కగా అభిప్రాయలు రాస్తారు. ఎక్కడా కౌంటర్ అభిప్రాయానికి తావిస్తూ, అటువంటి వ్యాసాలను ప్రచూరిస్తూ దేశభక్తిని పలుచన చేయరు. మిగతా ఏ తెలుగు పేపర్లలోను ఇది కనపడదు.

    రిప్లయితొలగించండి
  2. @bonagiri & Sraya Vattikuti
    నెనర్లు
    @Srinivas
    నా అభిప్రాయం కూడా ఇంచుమించు అదే. అయితే, కొన్ని పేపర్లు అన్ని విషయాలనూ నిష్పక్షపాతంగా రాయకపోయినా, కొన్ని విషయాల్లో ప్రమాణాలని పాటిసున్నాయి. ఈనాడు అందులో చాలా ముఖ్యమైనవి. ఎడ్యుకేషన్ విషయంలో ఏ తెలుగు పత్రికా, ఈనాడుకి సాటి రాదని నా ఉద్దేశ్యం. ఇంక, మీరన్న దేశభక్తి విషయానికొస్తే దాదాపుగా అన్ని పత్రికలూ "దేశభక్తి"ని ప్రదర్శిస్తూ ఉంటాయి, నిజంగా లేకపోయినా. ఎందుకంటే, వ్యతిరేకంగా రాస్తే "మనకెందుకులే అనుకొని వదిలేసే" మేధావులు విరుచుకుపడతారు కాబట్టి. వాళ్ళు చాలా ప్రమాదకరం. వీళ్ళ మౌనం వల్లనే రాజకీయాలు, చాలా రంగాలు ఇంత నికృష్టంగా ఉన్నాయి. వాళ్ళని కెలికితే, చాలా చెత్త పేపర్ల భాగోతం బయటపడుతుంది. ఊరికే గోల చేసి, రాళ్ళు రువ్వి ఫర్నీచరు తగలేసేవారికన్నా ఈ మేధావులే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తారు. అందుకే ఇటువంటి రాతలని ఏ పత్రికా రాయదు. (నా ఉద్దేశ్యం). మరీ రాజ్ థాకరే, దిగ్విజయ్ సింహ్ వంటి వాగుడుకాయల రాతలని రాయకుండా ఉండవులెండి. అది వేరే విషయం. ప్రస్తుతం, చాలా పత్రికలు గ్రూపులు కట్టి, ఒకరిమీదింకొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అది తెలుగు ప్రజల దౌర్భాగ్యం, తెలుగు భాష దౌర్భాగ్యం. అటువంటి పత్రికల కోవలోకి ఈ ఆంధ్రభూమి రాదు. అక్కడి వరకూ చెప్పగలను.

    అయినా, ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. మొన్నో వీర కమ్యూనిస్టు పత్రిక, ఈ అంధ్రభూమి ఎడిటర్ని "పరివార్" తరహా చింతకుడని అభివర్ణించింది. అఫ్ కోర్స్, "పరివార్" దేశద్రోహ ముఠా కాదు. కానీ ఆ కమ్యూనిస్టు పత్రిక దృష్టిలో అది సమాజద్రోహి. దాని రాతలని బట్టి చూస్తే అది కచ్చితంగా తిట్టే...!

    కామెంటినందుకు నెనర్లు

    రిప్లయితొలగించండి
  3. ఆంధ్రభూమి లో విలేఖరులు ఎవరు ఉండరు. అందరు రచయిత లే అని అందరు అంటుంటారు. వార్తలను ఊహించి రాస్తారు

    రిప్లయితొలగించండి
  4. శ్రీకాంత్ గారు..!
    అవునా..! నాకు పెద్దగా ఐడియా లేదులెండి..
    నెనర్లు.

    రిప్లయితొలగించండి
  5. *ఆంధ్రభూమి లో విలేఖరులు ఎవరు ఉండరు. వార్తలను ఊహించి రాస్తారు.*
    బహుశా ఇతనికి తెలియదేమో గాని చదువుకొనే రోజులలో మేము యునివర్సిటిలో స్ట్రైక్ చేసినపుడు, పత్రికా విలేఖరుల పై పూర్తి అవగాహన వచ్చింది. మేము పత్రికలకు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక్క లైన్ కూడా పేపర్లో అచ్చు అవకపొగా సదరు విలేఖరి తనకు నచ్చింది రాశాడు. ఈ రోజులలో అసలికి విలేఖరుల అవసరం పెద్దగా ఎమీ లేదు. ఎలెక్ట్రానికి మీడియా ఉంది అది చాలు. జిల్లా ఏడిషన్ చూడండి అన్ని ప్రతి రోజు అవే వార్తలు ఉంటాయి. పెద్దవారి ఇళ్లలో జరిగే పెళ్లి, రోడ్డు బాగాలేకపోవటం,భర్యను వేదింపులకు గురిచేసిన భర్త, ఒకటో రెండో రేపు కేసు, రాజకీయ నాయకుల స్వాగత సమాచారం, లోకల్ యాడ్స్. ఇంతకు మిచ్మి ఎమీ ఉంట్టాయి విరి దగ్గర న్యుస్. అవే వార్తలను పేర్లు మార్చి, కాపి పేస్ట్ వేసి ప్రచూరిస్తూంటారు.

    రిప్లయితొలగించండి