14, జులై 2011, గురువారం

అమూల్‌ బేబీగారూ....! జనంతో కామెడీలొద్దు..!

అయ్యా..! అమూల్‌ గాంధీగారూ..! సారి..! రాహుల్‌ గాంధీగారూ..! 30 మందిదాకా చచ్చి ముంబై మొత్తం ఏడుస్తుంటే(ఆ మాటకొస్తే దేశం మొత్తం బాధపడుతోంది.!), నువ్వు..! సారీ..! మీరు వచ్చి మేం 99% దాడుల్ని ఆపేశాం..అంటారా..? ఇది మీకేమైనా భావ్యంగా ఉందా..? 2004 నుండి 2009 వరకూ 25వేల ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయి మీ ప్రభుత్వమే చెప్తోందే..! అంటే మీరు దానికి 99రెట్ల కార్యకలాపాలని అపారా..? అవునని మీరనేసినా మేం నమ్మే స్థితిలో లేం..! ఎందుకంటే మీరు అమూల్‌ బేబీ కద.!
మొన్నామధ్యన ఎప్పుడో..ఈ దేశానికి హిందూ తీవ్రవాదులతోనే ఎక్కువ సమస్య అని, ఎవడితోనో వాగారు కదా..! ఇది కూడా వారి పనేనంటారా..? మీరు అలా అనేసినా, ఎవరూ నమ్మరు. ఎందుకంటే మీరు అమూల్‌ బేబీ కద.!
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో జనాలు ఏమైపోయినా పర్వాలేదు..మీకు.! యూపికో బీహార్‌కో పోయి గుడిసెల్లో హాయిగా పడుకుంటారు. మీకు ఉత్తర్‌ ప్రదేశ్‌, అక్కడి ఎన్నికలు, అక్కడి ముస్లింల ఓట్లే ముఖ్యమనుకుంటే, మాయావతి గురించో, బిజేపి లేదా ఆరెస్సెస్‌ గురించో వాగండి.! ఓట్లు గుద్దుతారు.. అంతేకానీ..! ఇలా కామెడీలు చేస్తే ముందు మిమ్మల్ని గుద్దుతారు.
JNU లో డిగ్రీవాళ్లు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేక పరిగెట్టారు..కదా..! అప్పడే దేశంలో సగం మంది కుర్రాళ్లకి తెలిసొచ్చింది..మీరింకా అమూల్‌ బేబీయేనని..! అయినా శుభ్రంగా గుడిసెలో పడుకోక మీకెందుకొచ్చిన మీటింగ్‌లు మేష్టారూ..!
అన్నట్టు, చెప్పడం మరిచాను..మా ఫ్రెండొకడు చెప్పాడు, అమూల్‌ బేబీ ఫేన్స్‌ అసోసియేషన్‌ ఒకటి స్టార్ట్‌ చేస్తున్నాడట.! దాని మిషన్‌ ఏంటంటే..మీరు ఎక్కడికెళ్తే అక్కడ..అమూల్‌ వారి పాలు,వెన్న మొదలైనవి ఏర్పాటు చేయడం..! ఇప్పట్నుంచి అమూల్‌ కోసం సోనియమ్మ దగ్గర మారాం చేయక్కర్లేదు..! అలాగే జనం మధ్యలోకి వచ్చి ఇలాంటి కామెడీలు చేయక్కర్లేదు..! ఎందుకంటే.. అమూల్‌ కోసమే మీరిలాంటి కామెడీ చేస్తున్నారని వాళ్ల ఫీలింగ్‌..అదే నిజమైతే, మీ కోసమే ఏర్పాటు చేసిన అమూల్‌ బేబీ ఫేన్స్‌ అసోసియేషన్‌ వస్తోంది.! మీరీ కామెడిలు మానెయ్యండిక.!
చాలా దాడుల్లాగే,ఇప్పటికే ఈ దాడిని జనాలు మర్చిపోతున్నారు(ముంబై జనాలతో సహా..!)..! మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల, నాలాగే చాలా మందికి ఒళ్లు మండుతోంది. ఈసారి, మీరు ముంబై వస్తే, బహుశా, జనాలే మీకు బుద్ధి చెప్తారనిపిస్తోంది..! ఎందుకైనా మంచిది, అటువైపు వెళ్లకండి! బుద్ధిగా యూపీలోనే ఏ గుడిసెలోనో పడుకోండి.!ఈసారైనా బుద్ధిగా ఉండండి. ఇంకోసారి కామెడీ చేస్తే ఆ గుడిసెలోళ్లే మిమ్మల్ని బయటకి గెంటేస్తారు....! జాగ్రత్త.!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి